Emoji: ఇవి ఎమోజీస్ కాదు ఎమోషన్స్.. ఎమోజీల చరిత్ర ఏంటో తెలుసా!-most popular emojis history new features of emojis and key facts ,లైఫ్‌స్టైల్ న్యూస్
Telugu News  /  Lifestyle  /  Most Popular Emojis History New Features Of Emojis And Key Facts

Emoji: ఇవి ఎమోజీస్ కాదు ఎమోషన్స్.. ఎమోజీల చరిత్ర ఏంటో తెలుసా!

ఎమోజీస్
ఎమోజీస్

మనసులో ఉన్న నిర్వచించలేని భావాన్ని ఒక్క ఎమోజీతో చెప్పేయొచ్చు. వాట్సప్ లాంటి ఇన్‌స్టాంట్ మెసేజింగ్ వచ్చిన తర్వాత వీటి ప్రాధన్యత విపరితంగా పెరిగిపోయింది. నేటి యువతకు ఆన్‌లైన్ సంభాషణలో ఎమోజీ ముఖ్యమైన అంశం.

 

ట్రెండింగ్ వార్తలు

ఇప్పుడు మన సందేశాలు ఎమోజీలుగా మారిపోతున్నాయి. మన భావాల్ని ఎదుటివారికి ప్రభావంతంగా వ్యక్తపరిచేందుకు వెంటనే గుర్తొచ్చేది ఎమోజీ( Emoji)లు. మనసులోని బాధ, సంతోషం, కోపం ఇలా ఒకటేమిటి అన్ని భావోద్వేగాలను ఎమోజీలతో వ్యక్తపరచవచ్చు. ఒక చిత్రం వెయ్యి పదాలకు సమానం అంటారు. మనసులో ఉన్న నిర్వచించలేని భావాన్ని ఒక్క ఎమోజీతో చెప్పేయొచ్చు. వాట్సప్ లాంటి ఇన్‌స్టాంట్ మెసేజింగ్ యాప్ వచ్చిన తర్వాత వీటి ప్రాధాన్యత విపరీతంగా పెరిగిపోయింది. నేటి యువతకు ఆన్‌లైన్ సంభాషణలో ఎమోజీ ముఖ్యమైన అంశం. అది మెసేజింగ్ యాప్ అయినా లేదా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయినా, ఎమోజీ ద్వారా కమ్యూనికేట్ చేయడం అలవాటుగా మారిపోయింది. ఇప్పుడు టెక్స్ట్ కంటే ఎక్కువ మంది ఎమోజీని ఉపయోగిస్తున్నారు.

ఎమోజీ పుట్టుక:

1862లో అమెరికా 16వ అధ‍్యక్షుడు అబ్రహం లింకన్‌ ప్రసంగం టైంలో అతని చేసిన ఆహభావాలే ఎమోజీల నాందికి కారణమైంది. ప్రసంగంలో అతను కన్నుగీటడం బాగా పాపులర్‌ అయ్యింది. దీంతో మరుసటి రోజు పలు పేపర్లలో ఆయన ప్రసంగించిన వార్తలతో పాటు పక్కనే కన్ను గీటే ఎమోజీల్ని కూడా ముద్రించారు. ఇలా ఎమోజీల పుట్టుక ప్రారంభమైనట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా అప్పటి సామాజిక మాధ్యమాలైన యాహూ మెయిల్, యాహూ మెసెంజర్‌లలో వినియోగదారుల సౌకర్యం కోసం యాహూ సంస్థ ఎమోజీలను అందుబాటులోకి తెచ్చింది. 

చాటింగ్‌లో ఎదుటి వ్యక్తి కనిపించరు కాబట్టి వారి హవాభావాలు తెలిపేందుకు వీలుగా యాహూ ఈ ఎమోజీలను టెక్నాలజీ రూపంలో నెటిజన్లకు పరిచయం చేసింది. సాంకేతిక రంగంలో అప్పటినుంచి ప్రారంభమైన ఎమోజీల ప్రస్థానం ఇప్పటికీ దిగ్విజయంగా కొనసాగుతుంది. అలా 2010 తర్వాత ఈ ఎమోజీలు మొబైల్‌ మోసిజింగ్ ఆప్షన్‌లోకి వచ్చి చేరాయి. అయితే మెుబైల్ రంగంలోకి ఎమోజీలను తీసుకొచ్చిన ఘనత మాత్రం జపాన్‌‌ మొబైల్ ఆపరేటింగ్ సంస్థ ‘ఎన్‌టీటీ డొకామో’ ఇంజినీర్‌ షిగెటకా కురిటాకు దక్కుతుంది.

వీటిని ఎలా ఆమోదిస్తారు:

ఎమోజీలు యూనికోడ్ కన్సార్టియం అనే సంస్థ  నియంత్రణలో ఉంటాయి. అందుకే వేటిని పడితే వాటిని వినియోగంలోకి తీసుకురారు. యూనికోడ్ ఆమోదం తర్వాతే వినియోగంలోకి తీసుకొస్తారు. అనంతరం మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో అందుబాటులోకి వస్తాయి. యూనికోడ్ కన్సార్టియంలో పలు ప్రముఖ టెక్నాలజీ సంస్థలు సభ్యులుగా ఉన్నాయి. ప్రస్తుతం చాటింగ్, గ్రాఫిక్స్, వీడియో ఎడిటింగ్‌లలో కూడా ఎమోజీలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మొత్తంగా 3,663 ఎమోజీలు వరకు అందుబాటులో ఉండగా 100 ఎమోజీలను అధికంగా వినియోగిస్తున్నారు. యూనికోడ్ కన్సార్టియం.. ఎమోజీల వినియోగంపై పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఇప్పటివరకు ఎక్కువగా ఉపయోగించిన ఎమోజీల జాబితాను కూడా విడుదల చేసింది.

2019లో టాప్ 10 జనాదరణ పొందిన ఎమోజీలు

😂

❤️

😍

🤣

😊

🙏

💕

😭

😘

👍

2021లో టాప్ 10 జనాదరణ పొందిన ఎమోజీలు

😂

❤️

🤣

👍

😭

🙏

😘

🥰

😍

😊

యూనికోడ్ అధ్యయనం ప్రకారం బాగా నవ్వినప్పుడు వచ్చే కన్నీళ్ల (Face With Tears Of Joy - 😂 )  ఎమోజీని ఎక్కువ మంది వినియోగించారు. తర్వాత రెండో స్థానంలో రెడ్‌ హార్ట్‌ ఎమోజీ (Red Heart - ❤️ )ఉంది. మూడో స్థానంలో కిందపడి దొర్లుతూ నవ్వుతున్న (Floor Laughing - 🤣 ) ఎమోజీలు ఉన్నాయి.

WhatsApp channel

సంబంధిత కథనం