Professional sleeper job: మీకు 'నిద్ర' అంటే ఇష్టమా? అయితే ఈ జాబ్​ మీకోసమే!-job alert are you a professional sleeper apply to this us mattress firm ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Job Alert! Are You A Professional Sleeper? Apply To This Us Mattress Firm

Professional sleeper job: మీకు 'నిద్ర' అంటే ఇష్టమా? అయితే ఈ జాబ్​ మీకోసమే!

Sharath Chitturi HT Telugu
Aug 09, 2022 08:24 AM IST

Professional sleeper job : నిద్రపోవడం ఒక ఆర్ట్​.. అని చాలా మంది అంటారు. ఇప్పుడు ఈ ఆర్ట్​కు గుర్తింపు లభిస్తోంది! మీకు నిద్ర అంటే ఇష్టమా? అయితే.. మీకోసం ఒక అద్భుతమైన ఉద్యోగం ఎదురుచూస్తోంది..

మీకు 'నిద్ర' అంటే ఇష్టమా? అయితే ఈ జాబ్​ మీకోసమే!
మీకు 'నిద్ర' అంటే ఇష్టమా? అయితే ఈ జాబ్​ మీకోసమే! (iStock)

Professional sleeper job : 'అలా పొద్దస్తమాను నిద్రపోకపోతే.. ఏదైనా పని చేసుకోవచ్చు కదా!' అని పెద్దలు అంటూనే ఉంటారు. ఎక్కువ నిద్రపోతే.. సోమరితనం పెరిగిపోయి దేనికీ పనికిరారు అని తిడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు నిద్రపోవడం కూడా ఒక పనే! అందుకు జీతం కూడా వస్తుంది. అవునండి.. మీకు నిద్ర అంటే ఇష్టమా? అయితే మీకు ఉద్యోగం ఇచ్చేందుకు ఎన్నో సంస్థలు సిద్ధంగా ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

మీ నిద్ర స్కిల్స్​ను ప్రదర్శిస్తే.. మీకు ఉద్యోగం ఇచ్చేందుకు అమెరికాలోని ఎన్నో సంస్థలు ఎదురుచూస్తున్నాయి. 'ప్రొఫెషనల్​ స్లీపర్​' జాబ్స్​ అని వీటికి పేరు కూడా ఉంది. అమెరికాలో పరుపులు, దిండ్లు వంటి నిద్రకు సంబంధి ఉత్పత్తులను తయారు చేసే క్యాస్పర్​ స్లీపర్స్​ అనే సంస్థ.. ఈ ప్రొఫెషనల్​ స్లీపర్లను ఉద్యోగంలోకి తీసుకుంటోంది. నిద్ర నుంచి లేచిన తర్వాత.. ప్రొఫెషనల్​ స్లీపర్​గా మీ అనుభవాన్ని టిక్​టాక్​ తరహాలో వీడియోలు చేసి అప్లోడ్​ చేయాలి.

Sleeping jobs : "నిద్రపోవడం అంటే మీకు ఇష్టమా? అయితే మీరు నిద్రపోవడానికి మేము ఉద్యోగం ఇస్తున్నాము. క్యాస్పర్స్​ స్లీపర్స్​లో చేరండి.. ప్రజలకు మీ స్లీపింగ్​ స్కిల్స్​ చూపించండి. త్వరపడండి. మా ఉద్యోగంలో చేరండి. మంచి నిద్రతో దేన్నైనా మార్చేయవచ్చు అని మేము విశ్వసిస్తాము," అని జాబ్​ పోస్టింగ్​ పేర్కొంది.

కంపెనీ ప్రకారం.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిద్రపోయే సత్తా, స్కిల్​.. పోస్టుకు అప్లై చేసే అభ్యర్థికి ఉండాలి. తన నిద్రతో ఇతరుల్లో స్ఫూర్తినింపాలి.

"పడుకోండి. మా దుకాణాల్లో పడుకోండి. ప్రపంచంలోని ఏ పరిస్థితుల్లోనైనా పడుకోవాలి. మీరు పడుకోకపోతే.. అప్పటివరకు నిద్రతో మీకు ఉన్న అనుభవాన్ని టిక్​టాక్​, ఇతర సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేయండి. మీ నైపుణ్యాన్ని ప్రదర్శించుకోండి," అని క్యాస్పర్​ స్లీపర్స్​ పేర్కొంది.

ఎంతసేపైనా, కెమెరాల ముందు పడుకునే వ్యక్తిని ఉద్యోగానికి ఎంపిక చేయాలని చూస్తున్నట్టు సంస్థ వెల్లడించింది.

Casper sleeping job : "న్యూయార్క్​లో నివాసముండే(ఇతర ప్రాంతాలైనా పర్లేదు), 18ఏళ్లు పైబడిన వ్యక్తి అప్లై చేసుకోవచ్చు. మీ టిక్​టాక్​ ఖతాను షేర్​ చేయండి," అని క్యాస్పర్​ స్లీపర్​ జాబ్​ పోస్ట్​ చెబుతోంది.

ఉద్యోగం లభిస్తే.. పైజామాల్లో పడుకోవచ్చు. క్యాస్పర్​ ప్రాడక్టులు ఉచితంగా లభిస్తాయి. వర్కింగ్​ హవర్స్​ కూడా ఫ్లెక్సిబుల్​గా ఉంటాయి. క్యాస్పర్​.కామ్​లో మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.

ఈ వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. నెటిజన్లు విపరీతంగా జోక్​లు వేసుకుంటున్నారు. 'నిద్రపోవడానికి జాబ్​ లభిస్తోంది.. నేను వెంటనే అప్లై చేస్తా..' అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం