Pregnant Tips : శృంగారం తర్వాత.. మంచం దిగితే ప్రెగ్నెన్సీ కాదా?
Pregnant Tips : పిల్లలు కాకపోవడం అనేది ఈ రోజుల్లో పెద్ద సమస్యగా మారింది. అయితే త్వరగా ప్రెగ్నెంట్ అయ్యేందుకు కొన్ని చిన్న విషయాలు కూడా ముఖ్యమేనని నిపుణులు చెబుతున్నారు.
పిల్లలు కలగట్లేదని.. ఈ మధ్యకాలంలో చాలామంది ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే కొన్ని విషయాలను పరిశీలిస్తే.. ప్రెగ్నెన్సీ(pregnancy) త్వరగా వచ్చేందుకు ఆస్కారం ఉంటుందని నిపుణులు అనే మాట. త్వరగా ప్రెగ్నెంట్ అయ్యెందుకు పాటించాల్సిన మొదటి నియమం ఎవరి శరీరం గురించి వాళ్లు కచ్చితంగా కేర్ తీసుకోవాలి. కొన్ని టిప్స్ పాటిస్తే త్వరగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి.
ప్రెగ్నెన్సీ కోసం ఎదురుచూసే వాళ్లు ఈ కాలంలో చాలా మంది ఉన్నారు. ఎంత ప్రయత్నం చేసినా.. కావట్లేదని బాధపడుతుంటారు. ఒక్కసారి మీ శరీరానికి సంబంధించి.. మీ డాక్టర్ నుండి ముందస్తు నిర్ధారణ చెకప్ చేయించుకోండి. కొన్ని పుట్టుకతో వచ్చే లోపాల నుండి రక్షించడంలో సహాయపడే ఫోలిక్ యాసిడ్ కలిగి ఉన్న కొన్ని ప్రినేటల్ విటమిన్ల కోసం మీ వైద్యుడిని అడగండి.
మీరు గర్భవతి(pregnant) కావడానికి ముందు. మీ ఋతుచక్రం గురించి తెలుసుకోండి. ఆ విషయాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మీరు గర్భం దాల్చేందుకు ఆ సమయమే ఇంపార్టెంట్.
శృంగారంలో పాల్గొనడం కూడా ఏదో జరిగిపోయిందంటే.. జరిగిపోయిందనేలా కాకుండా.. ప్రశాంతంగా జరగాలి. మీరు గర్భవతి అయ్యే అవకాశాలను పెంచడానికి చాలు ప్రశాంతమైన శృంగారంలో పాల్గొనడం చాలా ముఖ్యం.
ఇది కాస్త విచిత్రంగా అనిపించవచ్చు. కానీ గర్భం దాల్చే అవకాశాలను పెంచడానికి సంభోగం తర్వాత మంచంపైనే ఉండండి. సంభోగం తర్వాత బాత్రూమ్‌కు వెళ్లడం మానుకోండి. వెంటనే బాత్రూమ్ లోకి వెళితే.. గర్భాశయంలోకి వెళ్లే స్పెర్మ్ వెళ్లేందుకు ఆస్కారం తక్కువ. పూర్తిగా లోపలికి వెళ్లకుండా ఆగిపోవచ్చు.
తల్లి కావాలనుకునే స్త్రీ తన పిరియడ్స్(Periods) సైకిల్ ను పరిశీలించుకోవాలి. సేమ్ డేట్స్ లో వస్తుంటే ఆ సైకిల్ ని రెగ్యులర్ సైకిల్ అంటారు. అలా కాకుండా చాలా తేడా ఉంటే అది ఇరెగ్యులర్ సైకిల్ అంటారు. దానికి అనుగుణంగా మీ కలయిక ఉండాలి.
ప్రెగ్నెన్సీ కోసం ప్రత్యేకించి ఫుడ్ ఏమీ ఉండదు. కానీ హెల్తీ ఫుడ్(Healthy Food) తీసుకుంటే మంచిది. మీ శరీరానికి కావల్సిన అన్ని న్యూట్రియెంట్లూ అందుతాయి. కాల్షియం, ప్రొటీన్స్, ఐరన్ కావాల్సినంతగా శరీరానికి అందినప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
సిగరేట్(Cigarette), మద్యపానం భార్యా భర్తలిద్దరూ చేయకపోవడం చాలా ఉత్తమం. ఇద్దరిలో ఎవరికి ఈ అలవాటు ఉన్నా పిల్లలు పుట్టే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఈ రోజుల్లో ఈ అలవాట్లు ఉంటే కష్టమే. ప్రెగ్నెన్సీ అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి. సో.. ఇలాంటి వాటికి దూరంగా ఉండటం బెటర్.