5 foods causes inflammation: వింటర్‌లో ఈ 5 రకాల ఫుడ్‌తో మీ శరీరంలో జరిగేదిదే-here are 5 foods to avoid in winter season that causes inflammation ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  5 Foods Causes Inflammation: వింటర్‌లో ఈ 5 రకాల ఫుడ్‌తో మీ శరీరంలో జరిగేదిదే

5 foods causes inflammation: వింటర్‌లో ఈ 5 రకాల ఫుడ్‌తో మీ శరీరంలో జరిగేదిదే

HT Telugu Desk HT Telugu
Jan 20, 2023 06:10 PM IST

5 foods causes inflammation: ఇన్‌ఫ్లమేషన్ అంటే వివిధ గాయాలు, ఇన్ఫెక్షన్లు ఎదుర్కొంటున్నప్పుడు శరీరం కోలుకునే ప్రక్రియలో మంట, వాపు ఏర్పడడం.

వింటర్‌లో 5 రకాల ఫుడ్స్ జోలికి వెళ్లొద్దంటున్న ఆరోగ్య నిపుణులు
వింటర్‌లో 5 రకాల ఫుడ్స్ జోలికి వెళ్లొద్దంటున్న ఆరోగ్య నిపుణులు (Pixabay)

శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ (మంట, వాపు) తీవ్రంగా వేధిస్తుంది. అసౌకర్యాన్ని కలిగిస్తుంది. వింటర్‌ సీజన్ అయితే మరీ ఎక్కువగా ఉంటుంది. ఇన్‌ఫ్లమేషన్ రాకుండా ఉండేందుకు ఈ 5 ఫుడ్స్ జోలికి వెళ్లొద్దు.

వింటర్ సీజన్ అంటే చాలా మందికి ఇష్టం. కానీ అనేక సవాళ్లు కూడా ఉంటాయి. ముఖ్యంగా వృద్ధులకు, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వారికి అనారోగ్య సమస్యలు వెన్నాడుతుంటాయి.

తీవ్రమైన చల్లగాలులు జలుబు, దగ్గు, తీవ్రమైన ఇన్‌ఫ్లమేషన్‌కు కారణమవుతాయి. ఆరోగ్యకరమైన డైట్ ఎలా అయితే మన రోగ నిరోధక శక్తిని పెంచుతుందో, ఇన్‌ఫ్లమేషన్‌ను నివారిస్తుందో.. అలాగే ఇన్‌ఫ్లమేషన్ పెంచే ఫుడ్ కూడా ఉంటుంది. అలాంటి 5 రకాల ఫుడ్స్ జోలికి వెళ్లకపోవడం వల్ల ఇన్‌ఫ్లమేషన్ తగ్గించుకోవచ్చు.

అసలు ఇన్‌ఫ్లమేషన్ అంటే ఏమిటి?

శరీరంలో గాయం లేదా ఇన్ఫెక్షన్, వ్యాధి సంభవించినప్పుడు శరీరం స్పందించే సహజమైన ప్రక్రియనే ఇన్‌ఫ్లమేషన్ అంటారు. అది వాపు రూపంలో ఉండొచ్చు. మంట రూపంలో రావొచ్చు. ఒక సంక్లిష్ట ప్రక్రియ. దెబ్బతిన్న ప్రాంతంలో విభిన్న కెమికల్స్, ఇమ్యూన్ సెల్స్ విడుదలవుతుంటాయి. దెబ్బతిన్న ప్రాంతం ఎరుపెక్కడం, వేడెక్కడం, వాపు రావడం, నొప్పి రావడం వంటి లక్షణాలు ఈ ఇన్‌ఫ్లమేషన్‌లో కనిపిస్తాయని హెచ్.ఎన్. రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ వైద్య నిపుణులు డాక్టర్ ఐలీన్ క్యాండే చెప్పారు. గాయం నయమయ్యే ప్రక్రియలో ఇది సహజమైన భాగమని వివరించారు. అయితే తీవ్రమైన, దీర్ఘకాలికమైన ఇన్‌ఫ్లమేషన్ చేటు చేస్తుంది. డయాబెటిస్, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వాటికి దారితీస్తుందని డాక్టర్ క్యాండే చెప్పారు.

