తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Saturday Motivation : ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించండి.. లేకుంటే తర్వాత బాధపడాల్సి వస్తుంది..

Saturday Motivation : ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించండి.. లేకుంటే తర్వాత బాధపడాల్సి వస్తుంది..

30 July 2022, 7:27 IST

google News
    • Saturday Motivation : జీవితంలో కొన్ని నిర్ణయాలు ఎప్పుడు, ఎక్కడ, ఎలా తీసుకుంటామో తెలియదు. కానీ తీసేసుకుంటాము. ఆ సమయంలో వాటి పర్యవసనాల గురించి ఆలోచించము. సంతోషంలోనో, బాధలోనో, కోపంలోనో తీసుకున్న నిర్ణయాలకి తర్వాత బాధపడాల్సి వస్తుంది. అరే ఆరోజు అలా మాట ఇచ్చేశానే అనే.. ఇవ్వకుంటే ఈరోజు వేరేగా ఉండేది అని ఫీల్ అవుతాం.
కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

కోట్ ఆఫ్ ద డే

Saturday Motivation : మన లైఫ్​లో సమయం, నిర్ణయం అనే రెండు ముఖ్యమైన అంశాలు. వాటిపై మనం కచ్చితంగా శ్రద్ధ వహించాలి. అవి మన జీవిత నాణ్యతను నిర్ణయించడమే కాకుండా.. మనల్ని మెరుగుపరచడంలో మనకు సహాయం చేస్తాయి. అవి మన జీవితంలో విలువైన పాఠాలను నేర్పుతాయి. జీవితం అనేది పరిస్థితులు, వ్యక్తులు, పాఠాల కలయిక తప్ప మరొకటి కాదు.

అనుకోకుండా చేసే కొన్ని తప్పుల వల్ల జీవితంలో చాలా దారుణాలు జరుగుతాయి. ఏదొక తప్పు చేయడం.. తర్వాత జీవితాంతం బాధపడడం. అందుకే ఏ నిర్ణయం తీసుకునేటప్పుడైనా బాగా ఆలోచించండి. పరిస్థితులు మిమ్మల్ని ప్రభావితం చేస్తున్నా.. దాని గురించి వందసార్లు ఆలోచించి ఆ నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే.. మీరు అప్పుడు ఆలోచించకపోతే.. తర్వాత మీరు దాని గురించి జీవితాంతం ఆలోచిస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అరె అలా ఎందుకు చేశాను. చాలా ఫూలిష్​గా బిహేవ్ చేశాను అని బాధపడతారు.

ఆ నిర్ణయాల వల్ల మిమ్మల్ని మీరు క్షమించుకోలేని పరిస్థితులు ఏర్పడవచ్చు. అది మిమ్మల్ని ఊరికే ఇబ్బంది పెడుతుంది. దేనిమీద దృష్టి సారించలేరు. ఏ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలియని వ్యక్తి.. లైఫ్​లో ఎప్పటికీ సక్సెస్ అవ్వలేడు. సరైనా సమయంలో ఆలోచించి నిర్ణయం తీసుకునేవాళ్లు ఎప్పటికైనా సక్సెస్ అవుతారు.

మనమున్న పరిస్థితి, మిమ్మల్ని ప్రామిస్ అడిగిన వ్యక్తి.. అడిగిన ప్రామిస్​ గురించి బాగా ఆలోచించుకోవాలి. మీరు అప్పుడు ఎంత సంతోషంగా ఉన్నా.. బాధలో ఉన్నా.. కోపంలో ఉన్నా.. నిర్ణయం అస్సలు తీసుకోకూడదు. అది మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. లేదంటే అనుకోని పరిస్థితుల్లో అవతలి వ్యక్తి నమ్మకాన్ని విచ్ఛిన్నం చేయాల్సి వస్తుంది. మనపై ఎదుటివారు ఉంచిన ట్రస్ట్ పోయేలా చేస్తుంది. అందుకే ఎప్పుడూ తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. తొందరపడి వాగ్ధానాలు చేయకూడదు.

ఏదైనా వాగ్దానం తీసుకునే ముందు.. లేదా అంగీకరించే ముందు.. మనం దానిగురించి కచ్చితంగా ఆలోచించాలి. నాకు కొంచెం టైమ్ కావాలి ఆలోచించుకుని చెప్తాను అని చెప్పాలి. అంతేకానీ ఏదో ట్రాన్స్​లో ఉండి.. సరే ఓకేలే.. ఏమవుతుందిలే అనే నిర్లక్ష్య ధోరణితో ఉన్నారో.. తర్వాత నిజంగా బాధపడాల్సి వస్తుంది. సంతోషంలో తీసుకునే నిర్ణయాలు మనల్ని ఇబ్బంది పెడితే.. కోపంలో తీసుకునే నిర్ణయాలు మనల్ని దిగజార్చేస్తాయి. క్షణికావేశంలో మీరు ఓ మాట తూలినా.. లేదా ఏదైనా పని చేసినా.. అది మీ జీవితాన్ని అంధకారం చేసేస్తుంది. మీరు ఆ బాధ నుంచి అంత ఈజీగా బయటకు రాలేరు. కోపం, బాధలో తీసుకునే నిర్ణయాలు చాలా దగ్గరగా ఉంటాయి. ఇవి ఒక్కోసారి జీవితాన్ని చిన్నాభిన్నం చేసేస్తాయి. అందుకే ఏ మాట ఇచ్చినా.. ఏ నిర్ణయం తీసుకున్నా.. ఒకటికి వందసార్లు ఆలోచించండి. అస్సలు తప్పుకాదు.

టాపిక్

తదుపరి వ్యాసం