Breakfast For Immunity : ఇలా బ్రేక్ ఫాస్ట్ ట్రై చేయండి.. మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది-boost your immunity with these healthy breakfast ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Boost Your Immunity With These Healthy Breakfast

Breakfast For Immunity : ఇలా బ్రేక్ ఫాస్ట్ ట్రై చేయండి.. మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది

HT Telugu Desk HT Telugu
Feb 12, 2023 06:30 AM IST

Breakfast For Immunity : బ్రేక్ ఫాస్ట్ చేయడం తప్పనిసరి. లేకుంటే లేనిపోని ఆరోగ్య సమస్యలు వస్తాయి. అయితే తీసుకునే బ్రేక్ ఫాస్ట్ కూడా హెల్తీగా ఉంటే మంచిది.

అల్పాహారం
అల్పాహారం (Freepik)

అల్పాహారాన్ని(Breakfast) రోజులో అత్యంత ముఖ్యమైన భోజనంగా పేర్కొంటారు. ఇది మీ శక్తి స్థాయి, చురుకుదనాన్ని పెంచే గ్లూకోజ్‌ని అందించడం ద్వారా మన రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ఇది మీ జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. మెదడును ఉత్తేజపరుచుతుంది. అందుకోసమే ఆరోగ్యకరమైన అల్పాహారంతో రోజును ప్రారంభిస్తే మంచిది. ఆహారం(Food) ద్వారా మీ రోగనిరోధక శక్తి(Immunity)ని మెరుగుపరచుకోవడానికి ప్రతిరోజూ ప్రయత్నం చేయండి. మీ కోసం కొన్ని సూచనలు ఇక్కడ ఉన్నాయి.

విత్తనాలు రోగనిరోధక వ్యవస్థకు మేలు చేస్తాయి. తృణధాన్యాలు.., శాండ్‌విచ్‌లు, పాన్‌కేక్‌లు లేదా స్మూతీస్ వంటి వాటిలో వాటిని ఉపయోగించండి. లేదంటే.. అంతకుముందు రోజు నానబెట్టి.. ఆ తర్వాత మెులకెత్తిన విత్తనాలను తినండి. ఆరోగ్యానికి చాలా మంచిది.

పసుపు యాంటీఆక్సిడెంట్, ఇది మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో పనిచేస్తుంది. మీరు దీన్ని పాలు, స్మూతీస్ లేదా మిల్క్‌షేక్‌ల వంటి అల్పాహార పానీయాలకు జోడించవచ్చు.

చాలా మంది భారతీయులు తమ రోజును ఒక కప్పు టీ తాగడం ద్వారా ప్రారంభిస్తారు. మీ టీకి అల్లం, లవంగాలు, ఫెన్నెల్, ఏలకులు వంటి సుగంధ ద్రవ్యాలు జోడించండి. ఇది మీ రోగనిరోధక శక్తిని మరింత ప్రభావవంతంగా చేస్తుంది.

గుడ్లు.. ప్రోటీన్ యొక్క ముఖ్యమైన మూలం. గుడ్లు లేదా సోయా చంక్స్, పనీర్, శనిగలు, వంటి వాటితో మీ రోజును మెుదలుపెట్టండి. ఇతర ప్రోటీన్‌లను కలిగి ఉండే అల్పాహారంతో మీరు మీ రోజును ప్రారంభించవచ్చు. చౌకైన, పోషకమైన అల్పాహారం ఏదైనా ఉంటే.. అది గుడ్లు. గుడ్లు శరీరంలో ఒత్తిడిని తగ్గించే బహుళ యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. అలాగే రోజంతా పని చేయడానికి మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది. అది ఫ్రై చేసినా.. లేదా ఆమ్లెట్ వేసినా.. ఉడకబెట్టినా దీనిని మీ బ్రేక్ ఫాస్ట్‌లో గుడ్డు ఉండేలా చూసుకోండి.

పెరుగు లేదా పాలతో చక్కెరను ఉపయోగించి పండ్లు, గింజలతో స్మూతీలను తయారు చేయండి. ఇది మీ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసే పోషకాలతో కూడి ఉంటుంది.

WhatsApp channel

సంబంధిత కథనం