Tuesday Motivation : లైఫ్‌లో అంతా చీకటే ఉంది అనుకోకండి.. మీకోసం స్టార్స్ ఉన్నాయ్
Tuesday Motivation : గుర్తుపెట్టుకోండి.. మీరు చీకట్లో ఉన్నప్పుడు మాత్రమే స్టార్స్ చూడగలరు. ఎందుకంటే వెలుతురులో అవి కనిపించవు కాబట్టి. కాబట్టి చీకట్లో ఉన్నామని బాధపడకండి. వెలుతురుతో పాటు చీకటిని చూడటం కూడా ముఖ్యమే. అప్పుడే వెలుతురు అంటే ఏమిటో తెలుస్తుంది. చీకటి గొప్పతనం కూడా అప్పుడే తెలుస్తుంది.
Tuesday Motivation : చాలామంది పగటివేళను పట్టించుకున్నంత చీకటిని పట్టించుకోరు. ఎందుకంటే పగలు చాలా పనులు చేసుకోవచ్చు. రాత్రి పడుకోవడమే కదా అనుకుంటారు. కానీ వెలుతురు, చీకటి రెండూ సమానమైనవేనని వారు గుర్తించరు. చీకటి ఉండబట్టే వెలుతురుకి అర్థముంది. చీకట్లో తీసుకునే విశ్రాంతి వల్లనే.. వెలుతురులో మీరు చేసే పనులు సక్సెస్ అవుతాయి.
ట్రెండింగ్ వార్తలు
వెలుగులో ఉన్నప్పుడు మీరు విషయాలను మరింత స్పష్టంగా చూస్తారు. కానీ వెలిగే నక్షత్రాలను వెలుగులో చూడలేరు కదా. అవి చీకట్లోనే మనకు కనిపిస్తాయి. నక్షత్రాల అందాన్ని ఆస్వాదించాలంటే చీకటే కరెక్ట్. అంతే దీనినే లైఫ్‌కి అప్లై చేసుకుంటే.. జీవితంలో కొన్ని బాధకలిగించే రోజులు ఉంటాయి. సంతోషాన్ని ఇచ్చే రోజులు ఉంటాయి. బాధ రావడం వల్లనే సంతోషం వాల్యూ తెలుస్తుంది.
పైగా చీకట్లో ఉన్నప్పుడు.. అంటే బాధలో ఉన్నప్పుడు మన నక్షత్రాలు ఏమిటో తెలుస్తుంది. బాధలో ఉన్నప్పుడు అంతా శూన్యంగా కనిపిస్తుంది. అసలు ఏంటి మొత్తం చీకటి అనుకుంటాము. కానీ సరిగా చూస్తే స్టార్స్ ఉంటాయి. మీరు వాటిని చూడగలిగినప్పుడు అవి ఇంకా ప్రకాశవంతంగా కనిపిస్తాయి. చీకటిని సమస్యగా తీసుకుంటే.. నక్షత్రాలు అనేవి మీ సమస్యలకు పరిష్కారమనుకోవచ్చు. లేదా ఆ నక్షత్రాలు మనుషులే అయిఉండొచ్చు. మీ చీకట్లో కూడా వారు మీకు తోడుంటారు. పగలు వారు మీ వెన్నంటే లేరని భావించవచ్చు. కానీ వారు మీకు విజయంలో ఎల్లప్పుడూ తోడుంటారు. కానీ బయటకు అంత ఈజీగా కనిపించరు. మీరే వారిని వెతుక్కోవాల్సి ఉంటుంది.
జీవితంలోని ప్రతి దశకు ఏదో ఒక ప్రాముఖ్యత ఉంటుంది. మనకి జరిగే మంచికి ఎంత వాల్యూ ఉందో.. చెడుకి అంతే ప్రాముఖ్యత ఉంది. చీకటి, వెలుగు కలిస్తే రోజు ఎలా కంప్లీట్ అవుతుందో.. మంచి, చెడు కలిస్తేనే ఓ మనిషి అవుతారు. ఈ రెండు లేని వ్యక్తి పరిపూర్ణమైన వ్యక్తి ఎప్పటికీ కాలేడు. చిక్కుముళ్లల్లో చిక్కినప్పుడే కదా.. చలనం తెలిసేది. కాబట్టి చీకటిని.. మనకు ఎదురయ్యే పరిస్థితులను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి.
అంతేకాకుండా మీ జీవితంలోని అతిపెద్ద పాఠాలను నేర్చుకోవడంలో మీకు సహాయపడేవి కష్టాలు మాత్రమే. అప్పుడు జీవితం ఎలా సాగుతుందో అర్థమవుతుంది. ఎవరూ మీకు తోడుగా ఉంటారో.. ఎవరూ మిమ్మల్ని అవసరానికి వాడుకుంటున్నారో క్లారిటీ వస్తుంది. అందువల్ల మీ జీవితంలోని మంచి సమయంతో పాటు.. సవాళ్లను స్వాగతించేంత తెలివిగా మీరు ఉండాలి. మంచి సమయాలు మీకు ఉల్లాసాన్ని ఇస్తే.. కష్టాలు మిమ్మల్ని మానసికంగా స్ట్రాంగ్‌గా చేస్తాయి.
సంబంధిత కథనం