Sedentary lifestyle: వర్క్ ఫ్రమ్ హోమ్‌తో ఈ వ్యాధులు.. వైద్యులు చెబుతోందిదే..
Sedentary lifestyle: అసలే శారీరక శ్రమ లేని ఉద్యోగాలు. దీనికి తోడు వర్క్ ఫ్రమ్ హోమ్.. వీటన్నింటికి అదనంగా విచ్చలవిడి తిండి అలవాట్లు.. మానసిక ఆరోగ్యాన్ని పాడు చేసే ఉద్యోగ ఒత్తిడి.. ఇలాంటి పరిస్థితి కొన్ని వ్యాధుల పెరుగుదలకు కారణమవుతోందని అంటున్నారు వైద్య నిపుణులు.
కోవిడ్ మహమ్మారితో అలవాటైన వర్క్ ఫ్రమ్ హోమ్ సౌలభ్యం నుంచి ఇంకా చాలా మంది బయటపడలేకపోతున్నారు. ఏ సర్వే చూసినా ఇప్పటికీ మెజారిటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం కోరుకుంటున్నారు. అయితే ఇందులో సౌకర్యం చాలా ఉన్నప్పటికీ పలు ప్రతికూల ప్రభావాలు కూడా పడుతున్నాయి.
ట్రెండింగ్ వార్తలు
ఆరోగ్యకరమైన వర్క్-లైఫ్ బ్యాలెన్స్ కోసం కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్శిటీ సీనియర్ ఫ్యాకల్టీ డాక్టర్ కౌసర్ ఉస్మాన్ పలు సూచనలు చేస్తున్నారు. ‘కోవిడ్ ఆంక్షలు తొలగించిన తరువాత కూడా చాలా కంపెనీలు ముఖ్యంగా ఐటీ రంగంలోని పలు కంపెనీలు ఇప్పటికీ వర్క్ ఫ్రమ్ హోమ్ (డబ్ల్యూఎఫ్‌హెచ్) పాలసీ అమలు చేస్తున్నాయి. బహుశా ఇది 30 నుంచి 40 ఏళ్ మధ్య వయస్సు గల వారిలో డయాబెటిస్ కేసుల పెరుగుదలకు కారణమై ఉండవచ్చు. అందువల్ల వర్కింగ్ ప్రొఫెషనల్స్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి..’ అని డాక్టర్ ఉస్మాన్ సూచించారు.
సెడెంటరీ (శారీరక కదలికలు లేకపోవడం, ఒకేచోట కదలకుండా కూర్చోవడం) లైఫ్ తో పాటు ఆహార అలవాట్లలో క్రమశిక్షణ లేకపోవడం, అలాగే పని ఒత్తిళ్ల కారణంగా యువత సమస్యలు ఎదుర్కొంటోంది. అటు ఉద్యోగ ఒత్తిళ్లు, ఇటు వ్యక్తిగత సమస్యలు తోడవుతున్నాయి. ‘డయాబెటిస్‌క ప్రధాన కారణంగా మారుతున్న ఒబేసిటీ యువ ప్రొఫెషనల్స్‌లో బాగా పెరుగుతోంది. వాళ్లు చాలా గంటలు కూర్చొని పనిచేస్తుంటారు. పనిచేస్తున్నప్పుడు కూడా ఫాస్ట్ ఫుడ్ లాగించేస్తున్నారు..’ ఇంటర్నేషనల్ డాక్టర్స్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్ డాక్టర్ అభిషేక్ శుక్లా ఆందోళన వ్యక్తంచేశారు.
వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చెత్త ఐడియా కాకపోయినప్పటికీ, కొన్ని తప్పనిసరి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వర్క్ లైఫ్ బాలెన్స్ కోసం ఈ చర్యలు తప్పవు. పనికి, భోజనానికి తప్పనిసరిగా షెడ్యూలు ఉండాలని డాక్టర్ ఉస్మాన్ సూచిస్తున్నారు.
కేజీఎంయూలోని ఫిజియాలజీ డిపార్ట్‌మెంట్ హెడ్ డాక్టర్ ఎన్.ఎస్.వర్మ దీనిపై మాట్లాడుతూ ‘త్వరగా డిన్నర్ (రాత్రి భోజనం) ముగించడం, త్వరగా నిద్రకు ఉపక్రమించడం చాలా మేలు చేస్తుంది. భోజనంలో సలాడ్, సూప్, పప్పు ధాన్యాలు, పెరుగు కూడా ఉండేలా చూసుకోవాలి. ఇవి శారీరక ఆరోగ్యానికి మేలు చేస్తుంది..’ అని వివరించారు.
వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తున్న ప్రొఫెషనల్స్ తప్పనిసరిగా విటమిన్ డీ, విటమిన్ బీ12 వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎండ తగలకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం కారణంగా విటమిన్ డీ లోపం, అలాగే కండరాల పటుత్వం దెబ్బతింటుందని చెబుతున్నారు.
కనీసం 40 నిమిషాల పాటు నడక, తేలికపాటి వ్యాయామాలతో మధుమేహం తదితర జీవన శైలి వ్యాధులకు దూరంగా ఉండొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
సంబంధిత కథనం
మహిళలు ఆరోగ్యకరమైన జీవనశైలితో డయాబెటిస్ ప్రమాదం తగ్గించుకోవచ్చట
September 28 2022
డయాబెటిస్ ఉన్నవారు ఈ పండ్లు తింటే చాలా మంచిది
May 27 2022
Diabetes deaths | డయాబెటిస్తో లక్ష మరణాలు.. వరుసగా రెండో ఏడాది
January 31 2022