Sunday Motivation : కొన్నిసార్లు సైలంట్‌గా ఉండడమే బెటర్.. ఎందుకంటే..
ఒక్కోసారి మీ దగ్గర ప్రతి మాటకి సమాధానం ఉండొచ్చు. కానీ మీరు సైలంట్‌గా ఉన్నారంటే అర్థం సమాధానం లేక కాదు. మిమ్మల్ని ఏదో ఫీలింగ్ సమాధానం ఇవ్వకుండా ఆపేస్తుంది. అప్పుడు మీ మైండ్, మనసులో ఎన్ని మాట్లాడుకున్నా.. పెదాలు కదలవు. సరికదా ఓ చిన్న స్మైల్ వస్తుంది. అది సంతోషంతో వచ్చేది కాదు. ఆ స్మైల్ ఓ రకమైన నిట్టూర్పు.
Sunday Motivation : జీవితంలో కొన్నిసార్లు మౌనంగా ఉండడమే మంచిది. ఎందుకంటే.. మౌనం కూడా ఓ శక్తివంతమైన వ్యక్తీకరణే కాబట్టి. ఆ మౌనంలో ఎన్నో మాటలు దాక్కుని ఉంటాయి. ఎన్నో గొడవలు జరుగుతుంటాయి. మనసు మథనపడుతూ ఉంటుంది. ప్రతి మాటకు బదులు ఇస్తాము కానీ.. అవి పెదవి దాటి బయటకు రావు. నోటి చివరి వరకు పదాలు దొర్లుతూ వచ్చినా.. పంటి బిగువన వాటిని పట్టి ఆపేస్తాము. మాటలు, చేతలు భరిస్తూ కూడా సైలంట్‌గా ఉండడం అంత సులువేమి కాదు. కానీ మీరు ఉన్నారంటే కచ్చితంగా మీరు ఓ మెట్టు ఎక్కేసినట్టే.
మీరు బంధాన్ని కాపాడుకోవడానికి సైలంట్‌గా ఉండొచ్చు. బంధం తెగిపోయింది అనుకున్నప్పుడు సైలంట్‌గా ఉండొచ్చు. కానీ మీ సెల్ఫ్‌రెస్పెక్ట్ పోతున్నప్పుడు కూడా సైలంట్‌గా ఉన్నారంటే.. మీరు రోజు రోజుకి మరింత వైలంట్ అయినా కావొచ్చు.. స్ట్రాంగ్ అయినా కావొచ్చు. కొన్నిసార్లు వ్యర్థమైన చర్చలు అనవసరం అనిపించి కూడా మీరు మౌనంగా ఉండిపోతారు. లేదా మీరు మాట్లాడేది తప్పు అని వారికి చెప్పాల్సిన అవసరం మీకు లేదని అనిపించవచ్చు. ఎందుకంటే మీరేంటో మీకు తెలిస్తే చాలు. పక్కనివాళ్లకి తెలియాల్సిన అవసరం లేదనే మెచ్యూరిటీ అయినా అయి ఉండొచ్చు. ఈ విషయంలో మీకు కచ్చితంగా క్లారిటీ ఉండాలి. లేదంటే మీరే ఆలోచనలతో ఒత్తిడిని పెంచేసుకుంటారు.
కోపంలో జారే మాటాలు వెనక్కి తీసుకోవడం కష్టం. ఆ తప్పు మీరు చేయకూడదు అనుకుంటున్నారేమో. అందుకే వారు అనే మాటలతోనే కడుపు నింపేసుకుని.. కుమిలిపోతూ.. ఆ తప్పు మీరు చేయకుండా సైలంట్‌గా ఉంటున్నారేమో. ప్రతి మాటకు సమాధానం ఇవ్వడానికి సెకన్ చాలు. కానీ ఆ సమయంలో అనరాని మాట ఒక్కటి అన్నా లైఫ్‌లాంగ్ బాధపడాల్సి వస్తుంది. ఇప్పటికే మీకు చాలా రిగ్రేట్స్ ఉంటాయి. మళ్లీ కొత్తవి ఎందుకు అని మౌనంగానే ఉంటున్నారేమో.
కొన్ని మాటలు పడుతూ.. ఛీత్కారాలను తీసుకుంటున్న మీరు.. వాటికి సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉండి.. నవ్వుకుంటున్నారంటే.. మీరు చాలా డేంజర్ స్టేజ్‌కి చేరుకున్నారని అర్థం. ఎందుకంటే ఆ నవ్వులో ఓ రకమైన నిట్టూర్పు ఉంటుంది. అది మిమ్మల్ని లాంగ్ బ్రీత్ తీసుకునేలా చేస్తుంది. పైగా నవ్వుకోవడం తప్పుకాదు. బ్యాక్‌గ్రౌండ్‌లో మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెప్తుంది అనే సాంగ్ వేసుకోండి. ఎందుకంటే ఈ స్టేజ్‌లో అంతకు మించి ఏమి చేయలేము కాబట్టి.
సంబంధిత కథనం