తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Friday Motivation : ప్రేమలో బాధలు ఉండొచ్చు కానీ.. ప్రేమే బాధించకూడదు..

Friday Motivation : ప్రేమలో బాధలు ఉండొచ్చు కానీ.. ప్రేమే బాధించకూడదు..

22 July 2022, 9:21 IST

    • Friday Motivation : ప్రేమ అనేది మీ బాధలను తగ్గించగలగాలి. అంతేకానీ బాధించేది ప్రేమ మాత్రం కాదు. ప్రేమలో బాధలు ఉండవచ్చు. కొన్ని సందర్భాల్లో మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. అది ఓకే. కానీ మీ ప్రేమనే మిమ్మల్ని బాధపెడుతుంది అంటే.. మీరు కరెక్ట్ ట్రాక్​లో లేరని అర్థం. 
కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

కోట్ ఆఫ్ ద డే

Friday Motivation : ప్రేమ అనేది ఓ అందమైన అనుభూతి. ఒకరిపై ఉన్న ప్రేమను వ్యక్తం చేయడం ఎంత కష్టమో.. ఆ ప్రేమను పొందుతున్నప్పుడు అంతే ఇష్టంగా ఉంటుంది. అలాంటి ప్రేమ మన బాధలను తీర్చగలగాలి. మనకు ఓదార్పునివ్వాలి. మన పక్కనే ఉండాలి. దూరంగా ఉన్నా.. దగ్గరున్నామనే ఫీల్ ఇవ్వాలి. మీకు తోడుగా ఉండాలి. దేనినైనా ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వాలి. అంతేకానీ.. ప్రేమే మీకు బాధనివ్వకూడదు. అలా బాధనిస్తుంది అంటే.. ఈ విషయంలో మీరు ఆలోచించుకోవడమే బెటర్.

ట్రెండింగ్ వార్తలు

Asthma: పాల ఉత్పత్తులు అధికంగా తింటే ఆస్తమా సమస్య పెరుగుతుందా?

Korrala Pongali: బ్రేక్ ఫాస్ట్‌లో కొర్రల పొంగలి వండుకోండి, డయాబెటిస్ ఉన్న వారికి ఇది బెస్ట్ అల్పాహారం

Saturday Motivation: ఏం జరిగినా అంతా మన మంచికే అనే పాజిటివ్ థింకింగ్ పెంచుకోండి, ఎప్పటికైనా మేలే జరుగుతుంది

Buttermilk : వేసవిలో మజ్జిగను ఇలా చేసి తాగితే చర్మం, జుట్టుకు చాలా మంచిది

ఉదాహరణకు మీరు ఒకరితో బ్రేక్​అప్ అయి ఉన్నారనుకుందాం. లేదా మీరు ప్రేమించిన వ్యక్తి దూరం అయ్యారనుకుందాం. ఆ సమయంలో మీరు పడే వేదన మాటలలో వర్ణించలేనిది. కంటి నుంచి కన్నీరు తప్పా.. నోటి నుంచి మాట రాలేకపోవచ్చు. ఆ సమయంలో మీ పక్కనుండే అమ్మనో, మీ స్నేహితులో, లేదా మిమ్మల్ని ప్రేమించే వాళ్లో మీకు సహాయం చేస్తారు. మిమ్మల్ని ఆ ట్రోమా నుంచి బయటకు తీసుకువస్తారు. మీ బాధను కాస్తైనా తగ్గించడానికి ప్రయత్నిస్తారు. మిమ్మల్ని తిరిగి నార్మల్​గా చేయడానికి స్వాయాశక్తులా ట్రై చేస్తారు. వెళ్లిపోయినా వాళ్ల గురించి ఆలోచిస్తూ.. ఈ సమయంలో మీ పక్కనున్న వారి ప్రేమను గుర్తించకపోతే మీరు మూర్ఖులవుతారు.

మీ బాధను తొలగించడానికి ప్రయత్నిస్తూ.. మీరు మారకపోయినా మీ వెంటనే ఉంటూ.. మిమ్మల్ని ప్రేమిస్తున్నారంటే.. వాళ్లు మీకు ఎంత వాల్యు ఇస్తున్నారో అర్థం చేసుకోండి. వారి ప్రేమను అర్థం చేసుకునే సామర్థ్యం మీకు లేకపోతే.. మీరు ఆ అద్భుతమైన ప్రేమ అనుభూతిని కోల్పోతారు. మీరు వారి ప్రేమను గుర్తించి.. మీ ప్రేమను వ్యక్తం చేయగలిగితే.. మీ బాధను మరిపించేలా వారు మిమ్మల్ని ప్రేమిస్తారు.

నిజం చెప్పాలంటే ఈ ప్రపంచంలో ప్రేమ కంటే గొప్పది ఏదీ లేదు. ఇది మనం ఏదొక సందర్భంలో ఒప్పుకుంటాం. ఒప్పుకోవాలి కూడా. ప్రేమ అంటే ఒకరినుంచే రాదు. మన అమ్మ, నాన్న, కుటుంబం, స్నేహితులు, ప్రియుడు లేదా ప్రేయసి.. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంటుంది. వీరిలో ఎవరో ఒకరు మోసం చేశారని.. ప్రేమను తప్పుపట్టకూడదు. ప్రేమ ఎప్పుడూ స్వచ్ఛమైనదే. అది పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది అంతే.

ఈ ప్రేమలో మీరు కలకాలం సంతోషంగా ఉంటారని చెప్పలేము. కొన్నిసార్లు కష్టాలు, బాధలు కూడా ఉంటాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. కానీ ప్రేమే బాధను కలిగిస్తుందంటే మాత్రం.. ఒక్కసారి ఆగండి. ఆలోచించండి. మీరు చేస్తుంది కరెక్టేనా కాదా అని ప్రశ్నించుకోండి. ఎందుకంటే మీ ప్రేమను అడ్వాంటేజ్​గా తీసుకుని.. మిమ్మల్ని బాధపెట్టే వ్యక్తులు కూడా మీ లైఫ్​లో ఉండవచ్చు. అలాంటివారిని దూరం చేసుకోవడంలో తప్పులేదు. ఇలా చేసినప్పుడు కొన్నిరోజులు బాధపడతారు. కానీ తర్వాత మీరు చేసింది కరెక్టేనని మీకు తెలుస్తుంది.

మీ మానసిక ప్రశాంతతను దూరం చేసే బంధానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ప్రేమకు అద్భుతాలు చేయగల సామర్థ్యం ఉంది. ఆ అద్భుతం బాధ అయితే.. అది ప్రేమ కాదు.

టాపిక్