తెలుగు న్యూస్  /  Lifestyle  /  Friday Quote On Your Darkest Days Made You Stronger. Or Maybe You Already Was Strong, And They Made You Prove It.

Friday Quote : ఇకపై మీరు సెన్సిటివ్ కాదు స్ట్రాంగ్ అనిపిస్తుందా? ఈ మార్పు మంచిదే ఎందుకంటే..

26 August 2022, 7:02 IST

    • Friday Motivation : కొన్ని సందర్భాల్లో మన ప్రవర్తన చూసి మనమే షాక్ అవుతుంటాం. నేనేనా ఇది. నేను ఇలా కూడా ఉండగలనా అనిపిస్తుంది. ఎందుకంటే మనం అంత స్ట్రాంగ్​గా ఉంటామని మనం కూడా ఊహించం కాబట్టి. కష్టాల్లో నేర్చుకున్న పాఠాలే ఈరోజు మిమ్మల్ని ఇంత స్ట్రాంగ్​గా నిలబెట్టాయని మీకు అర్థమవుతుంది. 
కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

కోట్ ఆఫ్ ద డే

Friday Motivation : నేను ఈ పని చేయలేనేమో… నేను వారితో మాట్లాడకుండా ఉండలేనేమో.. నేను అంత స్ట్రాంగ్​గా ఉండలేనేమో అనే ఆలోచనల నుంచి.. ఇది నేనేనా? నేను ఇంత స్ట్రాంగ్​గా ఉండగలనా? నాతోని ఇది అవుతుందా? ఇది చేయగలిగాను అనే ఆలోచనలు ఏదొక టైమ్​లో మనకు వస్తాయి. ఎందుకంటే.. మనల్ని మనం తక్కువ అంచనా వేసుకుంటాము కాబట్టి. ఒకప్పుడు చాలా సెన్సిటివ్​గా ఉండే మీరు.. ఇంత స్ట్రాంగ్​గా ఎలా మారిపోయారో మీకే అర్థం కానీ పరిస్థితులు ఎదురవ్వచ్చు. అప్పటికీ గానీ తెలియదు మీరు ఎంత స్ట్రాంగ్​ అయ్యారో.

జీవితంలో ఇలాంటి మార్పు మంచిదే. ఎందుకంటే ఓ మనిషి తనలో ప్రోగ్రస్ చూస్తున్నాడంటే.. వాడికి మంచి జరిగే పని ఏదో చేస్తున్నాడనే అర్థం. ఒక్కోసారి ఈ మార్పు తెలియకుండానే జరిగిపోతుంది. ఎందుకలా జరుగుతుంది అంటే.. కష్టాల్లో మీరు నేర్చుకున్న పాఠాలు.. జీవితం మీకు నేర్పించిన అనుభవాలు.. మళ్లీ ఆ కష్టం వస్తే తట్టుకోగలిగే మొండితనం.. వంటివి మీలో సహజంగానే పెరిగిపోతాయి కాబట్టి.

ఈ పరిస్థితులన్నీ మీకు తెలియకుండానే మీరు స్ట్రాంగ్​ అయ్యేలా చేస్తాయి. ఫిజికల్​గా స్ట్రాంగ్​గా లేకపోయినా.. మెంటల్​గా స్ట్రాంగ్​గా ఉండగలరు. మరీ తప్పని పరిస్థితుల్లో తప్పా.. మీరు ఏ విషయాల్లోనూ తలొగ్గరు. ఇష్టమైన జాబ్​ మానేయాల్సి వచ్చినప్పుడు.. నేను జాబ్​ మానేసి ఉండగలనా? అనుకుంటాము కానీ.. ఆ బాధలోనే మరో మంచి, బెటర్ జీతం వచ్చే జాబ్​ కోసం ట్రై చేస్తాము. అంటే మీ బాధే మీలో కసిని పెంచుతుంది. అలాగే మనం ప్రేమించే వాళ్లు దూరం అయితే ఉండగలమా అనే బాధ, భయం మీలో ఉండొచ్చు. కానీ ఒక దశలో మీకు మీరు చాలు ఇంకెవరు అవసరం లేదనే స్టేజ్​కి వచ్చేస్తారు. అది కూడా ఓ ప్రోగ్రసే.

మనలోని బాధ, భయాలే మనల్ని స్ట్రాంగ్​ మారుస్తాయి. అవి ఎంత ఎక్కువైతే.. మీరు అంత స్ట్రాంగ్​గా మారుతారు. మీ బాధలు, భయాలను ఇతరులకు చెప్పినప్పుడు.. మీరు స్ట్రాంగ్​ అవ్వలేరు. మీరు సైలంట్​గా మీలో మీరు మథనపడినప్పుడు, ఎవరికి మీ బాధలు షేర్ చేసుకోలేనప్పుడు మాత్రమే.. మీరు ధైర్యంగా, స్ట్రాంగ్​ మారుతారు. ఎందుకంటే మీ ప్రశ్నలే.. మీకు సమాధానం ఇస్తాయి. జవాబులేని ప్రశ్నల కోసం ఆరాటపడకుండా చూస్తాయి. రియాలిటీని చూపిస్తాయి. ఎండ్ ఆఫ్ ద డే నీకు నువ్వే తోడు.. ఇంకెవరు లేరు అనుకున్నప్పుడే మీరు స్ట్రాంగ్​గా ఉండగలరు. మీరు గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే.. మీ అనుభవాలే మిమ్మల్ని స్ట్రాంగ్​గా మార్చాయి లేదా.. మీ స్ట్రాంగ్​ అని మీకు తెలిసేందుకు ఈ కష్టాలు వచ్చాయని గుర్తించుకోవాలి.