Telugu News  /  Andhra Pradesh  /  Indian Raliways Introduced Whatsapp Chatbot And E Catering Services On Selected Trains
ఇక వాట్సాప్‌తో రైళ్లలో ఫుడ్ డెలివరీ
ఇక వాట్సాప్‌తో రైళ్లలో ఫుడ్ డెలివరీ

IRCTC Food Delivery : వాట్సాప్‌ చాట్‌తో రైళ్లలో ఫుడ్ డెలివరీ….

07 February 2023, 6:40 ISTHT Telugu Desk
07 February 2023, 6:40 IST

IRCTC Food Delivery వాట్సాప్ ద్వారా రైళ్లలో ఆహార పదార్ధాలను డెలివరీ చేసే కొత్త సేవలను భారతీయ రైల్వే ప్రారంభించింది. రైల్లో ప్రయాణిస్తూనే చాట్‌బోట్ ద్వారా నచ్చిన ఆహారాన్ని ఆర్డర్ చేసుకునే వీలు కల్పిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్ చాట్‌బాట్ ద్వారా ప్రయాణికులు అన్ని రకాల “ఈ కేటరింగ్” సేవలను ఉపయోగించుకోవడంతో పాటు భోజనాన్ని కూడా ఆర్డర్ చేయొచ్చు .

IRCTC Food Delivery వాట్సాప్ ద్వారా ఆహార పదార్థాలను ఆర్డర్ చేసే కొత్త సేవల్ని భారతీయ రైల్వే ప్రారంభించింది. క్యాటరింగ్ సేవల ద్వారా రైలు ప్రయాణికులు వాట్సాప్ నుంచి తమకు కావాల్సిన ఆహార పదార్థాలను ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ సౌకర్యాన్ని ప్రారంభించిన ఇండియన్ రైల్వేస్, పి ఎస్ యూ , ఐ ఆర్ సి టి సి సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

వినియోగదారులకు పరస్పర సంభాషణ కోసం వాట్సాప్ నంబర్ +91-8750001323ను అందుబాటులోకి తీసుకు వచ్చాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్ చాట్‌బాట్ ద్వారా ప్రయాణికులు అన్ని రకాల ఈ కేటరింగ్ సేవలను ఉపయోగించుకోవడంతో పాటు భోజనాన్ని ఆర్డర్ చేయొచ్చు .

ఎంపిక చేసిన రైళ్లలో ప్రయాణికులకు వాట్సాప్ నుండి ఈ కేటరింగ్ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. వినియోగదారుల అభిప్రాయాలను సేకరించి వారి సూచనల ఆధారంగా ఇతర రైళ్లలో కుడా దశల వారీగా అమలుకు ప్రయత్నిస్తున్నారు.

భారతీయ రైల్వేలతో పాటు, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్. .ఐ ఆర్ సి టి సి ప్రత్యేకంగా రూపొందించిన చేసిన వెబ్‌సైట్ www.catering.irctc.co.in  ద్వారా ఫుడ్ ఆన్ ట్రాక్ కోసం “ఈ -కేటరింగ్ యాప్” సేవలను ప్రారంభించింది.

వినియోగదారులకు ఈ -కేటరింగ్ సేవలను మరింత విస్తరించడమే లక్ష్యంగా ఒక అడుగు ముందుకు వేసి, ఈ -కేటరింగ్ విధానం ద్వారా ఆహారాన్ని ఆర్డర్ చేయడానికి వాట్సాప్ సేవలను కూడా ప్రారంభించారు. ఈ సేవల కోసం వాట్సాప్ నంబర్ +91-8750001323 అందుబాటులోకి తీసుకువచ్చారు.

వాట్సాప్ సంభాషణ ద్వారా ఈ కేటరింగ్ సేవలను రెండు దశల్లో అమలుపర్చడానికి ప్రణాళికలు రూపొందించారు . మొదటి దశలో www.ecatering.irctc.co.in లింక్‌ను క్లిక్ చేస్తే ల వాట్సప్ నుండి ఈ -కేటరింగ్ సేవలను ఎంచుకోవడానికి వీలవుతుంది. వినియోగదారులు ఇ-టికెట్‌కు ఓ సందేశాన్ని పంపుతుంది. దీని ద్వారా వినియోగదారులు యాప్‌ను డౌన్‌లోడ్ చేయాల్సిన అవసరం లేకుండా నేరుగా ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్ ద్వారా స్టేషన్లలో అందుబాటులో ఉన్న తమకు నచ్చిన రెస్టారెంట్ల నుండి తమకు నచ్చిన భోజనాన్ని బుక్ చేసుకోవచ్చు.

తదుపరి దశ సేవలలో, వాట్సాప్ నంబర్ ద్వారా AI పవర్ చాట్‌ నుండి వినియోగదారులకు ఈ కేటరింగ్ ద్వారా ఆహారాన్ని ఆర్డర్ చేసేందుకు మరియు అన్ని రకాల కేటరింగ్ సేవలకు సంబందించిన సందేహాలను నివృత్తి కోసం చాట్ చేసేందుకు వీలు కల్పిస్తుంది .

ఈ తరహా సేవలు మొదటగా ఎంపిక చేసిన రైళ్లలో అమలు చేయనున్నారు. ప్రయాణికులకు ఈ -కేటరింగ్ సేవల కోసం వాట్సాప్ సంభాషణ అమలు చేస్తున్నారు . ప్రయాణికుల నుండి సేవలకు సంబందించి అభిప్రాయాలు మరియు సూచనల ఆధారంగా ఇతర రైళ్లలో కూడా ఈ సేవలను ప్రారంభించాలని భావిస్తున్నారు. ఐ ఆర్ సి టి సి వెబ్‌సైట్, యాప్ ద్వారా ప్రారంబించిన రోజే “ఈ -కేటరింగ్” సేవల ద్వారా వినియోగదారులకు సుమారు 50000 భోజనాలను అందించారు.

టాపిక్