తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sleeping Tips : పరుపులపై నిద్రిస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి

Sleeping Tips : పరుపులపై నిద్రిస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి

HT Telugu Desk HT Telugu

24 February 2023, 20:00 IST

    • Sleeping On Bed : ఒకప్పుడు నేలపై, నులక మంచం మీద పడుకునేవారు. దీంతో అనారోగ్య సమస్యలు దూరంగా ఉండేవి. అయితే ప్రస్తుత కాలంలో సుఖమైన జీవితానికి అలవాటు పడి.. చాలా మంది పురుపుల మీద నిద్రిస్తున్నారు.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (unsplash)

ప్రతీకాత్మక చిత్రం

ఈ కాలంలో ప్రజలు సౌకర్యాలకు అలవాటుపడ్డారు. సుఖంగా ఉండేందుకు చూస్తున్నారు. ఇక నిద్ర(Sleep)పోవడానికి మెత్తగా ఉండే పరుపులను చూసుకుంటున్నారు. సుఖంగా నిద్రపోయేందుకు పరుపుల మీద పడుకుంటున్నారు. కానీ నిద్రించేందుకు పరుపులు ఉపయోగించడం వలన.. మనం అనేక సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆరోగ్య సమస్యలు(Heath Problems) వస్తాయని అంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Salt Water Face Wash : ఉప్పు నీటిని ఇలా వాడితే మెుటిమలు, నల్లమచ్చలు శాశ్వతంగా మాయం

Optical Illusion: ఇక్కడ ఇచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్లో H అక్షరం దాక్కుంది, అది ఎక్కడుందో పది సెకన్లలో కనిపెట్టండి

Chanakya Tips Telugu : ఈ 8 లోపాలు మీలో ఉంటే జీవితంలో విజయం సాధించలేరు

West Nile Fever: వ్యాపిస్తున్న వెస్ట్ నైల్ ఫీవర్, ఈ జ్వరం లక్షణాలు ఇవే

పరుపుల తయారీలో ఫార్మల్డ్ హైడ్, బెంజీన్, నాఫ్తలీన్ లాంటివి ఎక్కువగా ఉపయోగిస్తారు. వీటి కారణంగా కళ్లు(Eyes), ఊపిరితిత్తులు, చర్మానికి సంబంధించిన సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. అలర్జీలు, దురదలు, ఇన్ఫెక్షన్ల(Infections) బారిన పడే అవకాశం ఉంది. నాఫ్తలీన్ కారణంగా మూత్రపిండాలు దెబ్బతినే అవకాశం ఉంది. నాఫ్తలీన్ అనే రసాయనం కారణంగా పొత్తి కడుపులో నొప్పి ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెప్పేమాట.

బెంజీన్ కారణంగా కడుపులో అల్సర్ వచ్చే అవకాశం ఉంది. దీనివలన ఆరోగ్యంగా ఉండే కణాలు క్యాన్సర్ కణాలు మారే ఛాన్స్ ఉంది. స్పాంజి పరుపుల ద్వారా వేడి ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఈ కారణంగా మన మీద చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. పరుపుల్లో ఉండే కుషనింగ్ కారణంగా వాటి మీద పడుకుంటే.. మన శరీర ఆకృతి మారుతుంది. దీనుల్ల డిస్క్ లపై ఒత్తిడి పడుతుంది. డిస్క్ లు పక్కకు జరగడం ఉంటుంది. డిస్క్ లు పక్కకు జరిగితే.. నరాలు, వెన్నుపాముపై ఒత్తిడి(Stress) పడుతుంది. దూదితో తయారు చేసే పరుపులకు ప్రాధాన్యత ఇవ్వండి.

అయితే నేలపై పడుకుంటే(Sleeping On Ground) చాలా మంచిది. మెుదట కాస్త ఇబ్బంది ఉన్నా.. అలవాటు అయితే.. మంచి నిద్ర వస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. నేలప నిద్రిస్తే.. ఒత్తిడి తగ్గుతుంది. మెంటల్ హెల్త్ కండీషన్ బాగుంటుంది. వెన్నునొప్పితో బాధపడే వాళ్లు.. నేలపై పడుకుంటే ఆరోగ్యం. శరీరాకృతి కూడా మెరుగవుతుంది.