తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Best Oil For Cooking : మీరు ఏ వంట నూనె వాడుతున్నారు? ఇవి ఆరోగ్యానికి హానికరం!

Best Oil For Cooking : మీరు ఏ వంట నూనె వాడుతున్నారు? ఇవి ఆరోగ్యానికి హానికరం!

HT Telugu Desk HT Telugu

15 March 2023, 14:00 IST

    • Healthy and Unhealthy Cooking Oil : కొన్ని నూనెలు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మరికొన్ని నూనెలను ఉపయోగించినప్పుడు జాగ్రత్త వహించాలి. పోషకాహార నిపుణులు ఆరోగ్యకరమైన, అనారోగ్యకరమైన నూనెల గురించి చెబుతున్నారు.
వంట నూనెలు
వంట నూనెలు

వంట నూనెలు

నూనె లేనిదే వంట లేదు. ఏదైనా ఐటమ్ కాల్చేందుకు, వేయించడానికి నూనెను ఉపయోగిస్తారు. అందువల్ల నూనె(oil)ను జాగ్రత్తగా ఎంచుకోవడం అవసరం. పోషకాహార నిపుణుడు లోవ్‌నీత్ బాత్రా ప్రకారం కొన్ని నూనెలు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అయితే కొన్నింటితో జాగ్రత్తగా వాడాలి. ఏ నూనెలు ఉపయోగించాలి. ఏమి ఉపయోగించకూడదు అనేవి ఇక్కడ ఉన్నాయి. ఆరోగ్యకరమైన నూనెలను ఎలా ఎంచుకోవాలో ప్రజలు తరచుగా దృష్టి పెడతారు. కానీ ఏదో ఒకటి తెచ్చేస్తారు. తేలియకుండానే ఆరోగ్యం(health) మీద ప్రభావం చూపుతుంది.

ఆరోగ్యకరమైన వంట నూనెలు

భారతీయ వంటకాలలో నెయ్యి ఒక ముఖ్యమైన భాగం. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్లు ఎ, ఇ, కె మరియు బ్యూట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి జీర్ణక్రియ, మెదడు అభివృద్ధికి సహాయపడతాయి.

ఆవాల నూనె(Mustard Oil) అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఇది రక్త ప్రసరణను ప్రేరేపిస్తుంది. MUFA, PUFA మరియు ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ కూడా ఉన్నాయి. మీ ఆహారం(Food)లో ఆవనూనెను చేర్చుకోవడం ఆరోగ్యకరమైన హృదయాన్ని నిర్వహించడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. మస్టర్డ్ ఆయిల్‌లో విటమిన్ ఇ ఉంటుంది, ఇది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

ఆలివ్ ఆయిల్‌(olive oil)లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఆలివ్ ఆయిల్‌లోని ప్రాథమిక కొవ్వు ఆమ్లం ఒలేయిక్ యాసిడ్ అని పిలువబడే మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వు, ఇది క్యాన్సర్ నిరోధక, శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉండవచ్చని అధ్యయనాలు చూపించాయి. ఆలివ్ నూనెలో ఒలియోకాంతల్, ఒలీరోపిన్ అనే యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు ఉన్నాయి.

అనారోగ్యకరమైన వంట నూనెలు

కనోలా ఆయిల్(Canola Oil) అధిక వేడి కింద ప్రాసెస్ చేయబడుతుంది. దీని ఫలితంగా రాన్సిడ్ ఏర్పడుతుంది. ఇది బ్లీచ్‌లు, రూమ్ స్ప్రేలు, పెర్ఫ్యూమ్‌ల వంటి హెక్సేన్‌లను తయారు చేయడానికి ఉపయోగించబడుతుంది.

సన్‌ఫ్లవర్ ఆయిల్(Sun Flower Oil)లో ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్‌లు పుష్కలంగా ఉంటాయి. శరీరానికి అవి అవసరం, కానీ ఒమేగా -3 లతో సమతుల్యం చేయకుండా చాలా ఎక్కువ ఒమేగా -6 లను తీసుకోవడం వల్ల శరీరంలో మరింత మంట వస్తుంది. అలాగే, పొద్దుతిరుగుడు నూనె అధిక వేడి మీద వండినప్పుడు ఆల్డిహైడ్ (విషపూరిత పదార్థాలు) ఉత్పత్తి చేస్తుంది.

పామ్ ఆయిల్(palm oil).. కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ కొలెస్ట్రాల్(cholesterol) స్థాయిలను తగ్గించే పాల్మిటిక్ యాసిడ్, సంతృప్త కొవ్వు ఆమ్లంగా ఉంటుంది. అందుకే నూనెలను తీసుకునేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సరైన నూనెను మీ వంటలోకి ఉపయోగించండి.