తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Saturday Motivation : పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు.. మీరు కంట్రోల్​లో ఉండండి

Saturday Motivation : పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు.. మీరు కంట్రోల్​లో ఉండండి

23 July 2022, 7:32 IST

    • Saturday Motivation : ఒక్కోసారి ఎలా ఉంటుందంటే పరిస్థితుల మీద కంట్రోల్ తప్పిపోతుంది. మనం ఏమి కంట్రోల్ చేయలేము.. మనవల్ల కాదు అనిపిస్తుంది. అలాంటప్పుడు మీరు పరిస్థితులను కంట్రోల్ చేయకపోయినా పర్లేదు కానీ వాటిని పెరగకుండా చూసుకోండి. మరీ ముఖ్యంగా ఆ పరిస్థితుల ప్రభావం మీపై పడకుండా చూసుకోండి. 
కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

కోట్ ఆఫ్ ద డే

Saturday Motivation : జీవితంలోని ప్రతి పరిస్థితి లేదా సంఘటన లేదా వ్యక్తి.. మీ కంట్రోల్​లో ఉండరు. ముఖ్యంగా మీ జీవితంలోని అన్ని సంఘటనలను మీరు కంట్రోల్ చేయలేరు. అలా కంట్రోల్ చేస్తే అది జీవితం ఎందుకవుతుంది. చాలాసార్లు మీ జీవితం మీరు కోరుకున్న విధంగా ఉండకపోవచ్చు. మీకు అనుకూలంగా ఒక్కవిషయం కూడా జరగకపోవచ్చు. ఆ పరిస్థుతుల నుంచి దూరంగా వెళ్లే అవకాశం కూడా మీకు లేకపోవచ్చు. ఆ సమయంలో మీరు ఏమి చేయాలంటే.. మీ పరిస్థితులు మీ కంట్రోల్​లో లేవు కాబట్టి.. మీరు మీ కంట్రోల్​లో ఉండండి. మీ మైండ్​ని ఆ విషయాలపై ఎక్కువ దృష్టిపెట్టకుండా చేయండి. తద్వారా ఆ ప్రాబ్లమ్స్ అనేవి మరింత పెరగకుండా ఉంటాయి.

అసలు ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఎక్కువ అనిపిస్తాయో తెలుసా? మనం ఎక్కువ ఆలోచించినప్పుడు. మనం ఆలోచించడం మానేస్తే ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయని కాదు.. వాటి గురించి ఎక్కువగా థింక్ చేసి.. బుర్రపాడు చేసుకుంటే అవి మీకు స్ట్రెస్​, ఆందోళన, కోపాన్ని పెంచేస్తాయి. వీటి వల్ల పరిస్థితులు కంట్రోల్​లోకి రావడం కాదు కదా.. కొత్త సమస్యలు వస్తాయి. కాబట్టి పరిస్థితులు, సంఘటనల ప్రభావం మీ మీద ఎక్కువగా లేకుండా చూసుకోండి. వాటి ప్రభావం తగ్గించుకోవడం అంటే సమస్యలని ఇగ్నోర్ చేయడం కాదు. వాటి నుంచి కాస్త బ్రేక్ తీసుకోవడం.

లైఫ్​ మనతో ఆడుకోవడం స్టార్ట్ చేసినప్పుడు అన్ని మనకు విరుద్ధంగానే జరుగుతాయి. ఒకటా, రెండా.. అన్ని సమస్యలు చుట్టుముట్టేస్తాయి. మనకు ఊపిరాడకుండా చేస్తాయి. ప్రపంచంలో ఏది కూడా మీకు అనుకూలంగా జరగట్లేదు అని అనిపిస్తుంది. ఇన్ని జరుగుతున్నప్పుడు మీరు ముందుగా ఏమి చేయాలో తెలుసా? ఆ పరిస్థితులను అర్థం చేసుకుని.. ఓకే మనకి ఇంకో ఆప్షన్ లేదు అని అంగీకరించాలి. అప్పుడు కాస్త స్ట్రెస్ తగ్గుతుంది. ఇప్పుడు జరిగే వాటిని ఎలానో మార్చలేము కాబట్టి.. ఇంకా పెరగకుండా మాత్రం చూసుకోవాలి అనుకోవడం ఉత్తమమైన పని. సరే ఏమి చేస్తే.. ఈ సమస్యలు ఇంకా పెరగకుండా ఉంటాయి అనే విషయంపై క్లారిటీ తెచ్చుకుంటే.. సగం సమస్యలు తగ్గిపోయినట్లే అనిపిస్తాయి.

మీ భయాలను పక్కనపెట్టి వాటిని అధిగమించినప్పుడే మీరు జీవితంలో ముందుకు వెళ్లగలుగుతారు. పరిస్థితులు మిమ్మల్ని విచ్ఛిన్నం చేసే ముందే మీరు వాటిని అర్థం చేసుకోగలగాలి. అప్పుడు మీ హార్ట్ బ్రేక్​ కాదు. మీ ఆత్మవిశ్వాసం తగ్గిపోదు. లైఫ్​లో ఏది మీకు మంచిదో అదే మీరు చేయగలుగుతారు. కొన్ని పనులు చేసేటప్పుడు మీకు కష్టంగా అనిపించవచ్చు. కానీ తర్వాత మీరు వాటిని ఎంత బాగా హ్యాండిల్ చేశారా అని ఆలోచిస్తే.. మీ మీద మీకే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది.

ఏది ఏమైనా ఈ ఫేజ్​లో మనం చాలా నేర్చుకుంటాం. మనతో ఉండేవారు ఎవరో.. మనకి అనుకూలమైనవి ఏవో.. మన శత్రువులు ఎవరో.. మిత్రులు ఎవరో.. మీ కుటుంబం మీకు మద్ధతు ఇస్తుందో లేదో ఇలా అన్ని విషయాలపై ఎంతో కొంత క్లారిటీ వచ్చేస్తుంది. ఈ పాఠాలు మనకు జీవితాంతం గుర్తిండిపోతాయి. మరోసారి అలాంటి పరిస్థితి వస్తే ఎవరితో ఎంతవరకు ఉండాలో.. ఎవరిని దూరంగా ఉంచాలో తెలుస్తుంది.

టాపిక్