తెలుగు న్యూస్  /  Lifestyle  /  Sex After Heavy Meal Is This Good Or Bad For Health

Sex After Heavy Meal : గట్టిగా తిన్నాక సెక్స్ చేయోచ్చా? చేస్తే ఏమవుతుంది?

HT Telugu Desk HT Telugu

06 March 2023, 20:45 IST

    • Sex After Heavy Meal : శృంగారం ఏ సమయంలో చేస్తే మంచిది.. కడుపు ఖాళీగా ఉన్నప్పుడు చేయాలా? కడుపు నిండిన తర్వాత చేయాలా? ఇలాంటి ఆలోచనలు వచ్చే ఉంటాయి. గట్టిగా తినేసిన తర్వాత శృంగారం చేయోచ్చా?
భోజనం తర్వాత సెక్స్
భోజనం తర్వాత సెక్స్

భోజనం తర్వాత సెక్స్

ఇండియాలో ఎక్కువ మంది.. రాత్రిపూట సెక్స్(Sex) చేస్తారు. రాత్రి గట్టిగా భోజనం(Meal) చేసిన తర్వాత.. ఇక మెుదలుపెడతారు. నిద్ర పోయేముందు తినేసి.. రొమాన్స్(Romance)లోకి దిగుతారు. భోజనం చేశాక.. శరీరానికి బాగా శక్తి వస్తుందని, అందుకే ఆ సమయంలో శృంగారం(Sex) చేస్తే.. రెచ్చిపోతారని కొంతమంది నమ్మకం. భోజనం జీర్ణమయ్యేందుకు కూడా సెక్స్ ఉపయోగపడుతుందని అనుకుంటారు. కానీ అలా చేస్తే.. మంచిది కాదని నిపుణులు చెప్పేమాట.

ట్రెండింగ్ వార్తలు

Empty Stomach: ఖాళీ పొట్టతో జ్యూసులు తాగకూడదట, ఎందుకో తెలుసుకోండి

Egg Chat: పిల్లలకు ఇలా ఎగ్ చాట్ చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు

Calcium: మీలో ఈ లక్షణాలు కనిపిస్తే ప్రతిరోజూ క్యాల్షియం సప్లిమెంట్లు తీసుకోవాలని అర్థం

Optical Illusion: ఇక్కడిచ్చిన ఆప్టికల్ ఇల్యుషన్లో 89 సంఖ్య మధ్య మరో అంకె దాక్కుని ఉంది, అది ఏదో 10 సెకన్లలో కనిపెట్టండి

భోజనం చేశాక.. సెక్స్(Sex) చేయకపోవడం మంచిదని నిపుణులు అంటున్నారు. ఎక్కువగా భోజనం చేశాక శృంగారం చేసేందుకు ఇష్టపడతారు. ఇక అన్ని పనులు అయిపోయాయి.. కాస్త మైండ్ రిలాక్స్ అవుతుంది. భాగస్వామితో ఎంజాయ్ చేయోచ్చు అని ఆలోచిస్తారు. కానీ గట్టిగా తిన్నాక.. శృంగారం చేస్తే.. నష్టమే ఎక్కువ.

భోజనం చేసిన తర్వాత సెక్స్ చేస్తే.. కడుపులో మంట ఏర్పడుతుంది. అది క్రమేనా అసిడిటీ(acidity)కి కారణమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే భోజనానికి సెక్స్ కు మధ్య కనీసం రెండు గంటల గ్యాప్ ఉంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. అర్ధరాత్రి వేళలో సెక్స్(midnight Sex) చేస్తే.. ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయట.

కొన్ని ఆహారాల్లో కార్పోహైడ్రేట్ల(carbohydrates) స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది. వాటితో కడుపులో గ్యాస్(Gas)లు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. భోజనం చేసిన తర్వాత.. శరీరం(Body) అత్యధిక రక్తా్న్ని జీర్ణాశయానికి పంపుతుంది. దీంతో ఆహారం బాగా జీర్ణమవుతుంది. తిన్న వెంటనే సెక్స్ లేదా వ్యాయామాలు చేస్తే.. వికారం ఏర్పడుతుంది.

మధ్యాహ్నం భోజనం తర్వాత కూడా సెక్స్ చేయోద్దు. అయితే మధ్యాహ్నం సమయంలో సెక్స్ లో పాల్గొంటే.. చాలా మంచిదని నిపుణులు చెప్పే మాట. మధ్యాహ్నం సమయంలో విడుదలయ్యే వీర్యం(Sperm) నాణ్యతగా ఉంటుందట. సంతానం కోసం ట్రై చేసేవారు.. ఈ సమయాన్ని ఎంచుకోవాలి. మీరు రెండు గంటలకు లంచ్ చేసే అలవాటు ఉంటే.. కాస్త ముందుగానే చేసేయండి. మధ్యాహ్నం సమయంలో సెక్స్ ఎంజాయ్ చేయండి. రాత్రి 8 నుంచి 10 మధ్యలో కూడా శృంగారం మంచిదని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే భోజనం టైమింగ్స్(Food Timings) మార్చుకుని.. ఇక ఎంజాయ్ చేయండి.

మరో విషయం ఏంటంటే.. శృంగారం తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల లోపు చేస్తే.. రసవత్తరంగా ఉంటుందట. ఎందుకంటే.. తెల్లవారుజామున పురుషాంగం.. సైతం సెక్స్ కు బాగా సహకరిస్తుందట. ప్రేరణ లేకుండానే.. పురుషాంగం గట్టిపడి పార్టనర్ హ్యాపీగా ఫీలవుతారట.