Sunday Motivation : భయపడి కళ్లు మూసుకుంటే.. నీ గెలుపు దారి చూపేదెవరు?
Sunday Motivation Today : చాలామంది ఇది చేయాలి.. అది చేయాలి అనుకుంటారు. కానీ ఏం చేయకుండానే వయసు మీదకు వస్తూ ఉంటుంది. వెనక్కు తిరిగి చూసుకుంటే.. పెట్టుకున్న గోల్స్ గురించి ఆలోచనలు తప్ప.. మరేం మిగలదు. మీ గోల్ కోసం మీరు చేసిన ప్రయత్నం ఎంత? ఎప్పుడైనా ఆలోచించరా?
Sunday Motivation : 'కాలంతో పోటీ పడి పరిగెడుతున్నా.. అయినా ఆగిపోతున్నా. ఏం చేస్తున్నావ్ అని గడియారంలో తిరిగే ముల్లు సేకనుకోసరి ప్రశ్నిస్తున్నా.. కదిలే కాలంలో కదలని శిలనై ఒకే చోట నించొని ఉన్నా. అర్థమై.. కానట్టు వచ్చే ఆలోచనల్లో ఆవిరైపోతున్నా..' ఇలా సాగుతూ ఉంటాయి కొంతమంది ఆలోచనలు. కానీ కాలం గడుస్తూ ఉంటుంది. మీరు కావాలనుకునే పని చేయకపోతే.. మిగిలిన జీవితంలో గడియరంలో తిరిగే సెకను ముల్లు.. సెకనుకోసారి గుచ్చుతునే ఉంటుంది.
చిన్నదో.. పెద్దదో అనుకున్నది కావాలి.. గెలవాలి అనుకుంటే.. ప్రయత్నం చేయాల్సిందే. మీ గోల్ ఇతరులకు గొప్పది కాకపోవచ్చు.. కానీ మీ ప్రయత్నం మాత్రం గొప్పగా ఉండాలి. మీ ప్రయత్నమే గెలుపునకు మెుదటి అడుగు. నడిచే దారిలో ఎన్నో ముళ్లు గుచ్చుకుంటాయి. వాటినేమీ పట్టించుకోవద్దు. అదే ముళ్ల బాట.. నీ గెలుపును చూసి పూల బాటగా మారుతుంది. ఒక్కసారి నీ గెలుపు ప్రపంచానికి పరిచమైతే.. నీకు ముల్లు గుచ్చాలని చూసినవారే.. పూలు చల్లుతారు.
అవును.. జీవితంలో..
అవసరం కోసం ఆగిపోతుంటారు..
అవసరం లేని ఆలోచనలతో ఆగిపోతుంటారు...
అనవసరమైన పనులతో ఆగిపోతుంటారు..,
అనాలోచిత నిర్ణయాలతో ఆగిపోతుంటారు..,
ఆవేశంతో తప్పటడుగులు వేస్తూ ఆగిపోతుంటారు..,
ఆవిరి అయిపోతున్న కలలు అందుకోలేమోనని ఆగిపోతుంటారు...
కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే..
అవసరం తిరిపోయేది..
అవసరంలేని ఆలోచనలు ముగిసిపోయేవి..
అనవసరమైన పనులు నువ్వు మాత్రమే కట్టడి చేసేవి..
అనాలోచిత నిర్ణయాలు ఆలోచనాత్మక నిర్ణయాలకు నాంది పలికెవి..
ఆవేశంతో వేసే తప్పటడుగులు.. భవిష్యత్తులో నీకు దారి చూపేవి..
ఆవిరి అయిపోతూ అందుకోలేమోననుకునే కలలను మించిన గమ్యం నీది..
ఆగిపోవడం.. సాగిపోవడం.. కోసమే..
వాటిని అధిగమించి..ముందు నీ నుంచి నువ్వు బయటకు రావాలి.. అదే నీ మొదటి అడుగు..
అవసరం కోసం అమ్ముడుపోయే మనిషిని చూసి ఉంటావ్..
నీతో ఉంటూ వెన్నుపోటు పొడిచిన మోసాన్ని చూసి ఉంటావ్..
ఇంకా ఏముంది.. చూడాల్సింది నీ గెలుపు తప్ప..
భయపడి కళ్ళు, చెవులు మూసుకుంటే.. నీ గెలుపుకి దారి చూపేదెవరు? నీ గెలుపు చప్పుడు వినెదేవరు?
అందుకే ఏ విషయాన్నైనా ప్రయత్నించాలి. నా వాళ్ల కావట్లేదని.. అక్కడే ఆగిపోతే.. అక్కడే ఉండిపోతావ్. ప్రయత్నించు.. ఓడిపోతే మళ్లీ లేచి పరిగెత్తు. అంతేగానీ.. ఆలోచనలతో అక్కడే ఆగిపోతే.. నిన్నే నువ్ గెలుచుకోలేవ్.. ఇంకా ప్రపంచాన్ని ఏం గెలుస్తావ్. గెలుపును ఎంజాయ్ చేయాలంటే.. ప్రయత్నం గొప్పగా ఉండాలి.
సంబంధిత కథనం