Tuesday Motivation : పాజిటివ్‌గా ఆలోచించలేనివారి దగ్గర సైలంట్‌గా ఉండడమే మంచిది..
Tuesday Motivation : లైఫ్‌లో పాజిటివ్‌గా ఉండడం చాలా కష్టం. ఎందుకంటే మనం ప్రతి పనిలోనూ, ప్రతి వ్యక్తులలోనూ నెగిటివ్‌ని చూస్తాం. కానీ ఎలాంటి పరిస్థితుల్లోనైనా పాజిటివ్‌గా ఉంటే సగం సమస్యలు తగ్గుతాయి. కనీసం పాజిటివ్‌గా ఉండలేకపోతే.. సైలంట్‌గా ఉండండి. లేదా అక్కడి నుంచి వెళ్లిపోండి.
Tuesday Motivation : ప్రతికూల సమస్యలు, ప్రతికూల వ్యక్తులు, ప్రతికూల పరిస్థితులు.. మన జీవితంలో ఓ భాగం. దాదాపు ప్రపంచం ఇలాంటి భావాలు కలిగిన వ్యక్తులతోనే నిండిపోయింది. అయితే పాజిటివ్‌గా ఆలోచించే వారే లేరా అంటే.. ఎందుకు లేరు ఉన్నారు. అలాంటి వారితో సమస్యలేదు. కానీ ప్రతిదీ నెగిటివ్‌గా తీసుకుంటూ.. నెగిటివ్‌గా ఆలోచించే వారే ఎక్కువ. అది మీరు కావొచ్చు. మీరు ఎదుర్కొనే వారు కావొచ్చు.
మీరు పాజిటివ్‌గా ఆలోచించలేకపోతే.. కనీసం సైలంట్‌గా ఉండడం నేర్చుకోండి. లేదా అక్కడి నుంచి వెళ్లిపోండి. అక్కడి నుంచి వెళ్లిపోతే పరిస్థితి మారుతుందా అంటే లేదు. కానీ కాస్త సమయం దొరుకుతుంది. అప్పుడు మీరు మరింత ప్రశాంతంగా ఆలోచించగలరు. లేదంటే ఆలోచించే దృక్పథం మారుతుంది. మీకు పరిస్థితిని సరిగా అర్థంకాక అపార్థం చేసుకుంటున్న అనిపిస్తే సైలంట్‌గా ఉండండి. ఆ సమయంలో ఇతర వ్యక్తులు మీతో బలవంతంగా మాట్లాడిస్తారు. అనసర ప్రశ్నలు అడుగుతారు.
మీ ప్రశాంతతను కోల్పోయేలా చేసి.. మిమ్మల్ని రెచ్చగొడతారు. అప్పుడు మీకు తెలియకుండానే మీరు కోపాన్ని ప్రదర్శిస్తారు. మీరు ఏమి ఆలోచిస్తున్నారో చెప్తారు. కోపంలో మంచి ఎప్పుడూ బయటకు రాదు కాబట్టి.. నెగిటివ్ మాత్రమే వస్తుంది. అదే అదనుగా వాళ్లు మీ మాటాలను ఆసరాగా తీసుకుని.. మిమ్మల్ని నిందిస్తారు. మీరు బాధపడేలా చేస్తారు. అలాంటి వారికి దూరంగా ఉండండి. వారు ఎప్పుడూ తమ తప్పులు తెలుసుకోకుండా.. ఎదుటివారిలో తప్పులనే వెతుక్కుంటూ ఉంటారు. వాళ్లు అంతే అనుకుని వదిలేయడమే పరిష్కారం. మనలో ప్రతికూల ఆలోచనలు ఉండొచ్చు. కానీ వాటిని ప్రేరేపించే వారి వల్లనే అవి బయటకు వస్తాయి. వారే వాటిని బయటకు తీసుకువస్తారు. చివరికి తప్పు మీదే అన్నట్లు వ్యవహరిస్తారు.
ఒకటి గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని రెచ్చగొట్టి.. మీకు కోపం రప్పించి.. ఆ సమయంలో మీరు మాటలు అనేలా చేసి.. తిరిగి మీ మాటాలు మమ్మల్ని బాధపెడుతున్నాయంటూ మిమ్మల్ని నిందించేవారికి మీ ప్రేమ ఎప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే కోపంలో అనే మాటలనే చూస్తారు కానీ.. దానిలో బాధను వాళ్లు గుర్తించలేరు కాబట్టి. వాళ్ల ప్రేమనే గొప్ప అనుకుంటారు. వాళ్లే కరెక్ట్ అనుకుంటారు. వాళ్ల ప్రేమ ముందు మీ ప్రేమ అసలు కనిపించదు వాళ్లకి. కాబట్టి అలాంటి వారి దగ్గర మౌనంగా ఉండండి. లేదా అక్కడి నుంచి వెళ్లిపోండి. వాళ్లు మాటలతో మీ ప్రశాంతతను కోల్పోయేలా చేస్తుంటే అక్కడి నుంచి వెళ్లిపోండి.
ఎవరైనా ఎప్పుడూ ప్రశాంతంగా మాత్రమే ఆలోచించలేరు. ఏదొక సమయంలో నెగిటివ్‌గా ఆలోచిస్తాము. కానీ కనీసం ఆ సమయంలో సైలంట్‌గా ఉండండి. ఎందుకంటే ఈ ప్రపంచానికి మరింత సానుకూల వ్యక్తులు కావాలి. ఇది మీరు, సమాజం ఎదగడానికి మంచి మార్గం. ప్రతికూల ఆలోచనలు ప్రేరేపించే వారికి దూరంగా ఉండండి.
సంబంధిత కథనం