Friday motivation : కొన్నిసార్లు ఆర్గ్యూ చేయడం కంటే.. సైలంట్​గా ఉండడమే బెటర్-friday motivation on never respond to rudeness when people are rude to you they reveal who they are ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Friday Motivation : కొన్నిసార్లు ఆర్గ్యూ చేయడం కంటే.. సైలంట్​గా ఉండడమే బెటర్

Friday motivation : కొన్నిసార్లు ఆర్గ్యూ చేయడం కంటే.. సైలంట్​గా ఉండడమే బెటర్

Geddam Vijaya Madhuri HT Telugu
Aug 12, 2022 07:24 AM IST

Friday motivation : మీతో ఎవరైనా సభ్యత లేకుండా మాట్లాడితే.. మీరు బాధపడిపోకండి. ఎందుకంటే.. వారు మీరు చేసిన దానికి బదులుగా రెస్పాండ్ అవుతున్నట్లు కాదు. వాళ్లు తమ నిజమైన క్యారెక్టర్​ని బయటపెట్టినట్లు. కాబట్టి వారి మాటలను హార్ట్​కి తీసుకోకండి. సైలంట్​గా వారి నిజస్వరూపాన్ని చూడండి.

<p>కోట్ ఆఫ్ ద డే</p>
కోట్ ఆఫ్ ద డే

Friday Motivation : కొందరు ఎలాంటి సంభాషణల్లో అయినా.. సభ్యత లేకుండా.. అసభ్యకరంగా మాటలు విసురుతూ ఉంటారు. అలాంటి సంస్కారం లేని మాటలకు మీరు రెస్పాండ్ కాకాపోవడమే మంచిది. ఎందుకంటే అదే వారి నిజమైన క్యారెక్టర్. వారి సంస్కారం అంతే అనుకుని మనం సైలంట్​గా ఉండడమే బెటర్. అలాంటి వారితో ఆర్గ్యూ చేయడం కూడా వేస్ట్.

పోనివారికి తెలిసేటట్లు, అర్థమయ్యేటట్లు చెప్దామనుకున్నా వారు వినరు. ఎందుకంటే వారి సంస్కారం అంతే కాబట్టి. అంతేకానీ వారు అనే ఆ చెత్తమాటలకు మీరు తక్కువైపోయినట్లు ఎప్పుడూ భావించకండి. ఒకరు ఏదో అన్నారని మీరు ఎప్పుడూ తక్కువ కారు. మీ చుట్టూ ఉన్నవారితో దయగా, మర్యాదగా ఉండండి చాలు. అదే మీకు గౌరవాన్ని తెస్తుంది. అంతేకానీ ఎవరో దారిన పోయే దానయ్య ఏదో అన్నాడని.. మీ గౌరవానికి భంగం వాటిల్లిందని ఫీల్ అవ్వడం వేస్ట్. మీ చుట్టూ ఉన్నవారికి మీరు ఏంటో తెలిస్తే.. తప్పు ఎవరిదో కూడా తెలిసిపోతుంది.

ఎవరైనా మీతో అసభ్యంగా, తక్కువ చేసి మాట్లాడినప్పుడు.. మీరు ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. వారి మాటలకు మనం కూడా ధీటైనా జవాబులు ఇవ్వొచ్చు. కానీ అది మనం కాదు. ఎదుటివాళ్లు మనల్ని హర్ట్ చేసినంత సులువుగా.. మనం వారిని హర్ట్ చేయలేము. ఇది చాలా మెచ్చుకోదగిన విషయం. వారు అదుపు తప్పారని.. మనం కూడా పరిధులను దాటి ప్రవర్తించాల్సిన అవసరం లేదు కదా. మీరు జవాబు ఇవ్వలేదంటే వాళ్లు కంటే మనం తక్కువైపోయామనుకోకండి. బురదలో రాళ్లు వేస్తే.. మన బట్టలే పాడవుతాయని గుర్తించుకోండి. సైలంట్​గా అక్కడి నుంచి వచ్చేయండి.

మీరు చేసే ప్రతి పనిలో బెస్ట్ ఇవ్వండి. అదే మిమ్మల్ని అందరికీ దగ్గర చేస్తుంది. మీపట్ల ఎవరైనా అసభ్యంగా బిహేవ్ చేస్తే.. మీలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చే అవకాశముంది. అవి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మీలోపల చాలా ఆన్సర్స్ ఉండొచ్చు. కానీ వాటిని బయటకు చెప్పి.. గొడవపడి మిమ్మల్ని మీరు డౌన్ చేసుకోవడం తప్పా.. సైలంట్​గా ఉండటమే బెటర్. మీరు కూడా వాళ్లకి సమానంగా గొడవపడితే.. మీరు ఎలాంటి వారనేది వారికి అర్థమైపోతుంది. అప్పుడు వాళ్లు మిమ్మల్ని ఊరికే విసిగించే అవకాశముంది. పైగా కోపంలో మనం నోరుజారే మాటలకు మనమే బాధపడాల్సి వస్తుంది.

మనతో ఎవరో అసభ్యంగా ఉన్నారని.. మనము అలా ప్రవర్తించాల్సిన అవసరం లేదు. ఇతరులతో అసభ్యంగా ప్రవర్తించకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. మీరు తప్పుడు మాటలతో ఎవరినైనా ఒక్క క్షణంలో బాధపెట్టవచ్చు. అవి ఎలా ఉంటాయంటే.. గతంలో మీరు వారికి చూపించిన ప్రేమను, దయను అన్ని మరచిపోయేలా చేస్తాయి. కాబట్టి ఇతరులతో మాట్లాడేటప్పుడు అహం లేకుండా.. దయతో ఉండడమే మంచిది. మీరు ఎవరితో మాట్లాడినా మీ మొహంపై చిన్న చిరునవ్వు ఉంటే చాలు.

ఎవరినీ ఎప్పుడూ బాధపెట్టవద్దు. అది మీ ఇద్దరికీ మంచి కాదు. ఎల్లప్పుడూ మర్యాదగా ఉండండి. ఎక్స్​ట్రీమ్​గా అనిపించే ఏ ఎమోషన్​ని అయినా ఒక్క నిముషం కంట్రోల్ చేసుకుంటే.. పరిస్థితి మన చేయి జారదని గుర్తించుకోండి. వాళ్లు అనేవి కూడా హార్ట్​కి, వ్యక్తిగతంగా తీసుకోకపోవడమే మంచిది. మీరు సైలంట్​గా ఉన్నప్పుడు వారి గురించి చాలా కొత్తవిషయాలు తెలుస్తాయి. ట్రై చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం