తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Drink For Lungs: ఊపిరితిత్తులు శుభ్రపడాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి చాలు, ఏ మందులూ అవసరం లేదు

Drink for Lungs: ఊపిరితిత్తులు శుభ్రపడాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి చాలు, ఏ మందులూ అవసరం లేదు

Haritha Chappa HT Telugu

18 May 2024, 13:15 IST

google News
    • Drink for Lungs: గాలి కాలుష్యం వల్ల ఇప్పుడు ఊపిరితిత్తులు త్వరగా సమస్యల బారిన పడుతున్నాయి. ఊపిరితిత్తులను కాపాడుకోవాలంటే కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తే మంచిది.
ఊపిరితిత్తులు క్లీన్ చేసే డ్రింక్
ఊపిరితిత్తులు క్లీన్ చేసే డ్రింక్ (Pixabay)

ఊపిరితిత్తులు క్లీన్ చేసే డ్రింక్

Drink for Lungs: గాలి కాలుష్యం, కరోనా వైరస్ వీటివల్ల ఎక్కువగా ప్రభావితం అయ్యేవి ఊపిరితిత్తులే. ప్రస్తుత రోజుల్లో ఊపిరితిత్తుల సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారి సంఖ్య ఎక్కువైపోయింది. న్యూమోనియా, ఆస్తమా, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఇలా ఎన్నో రకాల కారణాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తీవ్రమైన కఫం పట్టడం, ఆయాసం, శ్వాస తీసుకోలేకపోవడం వంటివి ఛాతీని ఇబ్బంది పెడుతున్నాయి. ఊపిరితిత్తులు పరిశుభ్రంగా ఉండాలంటే మేము ఇక్కడ చెప్పిన చిన్న చిట్కాను పాటించండి చాలు. ఈ ఇంటి చిట్కాలు ప్రతిరోజూ పాటించడం వల్ల ఊపిరితిత్తులు పూర్తిగా పరిశుభ్రమవుతాయి.

ఇదిగో డ్రింక్

ప్రతిరోజూ గ్లాసు గోరువెచ్చటి నీటిని తీసుకోండి. అందులో నాలుగు స్పూన్ల తేనెను కలపండి. అలాగే ఒక స్పూను నిమ్మరసం కూడా కలపండి. అందులోనే చిటికెడు మిరియాల పొడి, చిటికెడు యాలకుల పొడి వేసి బాగా కలిపి తాగుతూ ఉండండి. ఈ గ్లాసు నీటిని ప్రతి రెండు మూడు గంటలకు ఒకసారి తాగుతూ ఉంటే ఎంతో మంచిది. అయితే ఈ సమయంలో మిగతా ఆహారాలను తీసుకోకూడదు.

ఇలా ఆగి ఆగి కొన్ని గంటల పాటు ఆ నీటిని తాగడం వల్ల ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫం, వ్యర్థ పదార్థాలన్నీ బయటికి పోతాయి. బ్యాక్టీరియా, వైరస్ లో వంటివి నశిస్తాయి. రోగ నిరోధక శక్తి బలోపేతం అయ్యి యాంటీ బాడీస్ ఉత్పత్తి అవుతాయి. ఈ గ్లాసుడు నీళ్లు ఒక పూటంతా తాగి ఉపవాసం ఉంటే మంచిది. ఆ తర్వాత ఆహారాన్ని తీసుకోవచ్చు. ఇలా మూడు నాలుగు రోజులు పాటు చేసి చూడండి. ఛాతీకి పట్టిన కఫం మొత్తం పోతుంది. మధ్య మధ్యలో ఆవిరి పడుతూ ఉండాలి. ఆవిరి పట్టేటప్పుడు అందులో పసుపు, తులసి ఆకులు, యూకలిప్టస్ ఆయిల్ కూడా వేస్తూ ఉండాలి.

ఊపిరితిత్తులు కఫం పట్టినట్టు అనిపిస్తున్నా, ఆయాసం వస్తున్నా, శ్వాసకి ఇబ్బంది అనిపిస్తున్నా ఈ చిట్కాను తరచూ పాటిస్తూ ఉంటే ఎంతో మేలు జరుగుతుంది. అలాగే ఈ సమయంలో వేడి నీళ్లతోనే స్నానం చేయాలి. ఇలా చేస్తే వారంలోపే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వంటివి తగ్గుతాయి. నిమోనియా కూడా అదుపులోకి వస్తుంది. ఉప్పును చాలా తగ్గించి తీసుకోవాలి. రోజులో ఒకసారి మాత్రమే భోజనం చేయాలి. మిగతా సమయాల్లో ఆ నీటిని తాగుతూ ఉండాలి. ఇది మీకు నాలుగు రోజుల్లోనే మంచి ఫలితాన్ని చూపిస్తుంది.

టాపిక్

తదుపరి వ్యాసం