తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Happiness Tea । ఈ టీని ఒక కప్పు తాగితే ఆందోళన పోయి, ఆనందం కలుగుతుందట!

Happiness Tea । ఈ టీని ఒక కప్పు తాగితే ఆందోళన పోయి, ఆనందం కలుగుతుందట!

HT Telugu Desk HT Telugu

23 January 2023, 16:52 IST

    • Happiness Tea Recipe: టీ తాగితే తాలనొప్పి తగ్గుతుంది అని నమ్ముతాం. కానీ ఈ టీ తాగితే ఆనందం పొందుతాం అని చెబుతున్నారు. హ్యాపీనెస్ టీ రెసిపీ ఇక్కడ ఉంది.
Happiness Tea Recipe
Happiness Tea Recipe (Unsplash)

Happiness Tea Recipe

ఆనందాన్ని ఎవరు కోరుకోరు? కానీ ఒక వైపు ఒత్తిడి, మరోవైపు ఆందోళనతో సగటు మనిషి సతమతమవుతున్నాడు. ఫలితంగా తన మానసిక, శారీరక ఆరోగ్యాన్ని తనే చెడగొట్టుకుంటున్నాడు. అయితే ప్రజల్లో ఇప్పుడిప్పుడే ఆరోగ్యం ప్రాముఖ్యతను నెమ్మదిగా అర్థం చేసుకోవడం ప్రారంభించారు. తాము తీసుకునే ఆహార పానీయాల విషయాలలో ఆరోగ్య స్పృహను కలిగి ఉంటున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకుంటున్నారు.

మనందరం ఉదయం, సాయంత్రం వేళల్లో లేదా కొద్దిగా రిఫ్రెష్ అవ్వాలి అనుకున్నప్పుడు ఒక కప్పు చాయ్ తాగుతాం. ఈ టీలలో చాలా రకాలు ఉంటాయని మీ అందరికీ తెలుసు. అందులో కొన్ని రకాలు నిర్ధిష్ట ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి కూడా. బరువు తగ్గాలన్నా, గొంతు నొప్పి పోవాలన్నా దానికి ప్రత్యేకమైన టీ ఉంటుంది. అయితే మిమ్మల్ని ఆనందంగా ఉంచే టీ గురించి ఎప్పుడైనా విన్నారా? అయితే ఇప్పుడు ఆ ప్రత్యేకమైన టీ గురించి తెలుసుకోండి.

గన్ మై డా జావో టాంగ్ (Gan Mai Da Zao Tang) దీనినే ఆనందకరమైన టీ (Happiness Tea) అని కూడా అంటారు. ఇదెక్కడి టీ అని కంగారు పడకండి, గన్ మై డా జావో అంటే చైనా భాషలో ఆనందం. డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఈ టీ తాగితే డిప్రెషన్ పోయి మంచి మూడ్ లోకి వస్తామట. మళ్లీ అందరితో ఆనందంగా మాట్లాడతామట. అందుకే దీనికి హ్యాపీనెస్ టీ అని పేరు వచ్చింది. ఈ టీ చేసుకోవడం చాలా సింపుల్. హ్యాపీనెస్ టీ రెసిపీ ఈ కింద ఉంది చూడండి.

Happiness Tea Recipe కోసం కావలసినవి

  • 9 గ్రాముల లికోరైస్
  • 9 గ్రాముల గోధుమలు
  • 10 గ్రాముల ఎర్ర ఖర్జూరం

హ్యాపీనెస్ టీ తయారు చేసే విధానం

  1. ముందుగా నీటిని వేడి చేసి, ఆ వేడి నీటిలో పైన పేర్కొన్న పదార్థాలన్నీ వేసి మరిగించాలి.
  2. ఆపైన మరిగించిన నీటిని వడకట్టి ఒక కప్పులోకి పోసుకుంటే అదే హ్యాపీనెస్ టీ.
  3. గోరువెచ్చగా తాగితే ఆందోళన పోయి, ఆనందం కలుగుతుంది.

మరి ఇంకేం, హ్యాపీనెస్ టీకి కావలసిన పదార్థాలు మన వద్ద కూడా అందుబాటులో ఉంటాయి, కుదిరితే మీరూ ఒక కప్పు తాగి చూడండి.