తెలుగు న్యూస్  /  Lifestyle  /  Friday Motivation On Your Time Is Limited, So Don't Waste It Living Someone Else's Life

Friday Quote : ఇతరుల నుంచి కొంచెం స్పేస్ తీసుకోండి.. ఎందుకంటే ఇది మీ లైఫ్

29 July 2022, 7:47 IST

    • Friday Motivation : ఇతరులనుంచి సూచనలు తీసుకోండి. మంచిది. కానీ ఇతురుల ఆలోచనలతో జీవించకండి. ఇతరుల అభిప్రాయం మీ గొంతును ఆపేస్తుందంటే.. మీరు మీ జీవితాన్ని పక్కన పెట్టేసినట్లే. ఇలా చేస్తే మీతోపాటు మీరు వారి జీవితాన్ని వృథా చేసినట్లే. మీకున్నదే కొంచెం సమయం. దానిలో మీకు నచ్చినట్లు జీవించండి. వాళ్ల లైఫ్.. వాళ్లకి నచ్చినట్లు జీవిస్తారు. 
కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

కోట్ ఆఫ్ ద డే

Friday Motivation : మీ హృదయం ఏమి చెప్తుందో.. మీ ఆలోచనలు మీకు ఇచ్చే సూచనలు ఏమిటో తెలుసుకునే ధైర్యం ఉంటే.. మీరు ఇతరులపై ఆధారపడాల్సిన అవసరం లేదు. మీ మనసు చెప్పినవి అనుసరిస్తే చాలు.. మీ లైఫ్ మీకు నచ్చినట్టు ఉంటుంది. లేదు ఇలా చేస్తే మంచిగా లేదు అనిపించినా.. ఏదొక రోజు మీరు చేసింది కరెక్ట్ అని మీకు అనిపిస్తుంది. సమయం ఎవరికోసం వేచి ఉండదు అని ఓ సామెత ఉంది. ప్రపంచంలో అన్నింటికన్నా విలువైనది సమయం మాత్రమే. ఈ సమయాన్ని అస్సలు వృథా చేసుకోకండి. ఇతరుల ఆలోచనలకు అనుగుణంగా, ఇతరులకోసం మీరు బ్రతికితే.. మీ లైఫ్ మీరు ఎప్పుడు బ్రతుకుతారు.

మీ లైఫ్​ని మీకు నచ్చినట్టు జీవించే రైట్ మీకు ఉంది. మీకు ఎంతో సమయంలేదు. ఈ వయసు, ఈ యవ్వనం, ఈ సమయం మళ్లీ రాదు. ఆ తర్వాత సమయం ఉన్నా మీరు చేసేదేమి లేదు. ఈ జీవితానికి ఏదొకరోజు కచ్చితంగా ముగింపు ఉంటుంది. ఆలోపు మన చేతిలో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వీలైనన్ని జ్ఞాపకాలు సంపాదించుకోవాలి. అవే మీ చివరిరోజుల్లో మీరు ఎలా బతికారనేది చూపిస్తుంది. మీకు సంతోషాన్ని ఇస్తుంది. లేదు ఇతరులకోసం మీ లైఫ్​ని వృథా చేస్తే.. మీ జీవితం అంతా వారే ఉంటారు. మీ లైఫ్​లో మీరు ఉండరు.

జీవితంలోని భిన్నమైన మార్గాలను ప్రయత్నించండి. తెలియని వాటిని ప్రయత్నించండి. భయపడకండి. తగినంత అనుభవాన్ని సేకరించి.. మీ జీవితం ఎలా సాగాలని.. మీరు కోరుకుంటున్నారో.. అలా వెళ్లేలా ప్రయత్నించండి. జీవితంలో మీకు ఏమి కావాలో తెలుసుకున్న తర్వాత.. దాని కోసం పని చేయండి. మీరు కోరుకున్న విధంగా ప్రతిదీ జరగదు. మీ జీవితం కూడా అంతే. కానీ ఏది చేసినా.. దానిలో మీ సొంత టచ్ ఉండాలి.

మీ ఆలోచనల గురించి సన్నిహితులతో చర్చించండి. కానీ తుది నిర్ణయం మీదే కావాలి. ఇలా మీరు మీ సొంత నిర్ణయం తీసుకుంటే.. తర్వాత చింతించకండి. మీ మనసుకు నచ్చినది చేశారు. మీకు ఏది మంచి అనిపించిందో దానికే ఓటేశారు. మీ జీవితాన్ని మీరు సొంతం చేసుకోండి. ప్రతిరోజును మీకు నచ్చినట్లు స్వాధీనం చేసుకోండి.

ఇతరుల నుంచి ప్రేరణ పొందితే అది కూడా ప్రయత్నించండి. ఎందుకంటే ఈ సోషల్ మీడియా యుగంలో.. ఇతరుల ఇంపాక్ట్ మనపై ఎక్కువగా ఉంటుంది. అవి మీ ఎంపికలను మార్చే అవకాశం కూడా ఉంటుంది. అవి మీరు మరొకరిలా జీవించేలా చేస్తాయి. కాబట్టి.. వాటిని అంత ఎక్కువగా హార్ట్​కి తీసుకోకండి. మీకంటూ కొత్త వే ఉంటుంది.

మీ జీవితంలో సానుకూల మార్పులు తీసుకురావడానికి ఎవరైనా ప్రయత్నించవచ్చు. అది మంచిదే కానీ. వారు మీకు నిజంగానే మంచి చేస్తున్నారో.. లేదా మోసం చేస్తున్నారో తెలుసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది. కాబట్టి ఇతరుల విషయంలో ప్రతి క్షణం తగినంత అప్రమత్తంగా ఉండండి.

మీ కలలను సాకారం చేసుకోవడానికి.. మీ చుట్టూ ఉన్నవారిని సంతోషంగా ఉంచడానికి మీరు కష్టపడి పనిచేయడమే జీవితం. మీరు చేసే పని పట్ల చుట్టూ ఉన్నవారు సంతోషంగా ఉన్నా.. లేకున్నా.. మీరు సంతోషంగా ఉన్నారో లేదు కచ్చితంగా తెలుసుకోండి. వారిని సంతోషపరచడానికి మీరు కోరికలను, ఆశయాలను చంపుకోకండి. మీకు నచ్చినపని చేస్తున్నప్పుడు మిమ్మల్ని ఇష్టపడేవారు కూడా సంతోషిస్తారు. సమాజానికి అనుగుణంగా ఉండాలనే తపనలో మనల్ని మనం కోల్పోకుండా చూసుకోవడం మాత్రం కూడా చాలా ముఖ్యం.

టాపిక్