తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sleeping And Selfish : మీరు నిద్రపోవట్లేదా? అయితే స్వార్థపరులవుతారు

Sleeping and Selfish : మీరు నిద్రపోవట్లేదా? అయితే స్వార్థపరులవుతారు

HT Telugu Desk HT Telugu

31 March 2023, 20:00 IST

  • Sleeping and Selfish : మనిషి ఆరోగ్యానికి నిద్ర చాలా ముఖ్యం. మానసిక, శారీరక శ్రేయస్సు కోసం నిద్ర అవసరం. కనీసం ఏడెనిమిది గంటలు నిద్రపోవాలని నిపుణులు చెబుతున్నారు. అయితే రాత్రి చాలా సేపు నిద్రపోని వారు ఉన్నారు. అలాంటి వారు నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు.

నిద్ర
నిద్ర

నిద్ర

నిద్రలేమికి చాలా కారణాలు ఉండవచ్చు. మానసిక ప్రశాంతత లేకపోవడం, ఏవేవో ఆలోచనలు మెదడులో తిరుగుతుండొచ్చు. సరైన ఆహారం(Food) తీసుకోకపోవడం, నిద్రకు సరైన వాతావరణ లేకపోవడం లాంటివాటితోనూ నిద్రభంగం కలగొచ్చు. నిద్రలేమి హృదయ సంబంధ వ్యాధులు, నిరాశ, మధుమేహం, అధిక రక్తపోటు, మరణం ప్రమాదాన్ని పెంచుతుంది. అయితే నిద్రలేమి మనిషిని స్వార్థపరుడిగా మారుస్తుందని ఓ పరిశోధనలో తేలింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మీ కోసం.

ప్రపంచంలో నిద్రకు సంబంధించి అనేక అధ్యయనాలు జరుగుతున్నాయి. నిద్రలేమి మనిషిని స్వార్థపరుడిని చేస్తుందని ఓ అధ్యయనం చెబుతోంది. PLOS బయాలజీ జర్నల్‌లో ప్రచురించబడిన ఈ అధ్యయనం, నిద్రలేని రాత్రులు వ్యక్తిని స్వార్థపరులుగా(Selfish) మార్చగలదని చూపిస్తుంది. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, నిద్ర సరిగా లేని వ్యక్తి వ్యక్తిత్వంలో అత్యంత ముఖ్యమైన మార్పు స్వార్థం అని చెబుతున్నారు.

బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.., తక్కువ నిద్రతో, ఇతరులకు సహాయం చేయాలనే మీ కోరిక, సుముఖతను మీరు ఉపసంహరించుకోవచ్చని అధ్యయనాలు చూపించాయి. నిద్రలేమి(Sleep Disorder) వ్యక్తి భావోద్వేగ స్థితిని మారుస్తుంది. ఇది సామాజిక పరిస్థితులలో ఒక వ్యక్తి ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది.

UC బర్కిలీ పరిశోధనా శాస్త్రవేత్త AT బెన్ సైమన్, UC బర్కిలీ సైకాలజీ ప్రొఫెసర్ మాథ్యూ వాకర్ నేతృత్వంలోని అధ్యయనం జరిగింది. తక్కువ నిద్ర ఒక వ్యక్తి మానసిక, శారీరక శ్రేయస్సుకు హాని కలిగించడమే కాకుండా, వ్యక్తుల మధ్య సంబంధాలను కూడా ప్రమాదంలో పడేస్తుందని నిరూపించబడింది.

పరిశోధకులు ఫంక్షనల్ మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజర్(ఎఫ్‌ఎమ్‌ఆర్‌ఐ)ని ఉపయోగించి రాత్రిపూట నిద్రపోని 24 మంది ఆరోగ్యకరమైన వాలంటీర్ల మెదడులను పరిశీలించారు. నిద్రలేమి వారిని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకున్నారు. దీని ద్వారా ఇతరుల బాధలకు సహాయం చేయడం లేదా ఇతరుల బాధల పట్ల సానుభూతి చూపడం పట్ల నిద్రలేనివారికి పెద్దగా ఆసక్తి లేదని తేలింది. వారు తమ స్వంత ఆలోచనలపై మాత్రమే ఆసక్తి చూపుతున్నారని, మరింత స్వార్థపూరితంగా ఉంటారని పరిశోధనలు చెబుతున్నాయి.

అంతే కాదు నిద్ర లేకపోవడం వల్ల సమాజానికి దూరంగా ఉండేలా చేస్తుంది. ఇది ఇతరులతో కలిసిపోయే.. సామర్థ్యాన్ని అణిచివేస్తుందని, మనల్ని ఒంటరిగా భావించేలా చేస్తుందని పరిశోధకులు గుర్తించారు. కాబట్టి ఆరోగ్యంగా(Healthy) ఉండటానికి మంచి నిద్ర ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవాలి.

సరైన నిద్ర పరిస్థితులు, సరైన సమయాన్ని నిర్ధారించుకోవాలి. కాంతి నిద్రను ప్రభావితం చేస్తుంది. కాబట్టి లైట్ ఆఫ్ చేసిన తర్వాత నిద్రపోండి. నిద్రపోతున్నప్పుడు మొబైల్ ఫోన్(Mobile Phone) ఉపయోగించవద్దు. రాత్రిపూట టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ వంటివి తాగకుండా ప్రయత్నించండి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా వంటి వాటిని ప్రయత్నించండి. మద్యపానం, ధూమపానం మానేయండి.