తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tuesday Motivation : మీకు రెస్పెక్ట్ ఇవ్వనివారిని ద్వేషించనవసరంలేదు.. జస్ట్ దూరంగా ఉంటే చాలు..

Tuesday Motivation : మీకు రెస్పెక్ట్ ఇవ్వనివారిని ద్వేషించనవసరంలేదు.. జస్ట్ దూరంగా ఉంటే చాలు..

26 July 2022, 6:46 IST

    • Tuesday Motivation : మీ లైఫ్​నుంచి కొందరిని దూరం చేసుకుంటున్నారంటే.. లేదా వారికి దూరంగా ఉంటున్నారంటే మీరు వారిని ద్వేషిస్తున్నట్లు కాదు. వాళ్లు మీకు తగిన గౌరవం, వాల్యూ ఇవ్వట్లేదని అర్థం. మిమ్మల్ని చులకనగా చూసే వారి దగ్గర మీరు ఉండాల్సిన అవసరం లేదు. వారికి ఎంత దూరంగా వెళ్తే అంత మంచిది. 
కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

కోట్ ఆఫ్ ద డే

Tuesday Motivation : ఎవరైనా మిమ్మల్ని అర్థం చేసుకోకుండా.. కనీసం మీ ఆలోచనలకు రెస్పెక్ట్ ఇవ్వకుండా.. మీకు తగిన విలువ ఇవ్వట్లేదని మీరు భావించినప్పుడు మీరు అక్కడ నుంచి వెళ్లిపోవాలి. అలా వెళ్లిపోవడం తప్పేమి కాదు. అలా అని మీకు వారి మీద ద్వేషం ఉన్నట్లు కూడా కాదు. కేవలం మీరు వారికన్నా.. మీ సెల్ఫ్ రెస్పెక్ట్​కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని అర్థం. ఈ విషయం గురించి ఎప్పుడూ చింతించాల్సిన అవసరం కూడా లేదు.

ట్రెండింగ్ వార్తలు

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

లైఫ్​లో ఎక్కువమందితో మీరు కలిసి ఉండాలనే రూల్​ లేదు. మీకు విలువనిచ్చే.. మిమ్మల్ని గౌరవించే కొంతమంది వ్యక్తులతో ఉన్నా మీరు సంతోషంగా ఉంటారు. ఎక్కువమందితో ఉంటే హ్యాపీగా ఉంటారని అస్సలు అనుకోకండి. మిమ్మల్ని గౌరవించని వారి మధ్య మీరు హ్యాపీగా ఉండలేరు. మీరు నచ్చిన, మిమ్మల్ని మెచ్చేవారితో ఎప్పటికైనా హ్యాపీగా ఉంటారు.

ప్రతి మనిషికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి. అది పొగరు మాత్రం కాదు. పొగరు అహంకారాన్ని తీసుకువస్తుంది. సెల్ఫ్​ రెస్పెక్ట్ సమాజంలో మిమ్మల్ని మార్గదర్శకంగా చూపుతుంది. నిజాయితీపరులుగా మారుస్తుంది. ఏ తప్పు చేయట్లేదు కాబట్టి ఎవరో మనల్ని ఎందుకు అనాలి.. ఎందుకు చులకనగా చూడాలనే భావం మీలో మొదలవుతుంది. అందుకే ప్రతి ఒక్కరికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి. ఇది తప్పు చేసేవారిని నిలదీసేలా చేస్తుంది. మీకు గౌరవం ఇవ్వని వాళ్లని వదిలేసేలా చేస్తుంది.

అందరికంటే ముందు మీ సొంత విలువను మీరు తెలుసుకోవాలి. దానిని ఇతరుల అర్థం చేసుకోకుండా.. మిమల్ని తగినంత గౌరవించనప్పుడు వారికి మీరు దూరంగా ఉండడమే బెటర్. ఎందుకంటే వారు ఇతరుల ముందు కూడా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడతారు కాబట్టి. అలా అని వారిని ద్వేషించాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మీరు గౌరవించుకుంటున్నారు కాబట్టే.. మీరు వారికి దూరంగా వెళ్తున్నారు అంతే.

కొందరుంటారు ఎలాంటివారినైనా తక్కువ చేసి మాట్లాడతారు. వారే గొప్ప అని.. మిగిలిన ఎవరూ అసలు గొప్పవారే కాదు అన్నట్లు మాట్లాడతారు. అలాంటి వాళ్లు.. ఎంతదగ్గరైనా సరే వదులుకోవడమే మంచిది. ఇతరులను అగౌరపరిచే వ్యక్తులతో మీరు ఉండాల్సిన అవసరం లేదు. వారు మీ ఆత్మగౌరవాన్ని కూడా ఏదొకరోజు హరించివేస్తారు. మిమ్మల్ని ప్రేమించే, గౌరవించే వ్యక్తుల చుట్టూ ఉంటే.. మీరు పూర్తి ఆత్మవిశ్వాసంతో, ప్రశాంతంగా ఉంటారు.

టాపిక్

తదుపరి వ్యాసం