ఉదయం అల్పాహారం చేయడం తప్పనిసరి, ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే ఆరోగ్య ప్రయోజనాలు కోల్పోవాల్సి వస్తుందని పోషకాహార నిపుణులు చెబుతారు. అయితే మీరెప్పుడైనా బుల్లెట్ ప్రూఫ్ కాఫీ గురించి విన్నారా? దీనినే బుల్లెట్ కాఫీ అని కూడా అంటారు. ఈ కాఫీని అల్పాహారానికి ఒక ప్రత్యామ్నాయంగా చెప్తారు. అంటే ఈ కాఫీ తీసుకుంటే అల్పాహారం చేసేసినట్లే.
బుల్లెట్ కాఫీ ఇప్పుడు కొత్తగా వచ్చిందేమి కాదు చాలా పాతదే. కానీ కొద్దికాలంలోనే జనాదరణ పొందింది. బరువు తగ్గాలనుకునే వారు ఈ బుల్లెట్ ప్రూఫ్ కాఫీ తాగుతారు. ఈ కాఫీ అధిక కేలరీల సమ్మేళనాన్ని కీటోజెనిసిస్ చేస్తుంది. ఆహరంలో కార్బోహైడ్రేట్లు తీసుకోనపుడు ఈ కాఫీ కొవ్వులను కరిగించి ఆ రకంగా శరీరం శక్తిని వినియోగించుకునేలా సహాయపడుతుంది. హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వంటి వారు బుల్లెట్ ప్రూఫ్ కాఫీ తమ డైలీ రొటీన్‌లో కలిగి ఉన్నారు.
బుల్లెట్‌ప్రూఫ్ కాఫీ అనేది కాఫీ పొడి, నూనె అలాగే వెన్న మిళితం అయి ఉండే పానీయం. వేడి వేడిగా తాగితే వెచ్చని క్రీమి లాటే ద్రవం తాగుతున్నట్లు అనిపిస్తుంది.
బుల్లెట్‌ప్రూఫ్ కాఫీ అనేది కాఫీ పొడి, నూనె అలాగే వెన్న మిళితం అయి ఉండే పానీయం. వేడి వేడిగా తాగితే వెచ్చని క్రీమి లాటే ద్రవం తాగుతున్నట్లు అనిపిస్తుంది. ఉదయం పూట దీనిని తాగితే చాలాసేపు వరకు ఆకలిని నివారించవచ్చు, పనులు చేసుకోవడానికి తగినంత శక్తి లభిస్తుంది. అంతేకాదు మానసికంగా చురుకుగా అనిపిస్తుంది. ఏకాగ్రతతో పనిచేయగలుగుతారు.
బుల్లెట్ కాఫీని 4 దశలలో ఈ కింద విధంగా తయారు చేసుకోవచ్చు.
బుల్లెట్‌ప్రూఫ్ కాఫీలో కొవ్వు పదార్థాలు ఉన్నందున అల్పాహారానికి ప్రత్యామ్నాయంగా వినియోగిస్తారు. ఆ విధంగా బరువు తగ్గాలనుకునే వారు, కీటో డైట్ పాటించేవారు అల్పాహారం మానేయటానికి ఈ రకమైన కాఫీని ఎంచుకుంటారు.
ఈ కాఫీ తయారీలో వాడిన వివిధ రకాల పదార్థాలు మానసికంగా స్పష్టత కలిగి ఉండటానికి, డయాబిటీస్ ను అదుపులో ఉంచటానికి, ఆకలిని నివారించటానికి ఇలా కొన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఈ కాఫీని ఎల్లప్పుడూ కాకుండా మితంగా స్వల్పకాలం వరకు తీసుకుంటేనే మంచిదని వైద్యులు చెబుతున్నారు.
సంబంధిత కథనం