Workout Everyday : రోజుకు ఎంతసేపు వ్యాయామం చేస్తే మంచిది?-how long you should workout daily all you need to know ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Workout Everyday : రోజుకు ఎంతసేపు వ్యాయామం చేస్తే మంచిది?

Workout Everyday : రోజుకు ఎంతసేపు వ్యాయామం చేస్తే మంచిది?

Anand Sai HT Telugu
Dec 24, 2023 05:30 AM IST

Workout Everyday Tips In Telugu : వ్యాయామం అనేది మనిషికి తప్పనిసరి. అయితే రోజు ఎంతసేపు చేయాలని మాత్రం చాలా మందికి క్లారిటీ ఉండదు. రోజుకు ఎంత సేపు వ్యాయమం చేస్తే మంచిది?

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

సాధారణంగా కొత్త సంవత్సరం ప్రారంభంలో చాలా మంది రకరకాల రిజల్యూషన్ల గురించి ఆలోచిస్తారు. ఆ విధంగా చాలా మంది ప్రతిరోజూ వ్యాయామం చేయాలని నిర్ణయం తీసుకుంటారు. అయితే ఆ నిర్ణయాన్ని రోజూ మాత్రం అమలు చేయరు. కొద్దిమంది మాత్రమే క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తారు. ప్రారంభ దశలోనే చాలా మంది ముగిస్తారు.

ఇలాంటప్పుడు కొత్తగా వ్యాయామం చేసే వారు రోజుకు ఎంత సమయం వ్యాయామం చేయాలి? వారానికి ఎన్ని రోజులు వ్యాయామం చేయాలి? ఎలాంటి ఆహారాలు తినాలి ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలి? ప్రతిరోజూ ఎంత సమయం వ్యాయామం చేయాలో క్లారిటీ ఉండాలి. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

సహజంగానే, ఒకరి శరీర కూర్పు, శరీర బరువు, శారీరక బలాన్ని బట్టి వ్యాయామం చేసే సమయం మారుతుంది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) మీరు వారానికి వ్యాయామం చేసే సమయాన్ని రికార్డ్ చేయడం ద్వారా ప్రారంభించాలని చెబుతుంది. ఆపై రోజుకు ఆ మొత్తానికి పెంచుకోవాలని సలహా ఇస్తుంది. వారానికి 150 నిమిషాల సరిగా వ్యాయామం చేయాలి.

ఈ 150 నిమిషాలను రోజుకు 30 నిమిషాలు, వారానికి 5 రోజులుగా విభజించవచ్చు. అప్పుడు రోజుకు వ్యాయామం చేసే సమయం కూడా తగ్గుతుంది. అందరూ అన్ని రోజుల్లో వ్యాయామం చేయలేకపోవచ్చు. ఈ 150 నిమిషాలలో కనీసం 2 కండరాలను బలపరిచే వ్యాయామాలను కలిగి ఉండాలని నిపుణులు చెబుతున్నారు. అయితే ఒకేరోజు అంత ఎక్కువగా వ్యాయామం చేయకూడదు. ఎక్కువగా కంప్యూటర్ ముందు కూర్చునే వారికి లేదా కూర్చొని పని చేసే వారికి వ్యాయామం తప్పనిసరి. కూర్చొన్న ప్రదేశం నుంచి ఎక్కువగా కదలని వారు వ్యాయామాలపై ఫోకస్ చేయాలి.

అయితే, మనం కూర్చునే సమయాన్ని వీలైనంత తగ్గించి, కదిలే సమయాన్ని పెంచుకోవాలి. అప్పుడే మొత్తం శరీరానికి మంచి ఫలితాలు లభిస్తాయి. వారానికి 150 నిమిషాల వ్యాయామం చేయడం సాధ్యం కానప్పటికీ, నడిచే వారికి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రస్తుతం జీనవశైలిలో ఆరోగ్యంగా ఉండాలంటే నడక కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఎక్కువగా కూర్చొని పనిచేసేవారికి ఇది మంచి వ్యాయామం.

Whats_app_banner