Grapes Benefits : ఎరుపు, ఆకుపచ్చ, నలుపు ద్రాక్షలో ఏది ఆరోగ్యకరమైనది?-which grapes best for health black grapes vs green grapes vs red grapes nutrition health benefits difference ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Grapes Benefits : ఎరుపు, ఆకుపచ్చ, నలుపు ద్రాక్షలో ఏది ఆరోగ్యకరమైనది?

Grapes Benefits : ఎరుపు, ఆకుపచ్చ, నలుపు ద్రాక్షలో ఏది ఆరోగ్యకరమైనది?

HT Telugu Desk HT Telugu
Mar 12, 2023 11:05 AM IST

Which Grapes Best : తీపి, పుల్లని ద్రాక్షలను చాలామంది ఇష్టంగా తింటారు. నల్ల ద్రాక్ష, ఆకుపచ్చ ద్రాక్ష, ఎరుపు ద్రాక్ష, ఇలా చాలా రకాలు ఉన్నాయి. కొన్ని ద్రాక్షలు ఖరీదైనవి. అయితే ఏ ద్రాక్ష ఆరోగ్యకరమైనది?

ద్రాక్ష ప్రయోజనాలు
ద్రాక్ష ప్రయోజనాలు

ఆకుపచ్చ ద్రాక్ష

మనం చాలా ఇష్టంగా తింటాం. ఇందులోనూ చాలా రకాల ద్రాక్షలు దొరుకుతాయి. కొన్ని చాలా తీపిగా ఉంటాయి. మరికొన్ని పుల్లగా ఉంటాయి. ఫ్రూట్ సలాడ్ మరియు పెరుగు(Curd)లో ఆకుపచ్చ ద్రాక్ష(Green Grapes) ఉపయోగిస్తారు. అధ్యయనం ప్రకారం, 1 కప్పు ఈ ద్రాక్షలో ఈ పోషకాలన్నీ ఉన్నాయి: సుమారు 104 కేలరీలు, 1.4 గ్రాముల ప్రొటీన్, 0.2 గ్రాముల కొవ్వు, 27 గ్రాముల పిండి పదార్థాలు, విటమిన్ సి, విటమిన్ కె(Vitamin K) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. విటమిన్ K రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించడంలో సహాయపడుతుంది.

నల్ల ద్రాక్ష

నల్ల ద్రాక్ష(Black Grapes)లో చాలా రకాలు ఉన్నాయి. పుల్లని, తీపి కలిగివి ఉంటాయి. తరచుగా జ్యూస్ తయారీలో ఉపయోగిస్తారు. ఇది వైన్(Wine) తయారీలో కూడా ఉపయోగించబడుతుంది. నల్ల గింజలు లేని ద్రాక్షను కూడా పొందవచ్చు. ఇది తినడానికి చాలా రుచిగా ఉంటుంది. నల్ల ద్రాక్షలో పోషకాలు 1 కప్పు ద్రాక్షలో సుమారు 104 కేలరీలు, 1.1 గ్రాముల ప్రోటీన్ మరియు 0.2 గ్రాముల కొవ్వు ఉంటుంది. ఇందులో విటమిన్ కె మరియు సి కూడా ఉన్నాయి. ఈ ద్రాక్ష క్యాన్సర్(Cancer) కణాలను నివారిస్తుంది.

ఎర్ర ద్రాక్ష

ఎర్ర ద్రాక్ష(Red Grapes) తినడానికి రుచికరమైనది. ఖరీదైనది. ఇది జామ్ మరియు జెల్లీని తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఒక ఎర్ర ద్రాక్షలో 104 కేలరీలు, 1.1 గ్రాముల ప్రోటీన్, 0.2 గ్రాముల కొవ్వు, 27.3 గ్రాముల పిండి పదార్థాలు, విటమిన్ సి మరియు విటమిన్ కె ఉన్నాయి.

ఏ ద్రాక్షలో ఎక్కువ పోషకాలు ఉన్నాయి?

అన్ని రకాల ద్రాక్షలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కానీ నలుపు, ఎరుపు ద్రాక్షలో మూడు రకాల పాలీఫెనాల్స్ ఉన్నాయి: ఫినోలిక్ యాసిడ్, ఫ్లేవనాయిడ్ మరియు రెస్వెరాట్రాల్. ఇవి ఇన్‌ఫ్లమేషన్‌ను నివారించడానికి, క్యాన్సర్‌ను నివారించడానికి, గుండె ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. కాబట్టి ఎరుపు, నలుపు ద్రాక్షలో ఆకుపచ్చ ద్రాక్ష కంటే కొంచెం ఎక్కువ పోషకాలు ఉన్నాయి.

రోజూ ద్రాక్ష తినడం వల్ల ప్రయోజనాలు

క్యాన్సర్ కణాలను నివారిస్తుంది

బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్ నియంత్రిస్తుంది

గుండె ఆరోగ్యానికి మంచిది

రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

జ్ఞాపకశక్తికి మంచిది, కంటి చూపునకు మంచిది.

ఎముకల ఆరోగ్యానికి మంచిది.

మంటను తగ్గిస్తుంది, చర్మ కాంతిని పెంచుతుంది.

Whats_app_banner