Spiced Coffee । చలికాలంలో స్పైస్ కాఫీ.. కారంగా, ఆరోగ్యకరంగా ఉంటుంది!
మీకు కాఫీ తాగడం ఇష్టం, కానీ టీలలో ఉండేటువంటి స్పైసీ ఫ్లేవర్లలను కోరుకుంటున్నారా? అయితే ఇక్కడ Spiced Coffee Recipe ఉంది, సింపుల్‌గా ఇలా సిద్ధం చేసుకోండి.
ప్రపంచంలో రెండే రకాల వ్యక్తులు ఉంటారు, ఒకరు కాఫీ తాగే వారు, మరొకరు టీ తాగేవారు. మీరు నమ్మినా నమ్మకపోయినా, అతిశయోక్తి అనిపించినా ఇదే నిజం. చాలా మంది వ్యక్తులు కుదిరితే కప్ కాఫీ తాగుతారు గానీ టీ అస్సలు తాగరు. టీ తాగే వారిలోనూ ఇదే ధోరణి ఉంటుంది. అయితే టీలో చాలా వెరైటీలు ఉంటాయి, చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. ఈ చలికాలంలో సుగంధ ద్రవ్యాలతో టీ కాచుకొని తాగితే ఆ కిక్కే వేరు. పెప్పర్ టీ, అల్లం టీ వంటివి ఈ సీజన్‌లో రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
మరి కాఫీ తాగేవారి సంగతేంటి? వీరు కూడా సుగంధ ద్రవ్యాలను కలుపుకొని స్పైసీగా కాఫీ సిద్ధం చేసుకోవచ్చు. స్పైస్ లాటే, మెక్సికన్ మోచా వంటి ఫ్లేవర్లను మీకు నచ్చినట్లుగా కారంగా, ఆరోగ్యకరంగా సిద్ధం చేసుకోవచ్చు. మీరు ప్రయత్నించాలనుకుంటే ఇక్కడ స్పైసీ, హాట్ కాఫీ రెసిపీని అందిస్తున్నాము. స్పైసీ కాఫీ కోసం ఏమేం కావాలి, ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకొని, తయారు చేసుకొని తాగేయండి.
Spiced Coffee Recipe కోసం కావలసినవి
- 200 ml పాలు
- 200 ml ఫ్రెంచ్ ప్రెస్ కాఫీ
- 60 ml నీరు
- తురిమిన జాజికాయ చిటికెడు
- 3 లవంగాలు
- చిన్న దాల్చిన చెక్క
- దాల్చిన చెక్క పొడి చిటికెడు
- 1/2 టీస్పూన్ డెమెరారా చక్కెర
స్పైస్ కాఫీ తయారీ విధానం
- ముందుగా ఒక సాస్ పాన్‌లో నీరు తీసుకొని అందులో జాజికాయ, లవంగాలు, దాల్చినచెక్క వేసి కలపండి, మూత పెట్టి ఒక నాలుగు నిమిషాల పాటు వేడిచేయండి.
- ఇప్పుడు పాలు, డెమెరారా చక్కెర (బ్రౌన్ షుగర్) వేసి మరిగించండి.
- ఇప్పుడు కాఫీ మగ్ తీసుకొని అందులో కాఫీ పొడి వేసి, పాలు సుగందద్రవ్యాల మిశ్రమాన్ని పోసి బాగా కలపండి.
- చివరగా ఫిల్టర్ చేసి, సుగంధ ద్రవ్యాలు తీసేసి, మిగతా కాఫీని కప్పులో తీసుకొని పైనుంచి దాల్చిన చెక్కపొడి చల్లుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి.
అంతే స్పైసీ కాఫీ రెడీ, వేడివేడిగా ఆస్వాదిస్తూ మీ ప్రియమైన వారితో వీలైతే నాలుగు మాటలు మాట్లాడండి.
సంబంధిత కథనం
టాపిక్