wake up at 3am : అర్ధరాత్రి 1 నుంచి 3 గంటల మధ్య నిద్ర లేస్తున్నారా? జాగ్రత్త
wake up at 1am and 3am : కొంతమంది త్వరగానే పడుకుంటారు. మరికొంతమంది లేటుగా నిద్రపోతారు. అయితే ఎవరు ఎలా పడుకున్నా.. కొంతమందికి అర్ధరాత్రి నిద్రలేచే అలవాటు ఉంటుంది. దీనితో ఆరోగ్య సమస్యలు ఉన్నాయి.
అర్ధరాత్రి నిద్రలేవడానికి చాలా కారణాలు ఉంటాయి. కొంతమంది మూత్ర విసర్జన కోసం లేస్తారు. మరికొందరు దాహంతో లేస్తారు. ఇంకొందరు నిద్రిచే భంగిమ సరిగా లేక ఒత్తిడితో నిద్రలోనుంచి లేస్తారు. కారణం ఏదైనా.. అర్ధరాత్రి 1 నుంచి 3 గంటల మధ్య నిద్ర లేవడం ఎప్పుడో ఒకసారి అయితే ఏం కాదట. ప్రతిరోజూ ఇలా జరిగితే మాత్రం ఆలోచించాల్సిందే. ఏదైనా అనారోగ్య సమస్య(Health Problems) ఉంటేనే ఇలా జరుగుతుందని.. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. ఏదో ఒక అనారోగ్య సమస్య ఉంటేనే ఆ సమయంలో నిద్ర లేస్తారట.
ట్రెండింగ్ వార్తలు
రాత్రి 1 నుంచి 3 గంటల మధ్య అందరూ గాఢ నిద్రలో ఉంటారు. ఈ సమయంలో నిద్ర లేస్తే.. శరీరం(Body)పై ఒత్తిడి పడుతుంది. ఏదో ఒకరోజు అలా జరిగితే ఏం కాదు. కానీ అదే అలవాటుగా అయితే మాత్రం సమస్యే. జాగ్రత్తలు తీసుకోవాలి. ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉంటే.. ఇలా రోజూ రాత్రి సమయంలో నిద్ర లేస్తారు. అంతేకాదు. మెడిసిన్(Medicine) వాడే వారు, షుగర్, బీపీ, గుండె జబ్బులు ఉండేవాళ్లు ఇలా అర్ధరాత్రి నిద్ర లేస్తారు. వయసు మీద పడటం, నిద్రలేమి, పలు రకాల మందులను దీర్ఘకాలంగా ఉపయోగించడంలాంటి కారణాలు కూడా రాత్రి 1 నుంచి మూడు మధ్యలో నిద్రలేవడానికి కారణాలు.
యాంటి డిప్రెసెంట్లు, బీటా బ్లాకర్స్, కార్టికో స్టెరాయిడ్స్, దగ్గు, జులుబు మందులను వాడటం, డై యూరెటిక్స్ వాడకం వలన రాత్రి 1 నుంచి 3 గంటల మధ్య నిద్ర లేస్తారు(wake up between 1 am to 3 am). మందులను వాడకం తప్పించి.. ఏ కారణంతో అయినా.. నిద్ర లేస్తుంటే.. మాత్రం ఆ సమస్య నుంచి బయట పడేందుకు ప్రయత్నాలు చేయాలి. లేదంటే ఇతర సమస్యలు వస్తాయి. లివర్ పనితీరు మందగించడం, నిద్రలేమీతో కూడా ఇలా అవుతుంది.
ప్రపంచవ్యాప్తంగా జనాభాలో 10-20 శాతం మందికి నిద్రలేమి ఉందని, పెద్దవారిలో ఈ రేటు 40 శాతానికి పెరిగిందని తెలుస్తోంది. మీరు ప్రతి రాత్రి మేల్కొనడానికి కొన్ని ఇతర కారణాలు.. స్లీప్ అప్నియా, గ్యాస్ట్రిక్ సమస్యలు, ఆర్థరైటిస్, డిప్రెషన్, నరాలవ్యాధి, మెనోపాజ్, అతి చురుకైన థైరాయిడ్ గ్రంధి కూడా కావొచ్చు.
సంబంధిత కథనం