Drinking Coffee । చక్కెర లేకుండా కాఫీ తాగితే, ఎక్కువ కాలం జీవిస్తారట!-drinking unsweetened coffee may lower risk of death says study ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Drinking Coffee । చక్కెర లేకుండా కాఫీ తాగితే, ఎక్కువ కాలం జీవిస్తారట!

Drinking Coffee । చక్కెర లేకుండా కాఫీ తాగితే, ఎక్కువ కాలం జీవిస్తారట!

Published Sep 14, 2022 06:48 PM IST HT Telugu Desk
Published Sep 14, 2022 06:48 PM IST

  • కాఫీ తాగని వారితో పోల్చితే, మితంగా కాఫీ తాగేవారే ఎక్కువ కాలం బ్రతుకుతారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. చక్కెర లేకుండా లేదా కొద్దిగా చక్కెర కలుపుకొని రోజుకు 1.5 కప్పుల నుంచి 3.5 కప్పులకు మించకుండా కాఫీ తాగితే, అది వ్యక్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ అధ్యయనంలో యూకేకు చెందిన సుమారు 1 లక్షా 70 వేల మంది వ్యక్తుల కాఫీ వినియోగ అలవాట్లను తెలుసుకున్నారు. వారికున్న గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధులతో సంబంధం లేకుండా 7 సంవత్సరాల ఫాలో-అప్ డేటాను పరిశీలించారు. అయితే ఇందులో కాఫీ అలవాటు కలిగిన వారి మరణాల రేటు 16 నుండి 21 శాతం తక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. వీరి పరిశోధన ఫలితాలు అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్‌లో ప్రచురితమయ్యాయి.

More