Rajamouli about RRR Interval: ఆ సీన్ కోసం 40 రాత్రులు కష్టపడ్డాం.. ఆర్ఆర్ఆర్ చిత్రంపై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు-rajamouli explains how he shot interval sequence of rrr ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rajamouli About Rrr Interval: ఆ సీన్ కోసం 40 రాత్రులు కష్టపడ్డాం.. ఆర్ఆర్ఆర్ చిత్రంపై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు

Rajamouli about RRR Interval: ఆ సీన్ కోసం 40 రాత్రులు కష్టపడ్డాం.. ఆర్ఆర్ఆర్ చిత్రంపై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు

Maragani Govardhan HT Telugu
Dec 03, 2022 10:45 AM IST

Rajamouli about RRR Interval: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఇంటర్వెల్ సన్నివేశం అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సీన్ గురించి జక్కన్న ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఆర్ఆర్ఆర్‌పై రాజమౌళి స్పందన
ఆర్ఆర్ఆర్‌పై రాజమౌళి స్పందన

Rajamouli about RRR Interval: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మనదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇటీవలే జపాన్‌లోనూ విడుదలై అక్కడ కూడా అదిరిపోయే వసూళ్లను సాధించిందీ చిత్రం. రాజమౌళి అమెరికా వెళ్లి అక్కడ ప్రమోషన్లలో పాలుపంచుకున్నారు. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఇంటర్వెల్ బ్యాక్‌డ్రాప్‌లో జూనియర్ ఎన్టీఆర్ పులులతో పాటు దిగే సీక్వెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సీన్ అంతగా రావడానికి దాని వెనక ఎంతో కష్టముందని రాజమౌళి తెలిపారు. ఇటీవలే ఓ ఆంగ్ల మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఇంటర్వెల్ సీన్ కోసం 40 రాత్రులు కష్టపడ్డామని తెలిపారు.

ఫిజికల్ ఆ సీక్వెన్స్ అత్యంత ఛాలెంజింగ్‌గా ఉంటుంది. దాదాపు 40 రాత్రులకు పైగా ఆ సీక్వెన్స్ కోసం కష్టపడ్డాం. 2000 మంది ఈ సన్నివేశం కోసం పనిచేశారు. ఇందుకోసం ఎంతో ప్రిపరేషన్ అవసమరైంది. విజువల్ ఎఫెక్ట్స్ సూపర్‌వైజర్ శ్రీనివాస్ మోహన్ జంతువుల 3డీ యానిమేషన్ కోసం బాగా కష్టపడ్డారు. అని అన్నారు.

మేము జంతువుల వేగాన్ని తక్కువ అంచనా వేశాం. ఉదాహరణకు పులి గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందనుకుంటే 10 అడుగుల పొడవు ఉన్న యానిమల్.. అంత స్పీడుతో వెళ్లినప్పుడు కెమెరాలో బంధించడం చాలా కష్టంగా ఉంది. దీంతో వాటిని గుర్తించడానికి ఎల్ఈడీ లైట్లను ఉపయోగించాం. ఆ లైట్ ఫ్లాష్ ద్వారా కెమెరా‌మన్ పులి వేగాన్ని గుర్తించగలిగాడు అని రాజమౌళి వివరించారు.

జన సమూహంలోకి జంతువులను వదిలినప్పుడు ప్రజలు రియాక్షన్ కోసం రిమోట్ కంట్రోల్ కార్లు వాడినట్లు రాజమౌళి అన్నారు. కార్లు ఆ విధంగా వెళ్లినప్పుడు వారి రియాక్షన్‌ను క్యాప్చుర్ చేశాం. అని తెలిపారు. ఆర్ఆర్ఆర్ చిత్రం ఇంత పెద్ద హిట్ కావడానికి స్నేహితుల మధ్య ఉండే ఎమోషనే ప్రధాన కారణమని అన్నారు.

తాజాగా ఈ సినిమాకు అరుదైన గౌరవం కూడా దక్కింది. ఐఎండీబీ ప్రకటించిన ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏడాది బాగా అలరించిన టాప్-50 చిత్రాల్లో ఆర్ఆర్ఆర్ చోటు దక్కించుకుంది. భారత్ నుంచి ఇదొక్క సినిమా అందులో స్థానం సంపాదిచడం గమనార్హం.

ఈ సినిమాలో రామ్‌చరణ్ సరసన సీత పాత్రలో ఆలియా భట్, తారక్ సరసన బ్రిటీష్ యాక్ట్రెస్ ఒలివియా మోరిస్ నటించారు. అజయ్ దేవగణ్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మించారు. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయళ భాషల్లో ఈ సినిమా ఒకేసారి విడుదలైంది. మొత్తంగా రూ.1200 కోట్ల పైచిలుకు కలెక్షన్లు రాబట్టింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్