Shadow Boxing: ఛాతీ, పొట్ట కొవ్వును కరిగించుకోవాలా? ఇంట్లోనే షాడో బాక్సింగ్ చేయండి, ఇది వెరీ సింపుల్
Shadow Boxing: ప్రతిరోజూ చేయాల్సిన వ్యాయామాల్లో షాడో బాక్సింగ్ కూడా ఒకటి. దీన్ని చేయడం చాలా సులువు.
Shadow Boxing: అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు ప్రతిరోజూ వాకింగ్, రన్నింగ్ ఎలా చేస్తారో... అలా షాడో బాక్సింగ్ కూడా ఒక ఐదు నిమిషాలు చేయడం చాలా అవసరం. దీన్ని చేయడం చాలా సులువు. ఎలాంటి పరికరాలు అవసరం లేదు. ఇంట్లోనే దీన్ని చేసుకోవచ్చు. షాడో బాక్సింగ్ అంటే గాలిలో పంచ్‌లు విసరడం. చాలా బలంగా గాలిలో పంచ్‌లు విసురుతూ ఉండాలి. దీన్ని ఎయిర్ పంచింగ్ అని కూడా అంటారు. మీరు పంచ్ విసిరినప్పుడు మీ శరీరంలోని ఎగువ భాగంలో ఉన్న కండరాలు శక్తివంతంగా పనిచేస్తాయి. భుజాలు, ముంజేయి, ఛాతీ, పొత్తికడుపు, ట్రైసెప్స్ దగ్గర ఉన్న కండరాలన్నీ పంచింగ్ సమయంలో చురుగ్గా ఉంటాయి. అక్కడ ఉన్న కొవ్వు కరిగే అవకాశం ఉంటుంది.
షాడో బాక్సింగ్ ప్రతిరోజూ ఐదు నిమిషాలు చేయడం వల్ల ఎంతోకొంత కొవ్వు కరుగుతూ ఉంటుంది. ఇది ఒక సులభమైన కార్డియో వ్యాయామంగా చెప్పుకుంటారు. బరువు తగ్గడానికి షాడో బాక్సింగ్ చేస్తున్నవారు గాలిలోకి పంచులను చాలా వేగంగా విసరాలి. వేగవంతమైన పంచ్.. మరింత వేగంగా బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. ఈ వ్యాయామం వల్ల శరీరంలోని అదనపు కొవ్వు కరిగిపోతుంది.
ఈ వ్యాయామం చాలా చవకైనదనే చెప్పుకోవాలి. దీనికి ఎలాంటి పరికరాలు అవసరం లేదు. కేవలం ఇంట్లోనే షాడో బాక్సింగ్ చేసుకోవచ్చు. జిమ్‌కు వెళ్లి గంటల తరబడి గడిపే బదులు రన్నింగ్, వాకింగ్, షాడో బాక్సింగ్ చేస్తే బరువు త్వరగానే తగ్గుతారు. ప్రారంభంలో ఇది చేయడం కాస్త కష్టంగా అనిపించవచ్చు. శరీరాన్ని సమతుల్యంగా ఉంచలేక, పంచ్ విసిరినప్పుడు ముందుకు, వెనక్కు పడుతున్నట్టు అనిపిస్తుంది. కానీ తర్వాత బాడీ బ్యాలెన్స్ అవుతుంది. షాడో బాక్సింగ్ చేయడం వల్ల బాడీ బ్యాలెన్స్ సమస్యలు తీరుతాయి. కాబట్టి ప్రతిరోజు షాడో బ్యాక్సింగ్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఇది పొట్ట దగ్గర ఉన్న కొవ్వును త్వరగా కాల్చేస్తుంది. ఛాతీ నుంచి పొట్ట వరకు ఉన్న కొవ్వును కరిగించడంలో షాడో బాక్సింగ్ ముందుంటుంది.
టాపిక్