AP Govt Jobs : టైపిస్ట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు - దరఖాస్తులకు రేపే లాస్ట్ డేట్
AP Govt Recruitment Latest News: నిరుద్యోగ అభ్యర్థులకు అలర్ట్ ఇచ్చింది ఏపీ సర్కార్. ఏలూరులో 12 టైపిస్ట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు వివరాలను పేర్కొంది.
Revenue Department Eluru District Jobs: ఏపీలోని పలు జిల్లాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. వైద్యారోగ్యశాఖకు సంబంధించి భారీగా ప్రకటనలు రాగా… తాజాగా పశ్చిమగోదావరి జిల్లా రెవెన్యూ విభాగంలో(ఏలూరు) పలు ఉద్యోగాల భర్తీకి కూడా నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్ లైన్ దరఖాస్తులకు నవంబరు 30వ తేదీని తుది గడువుగా ప్రకటించారు. ఈ నోటిఫికేషన్ ప్రకటనలో భాగంగా మొత్తం 12 టైపిస్ట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
ముఖ్య వివరాలు :
భర్తీ ప్రకటన - రెవెన్యూ డిపార్ట్ మెంట్, పశ్చిమగోదావరి జిల్లా(ఏలూరు)
మొత్తం ఖాళీలు - 12
ఉద్యోగాల పేరు - టైపిస్ట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్
అర్హతలు - డిగ్రీతో కంప్యూటర్ సైన్స్ లేదా బీఈ, బీటెక్/ ఎంసీఏ. ఇవే కాకుండా…టైపింగ్ లో సర్టిఫికెట్ ఉండాలి.
వయసు - 18 - 42 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం - రూ. 18,500
దరఖాస్తులు - ఆన్ లైన్
ఎంపిక విధానం - అకాడమిక్ మార్కుల ఆధారంగా . షార్ట్ లిస్ట్ అయిన వారికి కంప్యూటర్ పరిజ్ఞానం, టైపింగ్ పై పరీక్షలు నిర్వహిస్తారు.
దరఖాస్తుల చివరి తేదీ - 30. 11. 2023.
ఈ ఉద్యోగాలను ఔట్ సోర్సింగ్ ప్రాతిపాదికన భర్తీ చేస్తున్నారు.
అధికారిక వెబ్ సైట్ - https://westgodavari.ap.gov.in