Wednesday Quote : కష్టంగా ఉన్నా గివ్ అప్ చేయకండి.. సక్సెస్ అంత ఈజీగా రాదు
Wednesday Motivation : కొన్ని విషయాలలో త్వరగా గివ్ అప్ ఇచ్చేస్తాము. నాతోని కాదు. ఇప్పటికే చాలా ట్రై చేశాను. మనం చేసేదేమి లేదు అని చాలాసార్లు అనిపించవచ్చు. ఆ సమయంలో మనకు ఓటమిని ఒప్పుకోకపోవడం నచ్చకపోయినా గివ్ అప్ ఇచ్చేస్తుంటాం. గొప్ప విషయాలు జరగడానికి కచ్చితంగా టైం పడుతుంది కాబట్టి.. ఓపికతో వేచి ఉండండి. తప్పకుండా విజయం సాధిస్తారు.
Wednesday Motivation : గొప్ప విషయాలు ఎప్పుడూ అంత సులువుగా జరగవు. అవి అంత సులభంగా జరిగితే గొప్ప విషయాలు ఎందుకవుతాయి. కాబట్టి ఏ విషయాన్నైనా అంత సులువుగా వదులుకోకూడదు. ఒక్కోసారి అనిపించవచ్చు అరే ఏంటి.. మనం ఏం చేస్తున్నాం.. ఎంత చేసినా అనుకున్నది జరగట్లేదు ఏంటి? ఇంక మనం దానిని సాధించలేమా అనే మొదలైన డౌట్లు మనలో మొదలవుతాయి. ఇవన్నీ మనం గివ్ అప్ చేసేలా ప్రోత్సాహిస్తాయి.
మీరు గివ్ అప్ ఇచ్చేలా కొన్ని పరిస్థితులను మీరు కచ్చితంగా ఎదుర్కొంటారు. అప్పుడు మీరు స్ట్రాంగ్‌గా ఉండాలి. అందరికీ మొదటి ప్రయత్నంలోనే అన్ని దక్కవు. కొందరికి రెండో ప్రయత్నంలోనే దక్కవచ్చు. మరికొందరికి 99వ ప్రయత్నంలో దక్కవచ్చు. కాబట్టి తెలివైన వ్యక్తులు ఎప్పుడూ అంత సులువుగా గివ్ అప్ చేయరు. ఇన్నాళ్లు కష్టపడింది అంత సులువుగా వదులుకోవడానికి కాదు కదా..
మీ చుట్టూ ఉన్నా, చూస్తున్న వ్యక్తులు విజయాన్ని అంత సులువుగా పొంది ఉండరు. మనలాంటి ప్రతికూల పరిస్థితులను చాలా ఎదుర్కొనే ఉంటారు. కొన్ని వేల సార్లు విఫలమై ఉండవచ్చు. చాలా సార్లు గివ్ అప్ ఇవ్వాలని అనుకుని ఉండొచ్చు. కానీ వారు ఆ పని చేసి ఉండరు. కాస్త బ్రేక్ తీసుకుని రిలాక్స్ అయ్యి ఉంటారేమో కానీ.. పూర్తిగా దానిని వదులుకోవాలని మాత్రం ఆలోచించి ఉండరు. పదే పదే ప్రయత్నించి.. విజయానికి దగ్గరై ఉండొచ్చు.
మీ దారి ఎప్పుడూ పూల దారి కాదు. ఒక్కోసారి ముళ్లులు కూడా ఉంటాయి. పూల రహదారిలో కూడా ముళ్లు ఉండే అవకాశముంది. వాటికి భయపడి అడుగేయడం మానేస్తే.. ముందుకు వెళ్లలేం. విజయానికి అవతల వైపే ఆగిపోవాల్సి ఉంటుంది. మీరు జీవితంలో విజయం సాధించగలరా? లేదా అనేది మీ పట్టుదలపై ఆధారపడి ఉంటుంది. మీరు గివ్ అప్ ఇచ్చిన క్షణమే మీరు మీ వైఫల్యాన్ని అంగీకరించినట్లే.
ప్రత్యర్థి ఓడిపోయే అవకాశమున్నా.. మీరు గివ్‌అప్ ఇస్తే ఆట అక్కడితోనే ముగిసిపోతుంది. అంటే మీ సక్సెస్ అక్కడితోనే ఆగిపోతుందని అర్థం. మీరు ఇంకొంచెం ట్రై చేసి ఉంటే.. మీరు కచ్చితంగా విజయం పొందేవారు. ఎన్నిసార్లు ఓడిపోయినా పర్లేదు.. కానీ ఎప్పుడూ గివ్ అప్ చేయకండి. రాత్రికి రాత్రే సక్సెస్ రాదు. అలా వచ్చింది అంటే.. దానికోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి ఉండాలి.
మీరు లో గా ఫీల్ అయినప్పుడు, ఒత్తిడి ఎక్కువైనప్పుడు.. కాస్త విషయాలనుంచి బ్రేక్ తీసుకుని మళ్లీ మొదలుపెట్టండి. అంతేకానీ పూర్తిగా గివ్ అప్ ఇవ్వడం ఎప్పటికీ మంచిది కాదు. మంచి పనులు జరగడానికి సమయం పడుతుంది. దీనివల్ల సహనాన్ని కోల్పోవడం మంచిది కాదు. విజయం ఎంత దూరంలో ఉందని తెలిస్తే.. ఎవరూ అంత సులువుగా గివ్ అప్ చేయరు. దీనివల్లే చాలా మంది గివ్ అప్ ఇస్తూ.. సూసైడ్లు చేసుకుంటూ.. కృంగిపోతూ ఉంటారు. విజయం మనకు ఎంత దగ్గర్లో ఉందో తెలియదు కాబట్టి.. అంత సులువుగా గివ్ అప్ ఇవ్వకపోవడమే మంచిది.
సంబంధిత కథనం