Instant Masala Tea। ఇన్‌స్టంట్ కాఫీ కాదు, ఇన్‌స్టంట్‌గా మసాలా చాయ్ చేసుకొండి ఇలా!
ఇన్‌స్టంట్ కాఫీలాగా అప్పటికప్పుడే ఇన్‌స్టంట్ చాయ్ ఎలా చేసుకోవాలో తెలుసా? అయితే ఇక్కడ ఆ Instant Masala Tea Recipe ని అందిస్తున్నాం చూడండి.
కొంతమంది కాఫీ తాగటం కంటే ఒక కప్పు చాయ్ తాగటానికే ఎక్కువ ఇష్టపడతారు. అయితే చాయ్ తయారు చేయటం కంటే కాఫీ చేసుకోవడం చాలా తేలిక. ఎందుకంటే ఇన్‌స్టంట్ కాఫీ పొడులు అందుబాటులో ఉంటాయి, ఒక కప్పు వేడివేడి పాలల్లో ఒక స్పూన్ కాఫీ పొడి, తియ్యదనం కోసం ఇంకో స్పూన్ చక్కెర వేస్తే అప్పటికప్పుడే కాఫీ రెడీ అయిపోతుంది. చక్కెర లేకుండా కాఫీ తాగినా మంచిదే.
కానీ.. టీ చెయ్యాలంటే పాలు వేడిచేసి, అందులో టీపొడి, చక్కెర వేసి, ఆపై మరిగించి అది అయ్యాక వడకట్టి తాగాలంటే ప్రాసెస్ పెద్దగా అయిపోతుంది. ఇదంతా ఎందుకని ఇన్‌స్టంట్ కాఫీ తాగిన సందర్భాలు చాలా మందికి ఉండే ఉంటాయి. టీ డిప్పింగ్ బ్యాగ్స్ అందుబాటులో ఉన్నప్పటికీ, ఆ టీ తాగే బదులు బయట చాయ్ దుక్నంకు వెళ్లి, అందుబాటులో ఉండే ఏదో ఒక చాయ్ తాగడం బెటర్ అనిపిస్తుంది.
ఇన్‌స్టంట్ కాఫీ పొడి ఉన్నట్లే టీ పొడి ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా? ఇంతవరకు ఈ మార్కెటింగ్ ఐడియా ఎవరికీ రానట్లు ఉంది, కానీ మేము మీకు ఇక్కడ అందిస్తున్నాం. ఈ రెసిపీ ఐడియా మీ జీవితాన్నే మార్చేయవచ్చు. ఇది మీకు మీరుగా మీ ఇంట్లో అప్పటికప్పుడే కలుపుకొని తాగేసే మంచి మసాలా చాయ్ రెసిపీ. ఇందుకు మీ ఇంట్లో అందుబాటులో ఉండే మసాలా దునుసులు చాలు. ఇన్‌స్టంట్ మసాలా టీ మిక్స్ ఎలా తయారు చేయాలి, కావలసిన పదార్థాలేమిటో ఇక్కడ తెలుసుకోండి.
Instant Masala Tea Recipe కోసం కావలసినవి
- 1/4 కప్పు లవంగాలు
- 1/4 కప్పు ఆకుపచ్చ ఏలకులు
- 1/4 కప్పు నల్ల మిరియాలు
- 1 టేబుల్ స్పూన్ ఫెన్నెల్ విత్తనాలు
- 1 ఆరు అంగుళాల దాల్చిన చెక్క
- 2 టేబుల్ స్పూన్లు అల్లంపొడి
- 1 జాజికాయ తురుము
- 1 స్టార్ సోంపు
ఇన్‌స్టంట్ మసాలా చాయ్ రెసిపీ- తయారీ విధానం
పైన పేర్కొన్న అన్ని పదార్థాలను గ్రైండర్‌లో వేసి పొడిగా రుబ్బండి. అంతే!
ఎంత సింపుల్‌గా ఉంది కదా. దీనిని మీరు వేడివేడి పాలల్లో కలుపుకొని అలాగే తాగేయొచ్చు.
ఒక కప్పు పాలల్లో 1/4 టీస్పూన్ పొడిని కలపాలి, రుచికోసం చక్కెర కలుపుకోవచ్చు.
ఈ ఇన్‌స్టంట్ మసాలా టీ పొడి గాలి చొరబడని కంటైనర్‌లో నిల్వ చేయండి. ఒక నెలపాటు ఉపయోగించుకోవచ్చు.
ఈ టీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ శీతాకాలంలో మంచి రోగనిరోధక శక్తి లభిస్తుంది.
ఇంకేం..తక్షణమే తక్షణ మసాలా చాయ్ చేసుకొని తాగండి, తాగండి ఉల్లాసంగా ఉత్సాహంగా.
సంబంధిత కథనం
టాపిక్