Soya Tikki Recipe : హెల్తీ హెల్తీ సోయా టిక్కీ.. ఎలా తయారు చేయాలంటే..
Soya Tikki Recipe : మిల్మేకర్ను చాలా మంది ఉపయోగిస్తూ ఉంటారు. పులావ్‌లో, కర్రీలో ఇలా చాలా విధాలుగా దానిని తయారు చేస్తారు. అయితే దీనికి బేసిక్‌గా టేస్ట్ ఏమి ఉండదు. కానీ ఇది హెల్త్‌కి చాలా మంచిది. మరి దీన్ని మరింత టేస్టీగా ఎలా తీసుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ రెసిపీ మీకోసమే..
Soya Tikki Recipe : సోయా రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఈ ఆరోగ్య ప్రయోజనాలు పొందేందుకు చాలా మంది దీనిని తమ వంటకాల్లో ఉపయోగిస్తారు. అయితే దీనిని మీ లంచ్‌లో మంచి స్టార్టర్‌గా ఉపయోగించాలన్నా.. లేదంటే సాయంత్రం మీ టీకి ఓ మంచి పార్టనర్‌గా తీసుకోవాలనుకున్నా.. మీరు సోయా టిక్కీ రెసిపీని తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేసుకోవడం చాలా ముఖ్యం. మరి దీనిని ఎలా తయారు చేసుకోవాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
* సోయా - 2 కప్పులు (గ్రాన్యూల్స్‌ను గోరువెచ్చని నీటిలో 10-15 నిమిషాలు నానబెట్టండి )
* ఉల్లిపాయ - 1 (సన్నగా తరిగినది)
* కారం - 1 టీస్పూన్
* ధనియాల పొడి - 1 టీస్పూన్
* జీలకర్ర పొడి - ½ టీస్పూన్
* పసుపు - ¼ టీస్పూన్
* పచ్చిమిర్చి - 2 (తరిగినవి)
* బంగాళదుంపలు - 2 ఉడకబెట్టండి
* ఉప్పు - రుచికి తగినంత
* నిమ్మరసం - 1 టేబుల్ స్పూన్
* తాజా కొత్తిమీర - 2-3 స్పూన్స్ (తరిగినది)
* బ్రెడ్ ముక్కలు - ¼ కప్పు (పొడి చేయండి)
* నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ విధానం
ఒక గిన్నెలో సోయా గ్రాన్యూల్స్ తీసుకోండి. ఉల్లిపాయ, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, పచ్చిమిర్చి వేసి బాగా కలపండి. దానిలో బంగాళదుంపలు వేసి బాగా కలపాలి. ఉప్పు, నిమ్మరసం, కొత్తిమీర తరుగు, బ్రెడ్‌క్రంబ్స్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని సమాన భాగాలుగా చేసి.. టిక్కీలుగా చేయండి.
ఇప్పుడు నాన్ స్టిక్ పాన్‌లో కొంచెం నూనె వేసి వేడి చేయండి. తయారు చేసుకున్న టిక్కీలను.. దానిలో వేసి.. బంగారు రంగు వచ్చేవరకు వేయించండి. ఎక్స్ట్రా ఆయిల్ పోయేలా టిష్యూలమీద ఉంచంది. దానిని తరిగిన కొత్తిమీర ఆకులతో, నిమ్మకాయతో గార్నిష్ చేసి.. వేడిగా సర్వ్ చేయండి.
సంబంధిత కథనం