IOCL jobs: ఇండియన్ ఆయిల్‌లో నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. దరఖాస్తు చేసుకోండిలా!-iocl recruitment 2022 recruitment for 56 non executive posts in indian oil see details ,లైఫ్‌స్టైల్ న్యూస్
Telugu News  /  Lifestyle  /  Iocl Recruitment 2022: Recruitment For 56 Non-executive Posts In Indian Oil See Details

IOCL jobs: ఇండియన్ ఆయిల్‌లో నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. దరఖాస్తు చేసుకోండిలా!

ICOL jobs
ICOL jobs

IOCL Recruitment 2022: ఇండియన్ ఆయిల్‌లో 56 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల ఖాళీల సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ జరుగుతోంది. ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ అక్టోబర్ 10. ఆసక్తి గల అభ్యర్థులు iocl.comలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు

IOCL Recruitment 2022:: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) 56 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించింది.పైప్‌లైన్స్ డివిజన్‌కు సంబంధించి వివిధ నగరాల్లో 56 నాన్-ఎగ్జిక్యూటివ్‌లను నియమించనున్నారు. ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ జరుగుతోంది. ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ అక్టోబర్ 10. ఆసక్తి గల అభ్యర్థులు iocl.comలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

ఖాళీల వివరాలు:

IOCL ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ ద్వారా 56 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

వయోపరిమితి - ఇండియన్ ఆయిల్ రిక్రూట్‌మెంట్‌కు 18 నుండి 26 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వయస్సు సెప్టెంబర్ 12న లెక్కించబడుతుంది.

అర్హతలు: అభ్యర్థి సంబంధిత ట్రేడ్‌లో మూడేళ్ల డిప్లొమా లేదా రెండేళ్ల ఐటీఐ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి.

అప్లికేషన్ ఫీజు: జనరల్, EWS, OBCకి రూ.100. ఇతర రిజర్వ్‌డ్ కేటగిరీలు దరఖాస్తు రుసుములో సడలింపు ఉంటుంది.

IOCL ఖాళీకి ఎలా దరఖాస్తు చేయాలి

పైప్‌లైన్ డివిజన్ అధికారిక వెబ్‌సైట్‌ని plapps.indianoil.in సందర్శించండి.

నోటిఫికేషన్‌లో ఇక్కడ ఇవ్వబడిన “ Recruitment for Filling Non-Executive Vacancies in Pipelines Division (Adv. No.: PL/HR/ESTB/RECT-2022(2) Dated 12.09.2022)” లింక్‌పై క్లిక్ చేయండి.

పూర్తి వివరాలను నమోదు చేసి దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేయండి.

దరఖాస్తు రుసుము చెల్లించండి.

అప్లికేషన్ పూర్తయిన తర్వాత, దానిని సబ్‌మిట్ చేసి, దాని హార్డ్ కాపీని ప్రింట్ అవుట్ చేసి మీ వద్ద ఉంచుకోండి.

ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేయడానికి ముందు అభ్యర్థులు పూర్తి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను చదవాలి.

WhatsApp channel

సంబంధిత కథనం