Watermelon Iced Tea | హాట్ సమ్మర్‌కి పర్ఫెక్ట్ టీ.. మీరు ట్రై చేయండి
సమ్మర్లో టీలు తాగలేము. పోనీ కూల్ డ్రింక్స్ తాగుదామంటే లేనిపోని రోగాల భయం. ఇంట్లో ఏమైనా తయారు చేసుకోవాలంటే వాటి తయారీ చాలాకష్టం. ఇలా అనుకునే వారికోసం ఇక్కడ ఓ చల్లని టీ రెసిపీ ఎదురు చూస్తుంది. వేసవి వేడిని తగ్గించేందుకు ఈ టీ మీకు బాగా ఉపయోగపడుతుందంటే తయారు చేసుకోకుండా ఉండగలరా?
Perfect Tea For Hot Summer | ఎండలో తిరిగివచ్చిన వారికైనా.. లేదా శరీరంలోని వేడితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికైనా ఈ వాటర్ మిలన్ ఐస్డ్ టీ ఓ వరమని చెప్పవచ్చు. పైగా దీనిని ఇంట్లోనే తయారు చేసుకోవడం వల్ల కేలరీల ఇబ్బందులు కూడా ఉండవు. శరీరానికి చలువ చేసే దీనిని తాగకుండా ఉండలేము. మీరు కూడా దీనిని తయారీ తెలుసుకుని.. ట్రై చేయండి.
కావాల్సిన పదార్థాలు
* నీళ్లు- అరలీటర్
* గ్రీన్ టీ లీవ్స్ - 2 లేదా 3 చెంచాలు
* వాటర్ మిలన్ - 250 గ్రాములు
* నిమ్మకాయలు - 2
* షుగర్ - స్పూన్ (వేసుకోవాలనిపిస్తే..)
* చాట్ మసాల- 2 టేబుల్ స్పూన్స్
* పుదీనా ఆకులు- కొన్ని
తయారీ విధానం
ముందుగా స్టవ్ వెలిగించి.. గిన్నె పెట్టి దానిలో నీరుపోయాలి. వెంటనే గ్రీన్ టీ లీవ్స్ వేసి మరింగించాలి. సిద్ధమైన గ్రీన్ టీని వడకట్టి గది ఉష్ణోగ్రత వద్ద చల్లార్చాలి. అది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకోవాలి. దానిలో కట్ చేసి పెట్టుకున్న పుచ్చకాయ ముక్కలను వేసుకోవాలి. నిమ్మరసం, పంచదార, చాట్ మసాల, పుదీనా ఆకులు వేసి మిక్సీ చేయాలి. ఈ పూర్తి మిశ్రమాన్ని వడకట్టి.. పల్ప్ వేరు చేయాలి.
ఒక ప్లేట్లో ఉప్పు కారం కలిపి.. గ్లాస్ అంచుల చివర నిమ్మరసం రాసి.. ఉప్పు, కారం పట్టించాలి. గ్లాసులో ఐస్ క్యూబ్‌లు వేసుకుని.. వాటర్ మిలన్ టీని వేసుకోవాలి. నిమ్మకాయ స్లైస్, పుదీనాతో దానిని గార్నిష్ చేసుకుని చల్లగా తాగాలి. వేసవి వేడి నుంచి ఉపశమనం కోరుకునే వారు దీనిని కచ్చితంగా ట్రై చేయవచ్చు. శరీరంలోని వేడిని తరిమికొట్టి.. ఈ టీ మంచి చల్లదనాన్ని ఇస్తుంది.
సంబంధిత కథనం