వీకెండ్ వదిలేస్తే వారంలో ప్రతి ఉదయం ప్రశాంతంగా అల్పాహారం చేయడానికి కూడా మనం పెనుగులాడుతున్నాము. మనసుకు నచ్చిన భోజనం తినడం అటుంచితే, తినడానికి ఏదైనా సమయం ఉంటే చాలు అన్నట్లుగా ఉంటుంది. ఉదయం పూట సామాగ్రిని సిద్ధం చేసుకొని, అది ఉడికించికొని తినాలంటే లంచ్ టైం దగ్గర పడుతుంది. అయితే తక్షణమే చేసుకోవడానికి ఉత్తమమైన అల్పాహారం ఏదైనా ఉందా అని మీరు ఆలోచిస్తుంటే, ఓట్స్ తినవచ్చు.
ఓట్‌మీల్‌ని మీరు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ కోసమైనా, రాత్రి అల్పాహారం కోసం అయినా సులభంగా, అనేక విధాలుగా తయారు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఓట్‌మీల్ ఎంతో ఆరోగ్యకరమైనది. ఇందులో ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన పిండి పదార్థాలు, ఫైబర్ వంటి ఇతర పోషకాలతో నిండి ఉంటాయి. ఇవి మీకు మంచి శక్తినిస్తాయి, మీ పొట్టను చాలా కాలం పాటు నిండుగా ఉండేలా చేసి, మీ ఆకలిని నియంత్రిస్తాయి.
ఓట్స్, అరటిపండు, పాలు, వాల్‌నట్‌లతో కూడిన ఓట్‌మీల్ మీకు శక్తివంతమైన ఆల్పాహారంగా ఉంటుంది. ఒక కప్పు కాఫీ తాగితే మార్నింగ్ సమయంలో ఆక్టివ్ మోడ్ లోకి వచ్చేస్తారు.
అయితే మీరెప్పుడైనా కాఫీ ఓట్స్ తిన్నారా? ఈ విధానంలో మీరు మీ కప్పు కాఫీని విడిగా తయారు చేయవలసిన అవసరం లేదు. మీకు ఒకేసారి ఓట్‌మీల్ తిన్నట్లు ఉంటుంది, కాఫీ తాగినట్లు ఉంటుంది. ఇది ఎలా తయారు చేసుకోవచ్చో కాఫీ ఓట్‌మీల్ రెసిపీని ఒక్కడ అందిస్తున్నాం చూడండి. ఈ రెసిపీని న్యూట్రిషనల్ ఎడ్జ్ వారు సమర్పించారు.
1. ముందుగా ఒక కంటైనర్‌లో ఓట్స్‌ని వేయండి, ఆ తర్వాత అందులో గోరువెచ్చని పాలు, కోకో పౌడర్, ఎస్ప్రెస్సో కలపండి.
2. ఆపైన అరటిపండు ముక్కలు, వాల్‌నట్‌లు, దాల్చిన చెక్క పొడి వేయండి.
3. ఇప్పుడు ఈ కంటైనర్‌ను రాత్రంతా ఫ్రిజ్‌లో ఉంచండి.
4. కనీసం 8 గంటలపాటు రిఫ్రిజిరేటర్‌లో ఉంచండి.
అంతే, ఉదయానికి కాఫీ ఓట్ మీల్ రెడీ. మీరు బ్రేక్‌ఫాస్ట్ చేసే సమయంలో కాఫీ ఓట్‌మీల్ తినేయవచ్చు. దీనితో మీరు అల్పాహారం చేసినట్లు ఉంటుంది, కాఫీ తాగినట్లు ఉంటుంది. మీ సమయం కూడా ఆదా అవుతుంది. మీరు యాక్టివ్ గా కూడా ఉంటారు.
సంబంధిత కథనం