Drinking Water : ఉదయం నిద్రలేచిన వెంటనే నీళ్లు తాగండి.. ఎన్నో ప్రయోజనాలు-here are benefits of drinking water with empty stomach in the morning ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Drinking Water : ఉదయం నిద్రలేచిన వెంటనే నీళ్లు తాగండి.. ఎన్నో ప్రయోజనాలు

Drinking Water : ఉదయం నిద్రలేచిన వెంటనే నీళ్లు తాగండి.. ఎన్నో ప్రయోజనాలు

HT Telugu Desk HT Telugu
Feb 27, 2023 03:00 PM IST

Drinking Water in the Morning : ఉదయం నిద్రలేచిన వెంటనే కాఫీ, టీ తాగే అలవాటు ఉందా? అయితే ఆ అలవాటు కంటే.. మరో మంచి అలవాటు చేసుకోండి. నిద్ర లేచిన వెంటనే ఒక గ్లాసు నీళ్లు తాగండి.

ఉదయం లేచాక నీళ్లు తాగండి
ఉదయం లేచాక నీళ్లు తాగండి (Shutterstock)

ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక గ్లాసు నీళ్లు(Glass Water) తాగడం అలవాటు చేసుకోండి. నీరు మన శరీరానికి(Body) చాలా ముఖ్యమైనది. శరీరంలో దీని లోపం వల్ల అనేక వ్యాధులు మనల్ని చుట్టుముడుతున్నాయి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం నీళ్లు తాగాలని వైద్యుల సూచిస్తున్నారు.

ఉదయం లేచిన వెంటనే నీరు తాగితే.. ఇది రోజంతా హైడ్రేటెడ్‌గా ఉండటానికి సహాయపడుతుంది. నీరు తక్కువగా తీసుకుంటే.. తలనొప్పి, మలబద్ధకం, చర్మం(Skin) పొడిబారడం, కీళ్ల నొప్పులు, అజీర్ణం, తక్కువ రక్తపోటు, ఊబకాయం, బ్రెస్ట్ క్యాన్సర్(Breast Cancer) వంటి వ్యాధులు వస్తాయి.

ఖాళీ కడుపుతో 2 కప్పుల నీళ్లు తాగడం వల్ల చర్మం మెరుస్తూ, అకాల ముడతలు రాకుండా చేస్తుంది. ఉదయాన్నే నీరు తాగడం(Drinking Water) వల్ల మన ముఖ్యమైన అవయవాలను రక్షిస్తుంది. హైడ్రేట్ చేస్తుంది. వాటిని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఖాళీ కడుపుతో 2-3 గ్లాసుల నీరు తాగడం వల్ల బరువు తగ్గవచ్చు. నీరు తాగితే.. శరీరాన్ని అనేక వ్యాధుల నుండి కాపాడుకోవచ్చు.

ఖాళీ కడుపుతో నీరు తాగడం వల్ల శరీరంలోని అన్ని విషపదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. శరీరంలోని అన్ని వ్యర్థాలను తొలగించే ఏకైక సాధనం నీరు. వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. ప్రతి రోజు ప్రారంభంలో మన జీవక్రియను పెంచుతుంది. రాత్రిపూట మన శరీరం కణాలను రిపేర్ చేయడానికి, శుభ్రం చేసుకోవడానికి పని చేస్తుంది. ఖాళీ కడుపుతో ఒక గ్లాసు(Empty Stomach Water) నీరు తాగటం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ఎందుకంటే ఇది శరీరంలోని అన్ని విష పదార్థాలను తొలగిస్తుంది. మద్యం, పొగాకు ఎక్కువగా తీసుకునే వ్యక్తులు ఉదయం ఖాళీ కడుపుతో గరిష్టంగా నీరు తాగాలి. ఇది శరీరంపై పొగాకు, ఆల్కహాల్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం వల్ల చర్మం మెరుస్తుంది. అలాగే ముడతలను నివారిస్తుంది.

Whats_app_banner

సంబంధిత కథనం