Halva Puri For Breakfast : వేడి వేడిగా హల్వా పూరీ తినేయండి
Breakfast Recipe : ఉదయం పూట.. ఏ బ్రేక్ ఫాస్ట్ తయారు చేయాలా అనుకునేవారు.. హల్వా పూరీ తయారు చేయండి. వీటి రుచి కూడా టెస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకోండి.
మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ తప్పనిసరిగా చేయాలి. లేదంటే.. రోజంతా నిరసంతో ఉంటారు. అయితే రోజూ ఒకలాగే తినడం కంటే.. అప్పుడప్పుడు కాస్త టెస్టీ రెసిపీలు ట్రై చేయండి. హల్వా పూరీని తయారుచేసుకోండి. దీనిని చాలామందే చూసి ఉంటారు. చూడడానికి పూరీ లాగా ఉన్నా.. రుచి మాత్రం బాగుంటుంది. తిపిని ఇష్టపడే వారు దీనిని తయారుచేసుకోవచ్చు.
హల్వా పూరీని సులభంగా తయారు చేసుకోవచ్చు. వాటిని తయారు చేసుకునేందుకు సమయం కూడా ఎక్కువగా పట్టదు. ఎంతో రుచిగా ఉండే.. ఈ హల్వా పూరీలను ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి. తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో.. ఇతర వివరాలు ఇక్కడ ఉన్నాయి.
కావల్సిన పదార్థాలు..
మైదాపిండి-2 కప్పులు, ఉప్పు-చిటికెడు, బొంబాయి రవ్వ-ఒక టీ గ్లాస్, పంచదార-ఒకటింపావు టీ గ్లాసులు, నీళ్లు-రెండున్నర టీ గ్లాసులు, నెయ్యి-ఒక టీ స్పూన్, యాలకుల పొడి-పావు టీ స్పూన్, నూనె- ఫ్రైకు తగినంత
తయారీ విధానం..
మెుదట ఒక గిన్నెలో మైదా పిండిని తీసుకుని.. అందులో ఉప్పు, 2 టీ స్పూన్ల నూనే వేసి కలపాలి. అనంతరం తగినన్ని నీళ్లు పోసి.. చపాతీ పిండిలా కలుపుకోవాలి. కాసేపు అది పక్కన పెట్టాలి. మరోవైపు ఒక గిన్నెలో బొంబాయి రవ్వ, పంచదార వేసి కలపాలి. ఇప్పుడు ఒక కళాయిలో నీళ్లు పోసి వేడి చేయాలి. నెయ్యి, యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. నీళ్లు మరిగిన తర్వాత రవ్వ, పంచదారను ఉండలు లేకుండా కలుపుకోవాలి. దగ్గర పడేవరకూ కలిపి స్టౌవ్ ఆఫ్ చేయాలి. ఆ తర్వాత కాస్త చేతికి నూనే రాసుకుని.. చిన్న చిన్న ఉండలుగా రవ్వ మిశ్రమాన్ని చేసుకోవాలి.
ఆ తర్వాత.. ముందుగా పక్కన పెట్టిన పూరీ పిండిని తీసుకోవాలి. ఇందులోకి తయారు చేసుకున్న రవ్వ ఉండలను పెట్టాలి. అరటి ఆకు లేదా ప్లాస్టిక్ కవర్ ను తీసుకుని.. దానికి నూనె రాయాలి. మైదా పిండి, రవ్వ ముద్దలను ఉంచి.. చేత్తో పూరీలా వత్తుకోవాలి. చేతితో వత్తుకోవడం రాకపోతే.. చపాతీ కర్రతో కూడా పూరీలా వత్తుకోవచ్చు. ఆ తర్వాత కుళాయిలో నూనె వేసి వేడి చేయాలి. ఆ తర్వాత వత్తుకున్న పూరీని నూనెలో వేయాలి. అలా అన్ని పూరీలను తయారు చేసుకోవాలి. వేడి వేడిగా హల్వా పూరీలను లాగించేయోచ్చు.
టాపిక్