తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Thursday Quote: ఒకదారి మూసుకుపోయిందంటే దాని అర్థం ప్రయాణం ఆపాలని కాదు.. కొత్తదారి వెతుక్కోవాలని

Thursday Quote: ఒకదారి మూసుకుపోయిందంటే దాని అర్థం ప్రయాణం ఆపాలని కాదు.. కొత్తదారి వెతుక్కోవాలని

21 July 2022, 9:53 IST

    • జీవితంలో ఓ దారి మూసుకుపోయిందంటే అర్థం అక్కడితో నీ ప్రయాణం ముగిసిపోయిందని కాదు. ఇంకొకదారి నీకోసం రెడీగా ఉందని అర్థం. అందుకే వచ్చిన ప్రతి అవరోధం గురించి బాధపడకుండా.. మీకోసం, మీ బంగారు భవిష్యత్తు కోసం ఏ దారి రెడీగా ఉందో తెలుసుకుని.. ముందుకు సాగండి.
కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

కోట్ ఆఫ్ ద డే

Thursday Motivation : అప్పటివరకు హ్యాపీగా సాగిన ప్రయాణానికి అనుకోకుండా అవరోధం వచ్చింది. అంటే దాని అర్థం మీ ప్రయాణం అక్కడితో ఆగిపోతుందనా? కాదు. నిజానికి ప్రతి అవరోధం మీరు మరింత ముందుకు సాగడంలో సహాయపడుతుంది. ప్రతి అవరోధం మీకు పాఠాన్ని నేర్పిస్తుంది. ఈసారి అలాంటి అవరోధాలు వస్తే వాటిని ఎలా ఫేస్ చేయాలో తెలుపుతుంది. మీరు మరో కొత్తదారిని వెతుక్కునే శక్తిని ఇస్తుంది. ఇప్పుడు వచ్చిన ఈ అవరోధం మీరు జీవితం విజయం సాధించడానికి కచ్చితంగా ఉపయోగపడుతుంది.

ట్రెండింగ్ వార్తలు

Mint Leave Face Pack : పుదీనా ఫేస్ ప్యాక్ వాడితే ఒక్క వారంలో మెుటిమలు, బ్లాక్ హెడ్స్ మాయం

World Asthma Day: ఆస్తమా ఉందా? ముందే జాగ్రత్త పడండి, ఆస్తమాతో పాటూ వచ్చే వ్యాధులు ఇవే

Pension Scheme : 7 రూపాయలు పెట్టుబడి పెడితే చాలు.. వృద్ధాప్యంలో రూ.5000 పెన్షన్

Chanakya Niti Telugu : పేదవాడిగా పుట్టినా.. ధనవంతులుగా బతికేందుకు చాణక్యుడు చెప్పిన రహస్యాలు

ఓ దారి ముగిసిపోతే అక్కడితోనే అన్ని ఆగిపోతాయి అనుకోకండి. మరోమార్గంలో జీవితం ముందుకు సాగుతూనే ఉంటుంది. ఆ జర్నీని ఎంత బ్యూటీఫుల్​గా మలుచుకుంటారనేదే మీ ముందున్న టార్గెట్. కొన్నిసార్లు మీరు ఎంత ప్రయత్నించినా.. మీ మార్గంలో అవరోధాలు వస్తూనే ఉంటాయి. ఒక్కోసారి అక్కడే ఆగిపోవాల్సి వస్తుంది. అలాంటి సందర్భం వచ్చినప్పుడు.. మీరు వేరొకదారిని వెతుక్కోవడం చాలా మంచిది. కొత్తదారి మీకు విజయాన్ని, ఆనందాన్ని ఇస్తుంది.

మీరు అనుకుంటున్న గమ్యానికి వెళ్తున్నప్పుడు ఒకదారి మూసివేసి ఉంటే.. మరో దారి కచ్చితంగా తెరిచే ఉంటుంది. లైఫ్ ఈజ్ లైక్​ ఏ పజిల్. ఒకదారిగుండా వెళ్లడం సాధ్యం కాకపోతే.. మరొకదారిని ప్రయత్నించాలి. అంతేకానీ ఎలా వెళ్లాలో తెలియడం లేదని ఆగిపోకూడదు. మరోసారి అలా వెళ్లకూడదని అర్థం అయ్యాక.. కొత్త జర్నీలో గతంలో చేసిన తప్పులు చేయము. గతంలో తీసుకున్న నిర్ణయాలు తీసుకోము. దీనివల్ల జీవితం సజావుగా సాగుతుంది.

అలాగే ఒకరు మీ హార్ట్​ను బ్రేక్ చేశారంటే.. వారి గురించి ఆలోచిస్తూ.. కృంగిపోకూడదు. మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తి కచ్చితంగా మీ లైఫ్​లోకి వస్తారు. వారు మీరు పడుతున్న బాధను దూరం చేసి.. మీకు మరో కొత్త లోకాన్ని చూపిస్తారు. అలా అని మీరు గతం మరచిపోతారని కాదు. అది ఒక జ్ఞాపకంలా మీతోడు ఉంటుంది అంతే. అప్పుడు జరిగిన పొరపాట్లు మీరు రిపీట్​ చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. జీవితంలో మంచి ఎంపికల కోసం ఎల్లప్పుడూ ప్రయత్నించాలి. ప్రయత్నిస్తూనే ఉండాలి.

ప్రపంచంలో విజయం సాధించిన ప్రసిద్ధ వ్యక్తులందరూ.. ఏదొక మార్గంలో ఆగిపోయే ఉంటారు. కానీ వారు కొత్త దారిలో తమ విజయాన్ని వెతుక్కున్నారు కాబట్టి సక్సెస్​ అయ్యారు. మీరు నిజాయితీగా ఉన్నంతవరకు మీ విజయాన్ని ఎవరూ ఆపలేరు. విజయం అనేది ఆకలి లాంటిది. మీరు దాని కోసం ఎంత ఎక్కువ ఆరాటపడతారో.. ఎంత ఒత్తిడి తెచ్చుకుంటారో.. ఎంతగా కష్టపడతారో అనే అంశాలపై సక్సెస్ టేస్ట్ ఆధారపడి ఉంటుంది. విజయాన్ని సాధించడంలో మనం ఉత్సాహాన్ని కలిగి ఉండాలి. అప్పుడే మన ప్రయాణంలో విసుగు, చిరాకు రాదు.

ఒత్తిడితో కూడిన మనస్సు విజయానికి మిమ్మల్ని దూరం చేస్తుంది. చివరికి మిమ్మల్ని వైఫల్యానికి గురిచేస్తుంది. ఎందుకంటే ఒత్తిడికి గురైన మనస్సు తన జీవితంలో జరిగిన వైఫల్యాలను మాత్రమే హైలైట్ చేస్తుంది. విజయాన్ని సాధించడానికి అనేక మార్గాలు వెతుక్కోవడమే కాదు.. సరైన సాధన కూడా అవసరమే. మీరు నొప్పికి సిద్ధంగా లేకుంటే.. విజయాన్ని రుచి చూసేందుకు మీరు ఎప్పటికీ అర్హులు కాదు.

టాపిక్