వింటర్ సీజన్‌ చల్లని వాతావరణం శ్వాసకోశ వ్యాధుల ముప్పును పెంచుతుందని, ఫ్లూ, జలుబు వంటివి కూడా శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌కు కారణమవుతాయని వివరించారు. ఈ సమయంలో ప్రజలు ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్, పకోడా వంటి ఫ్రైడ్ ఫుడ్ తినేందుకు మొగ్గు చూపుతారు. ఇది మరింత ఇన్‌ఫ్లమేషన్‌కు దారితీస్తుంది. ‘కదలిక లేని జీవన శైలి వింటర్ సీజన్‌లో సర్వసాధారణం. దీని వల్ల బరువు పెరుగుతుంది. అంతిమంగా అది ఇన్‌ఫ్లమేషన్‌కు కారణమవుతుంది..’ అని డాక్టర్ వివరించారు. అందువల్ల 5 రకాల ఫుడ్స్ జోలికి వెళ్లొద్దని డాక్టర్ సలహా ఇచ్చారు. అవేంటో ఇక్కడ చూడండి.

ప్రాసెస్డ్ ఫుడ్స్

ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే మార్కెట్లో దొరికే ప్యాకేజ్డ్ ప్రోడక్ట్స్. ఇవి ఎక్కువ నిల్వ ఉండేందుకు వీటిలో అనేక ప్రిజర్వేటివ్స్ కలుపుతారు. చిప్స్, కుకీస్, ఇన్‌స్టంట్ నూడుల్స్ వంటివి ప్రాసెస్డ్ ఫుడ్స్ కిందికి వస్తాయి. వీటిలో షుగరర్స్, కృత్రిమ రంగులు, రసాయనాలు ఉంటాయి. వీటి వల్ల మీరు బరువు పెరుగుతారు. చివరకు ఇన్‌ఫ్లమేషన్‌కు గురవుతారు.

2. ఫైడ్ ఫుడ్స్ (వేపుళ్లు)

పొటాటో చిప్స్, బజ్జీలు, సమోసాలు, కచోడీలు అత్యధికంగా ట్రాన్స్ ఫ్యాట్స్, అధిక క్యాలరీలు కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ పెంచుతాయి. ఫ్రైడ్ ఫుడ్స్ కొలెస్టరాల్ పెంచడమే కాకుండా, గుండె ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. బరువు పెరిగేలా చేస్తాయి.

3. పాల ఉత్పత్తులు

లాక్టోజ్ ఉండే పాల ఉత్పత్తులు లాక్జోట్ ఇంటాలరెంట్ వ్యక్తులకు చేటు కలిగిస్తాయి. అవి ఇన్‌ఫ్లమేషన్ పెంచేందుకు కారణమవుతాయి. లాక్టోజ్ ఇన్‌టాలరెన్స్ అంటే.. లాక్టోజ్ అరిగించుకోలేకపోవడం. ఆయా వ్యక్తులు తప్పనిసరిగా పాల ఉత్పత్తులను అవాయిడ్ చేయాలి.

4. రీఫైన్డ్ కార్బొహైడ్రేట్లు

వైట్ బ్రెడ్, పాస్తా, పేస్ట్రీస్ వంటివన్నీ రీఫైన్డ్ కార్బొహైడ్రేట్స్ కిందికి వస్తాయి. ఇవి మన శరీరానికి చాలా చేటు చేస్తాయి. ఇన్‌ఫ్లమేషన్ రాకుండా ఉండాలంటే వీటికి దూరంగా ఉండాలి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే వీటిని త్యాగం చేయాలి.

5. మద్యపానం

మితిమీరిన మద్యపానం శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ పెంచుతుంది. ఇమ్యూన్ సిస్టమ్‌ను దెబ్బతీస్తుంది. వింటర్ సీజన్‌లో తరచూ జబ్బు పడేందుకు కారణమవుతుంది.

అందువల్ల మీరు ఈ ఐదు రకాల ఫుడ్స్ జోలికి వెళ్లకుండా ఉంటే ఇన్‌ఫ్లమేషన్ బారిన పడరని డాక్టర్ సూచించారు.