తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Coffee With Tea Recipe | కుదిరితే కప్పు కాఫీ.. వీలైతే ఒక గ్లాస్ చాయ్‌తో కలిపి తాగేయండి ఇలా!

Coffee with Tea Recipe | కుదిరితే కప్పు కాఫీ.. వీలైతే ఒక గ్లాస్ చాయ్‌తో కలిపి తాగేయండి ఇలా!

HT Telugu Desk HT Telugu

03 January 2023, 16:45 IST

    • Coffee with Tea Recipe: కాఫీలు తాగారా..? టీలు, టిఫినీలు అయ్యాయా? ఈ సాయంత్రం కాఫీ, టీలు రెండు కలిపి తాగండి, స్పెషల్ కాఫీ చాయ్ రెసిపీ ఇక్కడ ఉంది.
Coffee with Tea Recipe
Coffee with Tea Recipe (Unsplash)

Coffee with Tea Recipe

మీరు టీ తాగుతారా? లేక కాఫీ తాగుతారా? ఒక పనిచేయండి, ఈ సాయంత్రానికి కాఫీ-టీలు రెండూ కలిపి తాగేయండి, అదిరిపోతుంది. ఇలా ఎవరైనా తాగుతారా? అని మీకు అనిపించొచ్చు, కానీ ఈ రెసిపీ వరల్డ్ ఫేమస్. ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. హాంగ్‌కాంగ్‌లో యువాన్‌యాంగ్ (yuanyang) అనే రెసిపీ చాలా పాపులర్, అలాగే మలేషియాలోనూ కోపీ చామ్ (Kopi Cham) అనే రెసిపీ కూడా ఉంది. వీటి అర్థం సింపుల్‌గా కాఫీ చాయ్ (Coffee with Tea) అని చెప్పొచ్చు. టీతో పాటు కాఫీని కలిపి చేయడమే ఈ కాఫీ చాయ్. మీరు కూడా అప్పుడప్పుడు టీలో కాఫీ పొడి వేసుకుని తాగి ఉంటారు, ఇది కూడా అలాంటిదే. అయితే తయారీ విధానం కొద్దిగా వేరే ఉంటుంది. అంతేకాదు దీనిని చల్లచల్లగా ఐస్ కాఫీ చాయ్ లాగా చేయవచ్చు, లేదా వేడివేడిగా హాట్ కాఫీ చాయ్ లాగా కూడా చేసుకోవచ్చు. అది ఎలా చేయాలి, కావలసిన పదార్థాలు ఏమిటో ఇక్కడ తెలుసుకోండి.

ట్రెండింగ్ వార్తలు

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

ఈసారి మీ ఇంటికి అతిథులు వచ్చినపుడు కాఫీనో, టీనో కాకుండా ఇలా కాఫీ టీని కాక్‌టైల్ చేసి అందించండి. అంతకంటే ముందు కాఫీ చాయ్ రెసిపీ ఈ కింద ఉంది చూడండి.

Coffee with Tea Recipe కోసం కావలసినవి

  • 1 టీస్పూన్ టీ పొడి
  • 1/2 టీస్పూన్ కాఫీ పొడి
  • 1 కప్పు పాలు
  • 1 కప్పు నీళ్లు
  • 1/2 టీస్పూన్ చక్కెర
  • ఐస్ (ఐచ్ఛికం)

కాఫీ చాయ్ రెసిపీ- తయారీ విధానం

  1. ముందుగా నీళ్లు వేడి చేసి, టీ పొడి వేసి స్ట్రాంగ్ బ్లాక్ టీ తయారు చేయండి.
  2. ఆపై అందులో పాలు పోసి, ఆపై చక్కెర వేసి 8 నిమిషాలు మరిగించండి.
  3. మరో వైపు మరొక కప్పులో కాఫీని మరిగించండి.
  4. ఇప్పుడు టీని ఒక కప్పులో వడకట్టి, పైనుంచి వేడి కాఫీ ద్రావణం పోయండి.అంతే, కాఫీ చాయ్ రెడీ.

ఇదే తరహాలో రెండూ ద్రావణాలను సిద్ధం చేసి, అవి చల్లబడిన తర్వాత రెండింటిన ఒక ఒక పొడవాటి కూజాలో కలిపేసి, ఆపై మంచు ముక్కలు వేస్తే ఐస్డ్ కాఫీ టీ వెర్షన్ రెడీ అవుతుంది.

టాపిక్

తదుపరి వ్యాసం