Potato Egg Salad Recipe : కడుపు నిండుగా ఉంచే పొటాటో, ఎగ్ సలాడ్.. రెసిపీ చాలా ఈజీ-potato egg salad recipe for morning brunch here is the making process ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Potato Egg Salad Recipe : కడుపు నిండుగా ఉంచే పొటాటో, ఎగ్ సలాడ్.. రెసిపీ చాలా ఈజీ

Potato Egg Salad Recipe : కడుపు నిండుగా ఉంచే పొటాటో, ఎగ్ సలాడ్.. రెసిపీ చాలా ఈజీ

Geddam Vijaya Madhuri HT Telugu
Jan 03, 2023 07:32 AM IST

Potato Egg Salad Recipe : మీరు ఆఫీస్​కి వెళ్లే తొందర్లో ఉన్నా.. త్వరగా, సింపుల్​గా ఏదైనా హెల్తీ రెసిపీ చేసుకోవాలన్నా మీకు పొటాటో, ఎగ్ సలాడ్ బెస్ట్ ఆప్షన్. అంతేకాకుండా ఇది మీరు ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. శరీరానికి ఉదయాన్నే అవసరమైన పోషకాలను అందిస్తుంది.

పొటాటో, ఎగ్ సలాడ్
పొటాటో, ఎగ్ సలాడ్

Potato Egg Salad Recipe : మీ కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉండాలన్నా.. లేదా తేలికపాటి లంచ్ కోసం అయినా మీరు ఏదైనా కొత్తగా ట్రై చేయాలనుకుంటే.. కచ్చితంగా బంగాళాదుంప, ఎగ్ సలాడ్ రెసిపీ బెస్ట్ ఆప్షన్. దీనిలో అనేక పోషకాలు ఉండడమే కాకుండా.. ఇది మీరు ఎక్కువ కాలం కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. పైగా దీనిని తయారు చేసుకోవడం చాలా తేలిక. తక్కువ సమయంలో దీనిని మీరు తయారు చేసుకోవచ్చు. మరి దీనిని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటి? ఎలా దీనిని తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

* బంగాళా దుంపలు - 1000 గ్రాములు

* గుడ్లు - 350 గ్రాములు ( ఉడికించిన గుడ్లు తరిగిన)

* మయోన్నైస్ - 250 గ్రాములు

* గెర్కిన్స్ - 100 గ్రాములు (తరిగినవి)

* ఉప్పు - తగినంత

* పెప్పర్ - అర టీ స్పూన్

* పార్స్లీ - 20 గ్రాములు (తరిగాలి)

* ఉల్లి కాడలు - 20 గ్రాములు

తయారీ విధానం

ముందుగా బంగాళాదుంపలను కట్ చేసి.. ఉడకబెట్టండి. అనంతరం వాటిపై తొక్కను తీసేసి పక్కన పెట్టండి. ఇప్పుడు ఓ గిన్నెలో ఉడకబెట్టిన గుడ్లు, గెర్కిన్స్, పార్స్లీ, ఉల్లికాడలు తరిగి వేయాలి. దానిలోనే మయోన్నైస్ వేసి.. బాగా కలపండి. చివరిగి ఉడకబెట్టిన బంగాళదుంపలు వేసి.. దానిలో సాల్ట్, పెప్పర్ వేసి బాగా కలిపి సర్వ్ చేసుకోండి.

WhatsApp channel

సంబంధిత కథనం