తెలుగు న్యూస్ / ఫోటో /
Naomi Osaka Pregnant: పెళ్లికి ముందే గర్భవతి అయిన టెన్నిస్ స్టార్.. అమెరికన్ ర్యాపర్‌తో ఎఫైర్
- Naomi Osaka Pregnant: ప్రముఖ జపాన్ టెన్నిస్ స్టార్ నోవామి ఓసాకా తల్లి కాబోతుంది. 25 ఏళ్ల ఈ టెన్నిస్ క్రీడాకారిణి పెళ్లి కాకుండానే గర్భవతి కాబోతుంది. ఈ కారణంగా ఆమె ఆస్ట్రేలియన్ 2023కి దూరమైంది. ఫలితంగా ఈ ఏడాది జరగనున్న ఎలాంటి టెన్నిస్ టోర్నీలను ఆడట్లేదని ప్రకటించింది. 2024లో మళ్లీ టెన్నిస్ కోర్టులో అడుగుపెడతానని స్పష్టం చేసింది.
- Naomi Osaka Pregnant: ప్రముఖ జపాన్ టెన్నిస్ స్టార్ నోవామి ఓసాకా తల్లి కాబోతుంది. 25 ఏళ్ల ఈ టెన్నిస్ క్రీడాకారిణి పెళ్లి కాకుండానే గర్భవతి కాబోతుంది. ఈ కారణంగా ఆమె ఆస్ట్రేలియన్ 2023కి దూరమైంది. ఫలితంగా ఈ ఏడాది జరగనున్న ఎలాంటి టెన్నిస్ టోర్నీలను ఆడట్లేదని ప్రకటించింది. 2024లో మళ్లీ టెన్నిస్ కోర్టులో అడుగుపెడతానని స్పష్టం చేసింది.
(1 / 10)
25 ఏళ్ల నవోమి చాలా కాలంగా టెన్నిస్‌కు దూరంగా ఉంది. దీంతో ఆమె రిటైర్మెంట్ తీసుకోబోతుందా? అంటూ అభిమానులు ఆందోళన చెందారు. కానీ తాజా ప్రకటనత ఆ ఊహాగానాలకు చెక్ పడింది.
(2 / 10)
కెరీర్‌లో ఇప్పటి వరకు నాలుగు సార్లు గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన నవోమి కొన్నిసార్లు గాయాల కారణం, మరికొన్ని మానసిక ఆరోగ్యం కారణంగా టెన్నిస్‌కు దూరమైంది. తాజాగా గర్భవతి కావడంతో మరికొంతకాలం దూరం కానుంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటే ఆమెకు ఇంకా వివాహం జరగలేదు.
(3 / 10)
తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా గర్భం దాల్చిన విషయాన్ని తెలియజేసింది నవోమి. ఆమె సోనోగ్రఫీ ఫొటోలను షేర్ చేయడం ద్వారా తాను గర్భవతి అని ప్రకటించింది.
(4 / 10)
జపాన్ సంచలన నవోమీ ఒసాకాకు ఇంకా పెళ్లి కాలేదు. ఇన్‌స్టాలో పాప తండ్రి గురించి కూడా ప్రస్తావించలేదు. అయితే అమెరికన్ ర్యాపర్ కొరేడేతో ఆమె చాలా కాలంగా డేటింగ్ చేస్తోంది.
(6 / 10)
2023వ సంవత్సరం తాను నేర్చుకోబోయే సంవత్సరం కానుందని, 2024 ఆస్ట్రేలియా ఓపెన్‌తో తిరిగి వస్తానని ప్రకటించింది.
(7 / 10)
ఒసాకా రెండు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లతో పాటు మరో 2 యూఎస్ ఓపెన్ టైటిళ్లను గెలుచుకుంది. ఒసాకా ప్రపంచంలోని అగ్రశ్రేణి క్రీడాకారిణులలో ఒకరు మరియు అత్యంత ధనిక మహిళా క్రీడాకారిణులలో ఒకరు. అయితే, ఒసాకా 2018లో వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే ఆమె US ఓపెన్ 2018లో సెరెనా విలియమ్స్‌ను ఓడించింది. ఇది ఆమెకు మొదటి గ్రాండ్‌స్లామ్.
(8 / 10)
2021లో మానసిక అనారోగ్యం కారణంగా ఫ్రెంచ్ ఓపెన్ నుంచి వైదొలిగిన తర్వాత వింబుల్డన్‌లోనూ ఆడలేకపోయింది ఒకప్పుడు నెంబర్ వన్ స్థానంలో ఉన్న నవోమీ.. గతేడాది అగ్ర ర్యాంకింగ్స్‌కు కూడా చేరలేకపోయింది. ఆమె 47వ స్థానానికి పడిపోయింది. సెప్టెంబరు నుంచి ఆమె ఏ టోర్నీ ఆడలేదు.
ఇతర గ్యాలరీలు