Tuesday Motivation : మిమ్మల్ని ఎవరైనా కోపంలో తిడితే మీరు ఏమి చేస్తున్నారు.. ?
కొందరు ముందు వెనుక ఆలోచించకుండా కోపంలో ఎదుటివ్యక్తిని అనరాని మాటాలు అనేస్తారు. తరువాత నా ఉద్దేశం అది కాదు. కావాలని అనలేదు అంటారు. కానీ వారు ఆ సందర్భంలో అన్న మాటలను మీరు పర్సనల్‌గా తీసుకోకండి. ఎందుకంటే కోపంలో మనిషి విచక్షణ కోల్పోతాడు. ఆ సమయంలో అనే మాటాలు మిమ్మల్ని బాధించవచ్చు కానీ.. మీరు వాటి గురించి ఎక్కువ ఆలోచించకపోవడమే మంచిది.
Tuesday Motivation : మన చుట్టూ ఉండేవారిలో మొరటుగా, మొండిగా ఉండే వ్యక్తులు ఉండే ఉంటారు. వారు కోపంలో నోరుజారి అనరాని మాటాలు అంటారు. మీకు సమాధానం చెప్పాలని ఉన్నా.. మీరు సైలంట్‌గా ఉండే పరిస్థితులు ఉండవచ్చు. ఉదాహరణకు మీ బాస్‌నే తీసుకుందాం. అతను ప్రెజర్ వల్లనో.. లేక ఇతర టెన్షన్ వల్లనో ఒక్కోసారి ఎక్కువ కోపం చూపిస్తారు. ఆ సమయంలో వారు అనే మాటాలను పర్సనల్‌గా తీసుకోకండి. తీసుకున్నారో మీరు చాలా బాధపడాల్సి వస్తుంది.
మీరు పని చేస్తున్నప్పుడు.. రోజు ప్రారంభంలోనే మీ బాస్ మీ మీద అరిచాడనుకోండి.. మీ రోజంతా పాడవుతుంది. అబ్బా ఉదయాన్నే ఏంటి ఈ పంచాయతీ అనుకుంటారు. ఆయన మాటలకు మీ డే అంతా డిస్టర్బ్ అవుతుంది. షిఫ్ట్ ముగిసే సమయానికి మిమ్మల్ని మీరే నిందించుకుంటూ ఉంటారు. ఒక్కోసారి జాబ్ మానేయాలని కూడా అనిపిస్తుంది. కాబట్టి అలాంటి వ్యాఖ్యలను మీరు ఎప్పుడూ వ్యక్తిగతంగా తీసుకోకూడదు. మళ్లీ మీ బాస్ మీతో మంచిగా ఉండొచ్చు. ఈ రెండు వాంటెడ్ ఎమోషన్స్ కాదు. అందుకే మీ బాస్‌కు ఆయన తప్పు తెలిసే అవకాశం చాలా తక్కువ.
కొందరు ఇతరులపై కోపాన్ని మనపై చూపించవచ్చు. వాళ్లని అనలేక.. మనల్ని అనరాని మాటాలు అంటారు. ఇది తప్పు అని వాళ్లకి అప్పుడు తెలియకపోయినా.. తర్వాత రియలైజ్ అవుతారు. కాబట్టి వారు అనే మాటాలను హార్ట్‌కి తీసుకోకపోవడమే మంచిది. ఇలా ఉండడం కష్టమే ఎందుకంటే.. ఒకరు మనల్ని ఇష్టం వచ్చినట్లు తిడుతూ ఉంటే.. మీ మనసు తెలియకుండానే బాధపడుతుంది. ఆ మాటాలు మీ చెవిలో వినిపిస్తూనే ఉంటాయి. ఒక్కోసారి వాటి వల్ల మీలో కోపం, బాధ కూడా పీక్స్ స్టేజ్‌కి చేరుకుంటుంది. కాబట్టి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి.
అవతలి వ్యక్తి సరిగా ప్రవర్తించకపోతే.. మీ వంతుగా నోరుజారకుండా ఉండండి. మీరు కూడా అలా తిట్టేస్తే.. ఇంక అది పీక్స్ స్టేజ్‌కి చేరుకుంటుంది. జీవితంలో అనేది ఎక్కడా ఆగకుండా వెళ్తూనే ఉండాలి. వారి మాటలతో ఆగిపోయారో.. మీరు అంత సులువుగా ముందుకు వెళ్లలేరు. జీవితంలో చాలా మంది వ్యక్తులను కలుస్తూనే ఉంటారు. అందరూ మంచివారే ఉండాలని రూల్ లేదు. కానీ వారితో మీకు వర్క్ పరంగానో.. ఆఫీస్ పరంగానే ఏదొక పని ఉంటుంది. కాబట్టి మీరు వాళ్లతో కలిసి పనిచేయాలి. ఇలాంటప్పుడు మీ మెప్పును వారు.. వారి మెప్పును మీరు పొందాల్సిన అవసరం లేదు. మీ పనిపై దృష్టి పెట్టే వీలు కల్పిస్తే చాలు.
అంతేకాకుండా ప్రతి విషయాన్ని వ్యక్తిగతంగా తీసుకుని బాధపడాల్సిన అవసరం లేదు. ఈ ప్రపంచంలో మీ గురించి ఎవరికి తెలియకపోయినా.. మీ గురించి మీకు తెలుసుకదా. మరి మిమ్మల్ని మీరే నిందించుకుంటూ ఉంటే.. మిమ్మల్ని పొగిడేవారు ఎవరు? కాబట్టి మీ వ్యక్తిగతంగా మిమ్మల్ని మీరు ప్రైజ్ చేసుకోండి. ఇతరుల వ్యాఖ్యలతో మనసును గాయపరచుకోకండి.
సంబంధిత కథనం