Egg Pouch Recipe : ప్రతి బైట్లోను టేస్ట్ ఇచ్చే ఎగ్ పౌచ్.. రెసిపీ ఇదే..
Egg Pouch Recipe : మీకు ఉదయాన్నే గుడ్డు తినే అలవాటు ఉందా? అయితే ఈ రెసిపీ మీకోసమే. మీ ఆరోగ్యంతో పాటు టేస్ట్‌ని పెంచే ఎగ్ పౌచ్ రెసిపీ గురించి మీకు తెలుసా? దీనిని తయారు చేయడం చాలా సులభం. పైగా ఎవరైనా దీనిని హ్యాపీగా లాగించేస్తారు.
Egg Pouch Recipe : మీకు ప్రతి బైట్‌లో టేస్ట్నిచ్చే ఎగ్ బ్రేక్‌ఫాస్ట్ కోసం ఎదురుచూస్తున్నట్లయితే ఇదే మీకు పర్ఫెక్ట్ రెసిపీ. దీని కోసం గంటలు గంటలు కష్టపడాల్సిన అవసరం లేదు. కేవలం కొన్ని పదార్థాలతో.. రెసిపీని టేస్టీగా తయారు చేసుకోవచ్చు. మరి ఈ ఎగ్ పౌచ్ ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
* కారం - 1 టీస్పూన్
* పెప్పర్ - 1 టీస్పూన్
* సాల్ట్ - రుచికి తగినంత
* ఉల్లిపాయ - 1 (చిన్నగా తరగాలి)
* టొమాటో - 1 (చిన్నగా తరగాలి)
* గుడ్డు - 1
* క్యాప్సికమ్ - 1 (చిన్నగా తరగాలి)
ఎగ్ పౌచ్ తయారీ విధానం
ఒక గుండ్రని నాన్ స్టిక్ ఫ్రై పాన్ తీసుకుని దానిని నూనెతో గ్రీజు చేయండి. అనంతరం గుడ్డు పగలగొట్టి దానిలో వేసి.. తక్కువ నుంచి మధ్యస్థ మంట మీద ఉడికించాలి. దానిలో ఉప్పు, కారం, పెప్పర్ వేసి బాగా కలపాలి.
అనంతరం తరిగిన ఉల్లిపాయలు, టమోటాలు, క్యాప్సికమ్ వేయండి. వాటిని కొంచెం వేయించండి. అవి కొంచెం ఉండుకుతుండగా.. గుడ్డు మిశ్రమాన్ని తిప్పివేయండి. ఇప్పుడు అది కూరగాయలతో సహా మరో వైపు ఉడుకుతుంది. దీనిని ఫోల్ చేసుకుని కట్ చేసుకుని తింటే సరిపోద్ది. వేడి వేడి టీతో దీనిని తీసుకుంటే.. మీరు మంచి అనుభూతి పొందుతారు.
సంబంధిత కథనం