తెలుగు న్యూస్  /  Lifestyle  /  Sunday Motivation On When Trust Is Broken, Sorry Means Nothing

Sunday Quote : ప్రేమను సంపాదించినంత ఈజీ కాదు.. ఒకరి నమ్మకాన్ని పొందడం..

31 July 2022, 8:54 IST

    • ఒకరి ప్రేమను సంపాదించడం కన్నా.. వారి నమ్మకాన్ని సంపాదించడం చాలా కష్టం. అంత కష్టపడి వారి నమ్మకం సాధించాక దానిని బ్రేక్ చేశారంటే మీకన్నా మూర్ఖులుండరు. మిమ్మల్ని నమ్మినవారి నమ్మకాన్ని బ్రేక్ చేస్తున్నారంటే మీరు పెద్ద తప్పు చేస్తున్నట్లే. ఒక్కసారి వారు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని కోల్పోతే.. ఎప్పటికీ దానిని మీరు తిరిగి సంపాదించలేరు.
sunday quote
sunday quote

sunday quote

Sunday Motivation : ఏ వ్యక్తి నమ్మకాన్నైనా సంపాదించడానికి కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. ఎందుకంటే ఎవరూ ఎవర్నీ అంత ఈజీగా నమ్మరు కాబట్టి. సో ఒకరిని నమ్మడానికి చాలా సమయం పడుతుంది. కానీ ఆ నమ్మకాన్ని పోగొట్టుకోవడానికి ఎక్కువ సమయం ఏమి పట్టదు. ఇన్ని సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్న ఆ నమ్మకాన్ని మీరు ఒక్క క్షణంలో బ్రేక్ చేయొచ్చు. నమ్మకం అనేది చాలా సున్నితమైనది. ఎంత కష్టపడి సంపాదించుకున్న.. ఒక్క చిన్న మూమెంట్ చాలు దానిని కోల్పోవడానికి.

ట్రెండింగ్ వార్తలు

Poppy Seeds Benefits : గసగసాలతో అనేక ప్రయోజనాలు.. కంప్లీట్ సమాచారం మీ కోసం

Wedding Dress : పెళ్లి బట్టలు చాలా సంవత్సరాలు భద్రపరిచేందుకు కొన్ని సింపుల్ టిప్స్

Cool Places in AP: వేసవిలో విశాఖపట్నానికి వెళితే కచ్చితంగా చూడాల్సిన చల్లటి ప్రదేశాలు ఇవే

Washing Fruits: పండ్లపై ఉన్న కనిపించని పురుగుమందులను ఇలా సులువుగా తొలగించండి, వాటితో క్యాన్సర్ వచ్చే ప్రమాదం

మిమ్మల్ని నమ్మడం ప్రారంభించాక.. మీరు వారి నమ్మకాన్ని బ్రేక్ చేసి.. సారి అలా చేసి ఉండకూడదు అంటే ఆ నమ్మకం తిరిగివస్తుందా? మీరు ఎంత కిందా మీదా పడి బతిమాలినా.. ఆ నమ్మకం తిరిగి రాదు. ఒకవేళ వచ్చినా.. మిమ్మల్ని ఇబ్బంది, బాధ పెట్టకూడదని ఓకె చెప్తారేమో కానీ.. ఎప్పటికీ మీరు వారి పూర్తి నమ్మకాన్ని పొందలేరు. మీకు ఇంకొక ఛాన్స్ ఇచ్చినా.. వారికి ఇక ఏ మాత్రం మీపై నమ్మకం ఉండదు. అందుకే ఒకరి నమ్మకాన్ని విచ్ఛిన్నం చేసే ముందు ఆలోచించండి. మీకు అలాంటి డూ ఆర్ డై పరిస్థితి వస్తే.. వారితో చర్చించండి. వారి సలహాను తీసుకుని ముందుకు వెళ్లండి అంతే తప్పా.. వారి నమ్మకాన్ని ఒమ్ము చేసి.. సారీ అని చెప్పేస్తే సరిపోతుంది అనుకుంటున్నారా?

నమ్మకం అనేది అందమైన అద్దం లాంటిది. మీరు దానిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మచ్చలు పడినా అద్దం మసకబారుతుంది అంటే.. మీరు డైరక్ట్​గా దానిని బ్రేక్​ చేసేశారు. ఆ ముక్కలను మళ్లీ కలపాలంటే సాధ్యమవుతుందా? సరే కష్టపడి ముక్కలను కలిపినా గతంలో ఉన్నట్లు దాని రూపు తిరిగి వస్తుందా? రాదు కదా.. నమ్మకం కూడా అంతే.. మీరు దానిని బ్రేక్ చేసి.. మళ్లీ కలపాలని ఎంత ప్రయత్నించినా అది తిరిగి రాదు.

అందుకే ఒకరు మీపై నమ్మకాన్ని పెట్టుకుంటే తగినంత జాగ్రత్తగా ఉండండి. ఒకటికి వందసార్లు ఆలోచించండి. నేను ఈ తప్పు చేస్తున్నాను.. చేయాల్సి వస్తుంది.. నేను మళ్లీ వారి నమ్మకాన్ని సంపాదించుకోగలనా ఆలోచించుకుంటే మీకు సరైన మార్గం కనిపిస్తుంది. మీ నమ్మకాన్ని బ్రేక్ చేసి.. వారు నార్మల్​గా ఉండాలని భావించడం భావ్యం కాదు. మీరు ఇతరులకు ద్రోహం చేసే పనిని ఎప్పుడూ చేయకూడదు. ఒక్కసారి మీరు నమ్మకాన్ని కోల్పోతే.. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా దానిని తిరిగిపొందలేరు. ఒకవేళ పొందిన అది కేవలం ఆర్టిఫీషయల్ మాత్రమే. ముందులాగా స్ట్రాంగ్​గా ఉండదు.

టాపిక్