Telugu News  /  Lifestyle  /  Clear Mushroom Soup For Winter For Good Health Here Is The Recipe
క్లియర్ మష్రూమ్ సూప్
క్లియర్ మష్రూమ్ సూప్

Clear Mushroom Soup Recipe : హాట్ హాట్ క్లియర్ మష్రూమ్ సూప్.. చలికాలంలో బెస్ట్ బ్రేక్​ఫాస్ట్

15 November 2022, 6:49 ISTGeddam Vijaya Madhuri
15 November 2022, 6:49 IST

Clear Mushroom Soup Recipe : మష్రూమ్స్ ఆరోగ్యానికి మంచివని మనందరికీ తెలుసు. బరువు తగ్గాలి అనుకునేవారికి ఇది మంచి ఎంపిక. చలికాలంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలనుకునేవారు.. ఆరోగ్యంగా ఉండాలనుకునే ప్రతి ఒక్కరూ తమ డైట్​లో మష్రూమ్స్​ తీసుకోవచ్చు. ముఖ్యంగా సూప్​ రూపంలో తీసుకుంటే దాని ప్రయోజనాలు మరిన్ని ఎక్కువ పొందవచ్చు.

Clear Mushroom Soup Recipe : మీ రోజుని తేలికైన, ఆరోగ్యకరమైన వంటకంతో ప్రారంభించాలనుకుంటే క్లియర్ మష్రూమ్ సూప్ మీకు మంచి ఎంపిక. ఇది హెల్తీ మాత్రమే కాదు.. రుచికరమైనది కూడా. చలికాలంలో ఉదయాన్నే ఓ కప్పు మష్రూమ్ సూప్​తో మీ డే స్టార్ట్ చేస్తే.. మీరు కావాల్సిన పోషకాలు పొందవచ్చు. ఈ చలిలో వెచ్చదనాన్ని మీరు పొందవచ్చు. మరి దీనిని ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

కావాల్సిన పదార్థాలు

* మష్రూమ్‌లు - 200 గ్రాములు

* స్ప్రింగ్ ఆనియన్స్ - 2 కప్పులు

* నువ్వుల నూనె - 1/2 టేబుల్ స్పూన్

* వెల్లుల్లి - 1 టేబుల్ స్పూన్ (సన్నగా తరిగినవి)

* అల్లం - 1/2 అంగుళం (సన్నగా తరగాలి)

* సెలరీ - 1 టేబుల్ స్పూన్ (సన్నగా తరగాలి)

* పెప్పర్ - 1/2 టీస్పూన్

* సోయా సాస్ - 1 టేబుల్ స్పూన్

* నీళ్లు - 3 కప్పులు

* ఉప్పు - తగినంత

* ఉల్లిపాయలు - 5 టేబుల్ స్పూన్స్

* లవంగాలు - 2

తయారీ విధానం

మష్రూమ్‌లను బాగా కడిగి.. వాటిని తుడవండి. అనంతరం ముక్కలు చేయండి. ముందుగా పాన్‌లో నూనె వేసి వేడి చేయండి. దానిలో వెల్లుల్లి, అల్లం వేసి కొన్ని సెకన్లు వేయించండి. -స్పింగ్ ఆనియన్స్, ఉల్లిపాయలు వేసి.. ఒక నిమిషం పాటు వేయించండి. దానిలో పుట్టగొడుగులను, సెలెరీని వేసి బాగా కలపండి. మీడియం మంట మీద రెండు నిమిషాలు వేయించండి. ఇప్పుడు 3 కప్పుల నీరు వేసి కలిపి.. మరగనివ్వండి.

5 నిముషాల తర్వాత.. దానిలో సోయా సాస్ వేయండి. పెప్పర్, సాల్ట్ వేసి.. కలపండి. మష్రూమ్స్ ఉడికే వరకు దానిపై మూత వేసి.. ఉడకనివ్వాలి. అనంతరం స్టౌవ్ ఆపేసి.. టేస్ట్ చెక్ చేసుకోండి. మీ రుచికి తగ్గట్లు ఏమైనా అవసరమైతే.. వాటిని కలపండి. వేడిగా సర్వ్ చేసుకుని ఆస్వాదించండి.

టాపిక్