Butter Coffee Recipe : బరువు తగ్గడానికి బటర్ కాఫీ.. ఇలా చేసేయండి..
Butter Coffee for Weightloss : బరువు తగ్గాలంటే సరైన ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అయితే బరువు తగ్గడం కోసం ఇటీవల పలు రకాల డైట్లను ఫాలో అవుతున్నారు. వాటిలో కీటో డైట్ కూడా ఒకటి. ఈ డైట్లో భాగంగా బరువు తగ్గడానికి.. బటర్ కాఫీని తీసుకుంటున్నారు. దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? నిజంగానే దీనితో బరువు తగ్గుతారా? దీనిని ఎలా తయారు చేయాలి?
Butter Coffee for Weightloss : చాలామంది బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. తినడం మానేస్తారు. వ్యాయామం చేసేస్తారు. పలు డైట్స్ పాటిస్తారు. ఇలా ఎన్నెన్నో జాగ్రత్తలు తీసుకుంటూ బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తారు. అయితే దీనిలో భాగంగా చాలా మంది కీటో డైట్ చేస్తూ ఉంటారు. ఈ డైట్ ఎప్పటినుంచో ఉన్నదే అయినా.. తాజాగా ఈ డైట్లోని ఓ కాఫీ బరువు తగ్గాలి అనుకునేవారి ఆశలు సజీవం చేస్తుంది. ఈ కాఫీ తాగితే బరువు తగ్గుతామని చాలామంది ట్రై చేస్తున్నారు కూడా. ఇంతకీ ఈ బటర్ కాఫీని ఎలా తయారు చేయాలి.. బరువు తగ్గడానికి ఇది ఏ విధంగా పని చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
బటర్ కాఫీలో ఉండే పోషక విలువలు
బటర్ కాఫీతో మీరు బరువు తగ్గుతారో లేదో తెలుసుకునేముందు.. దానిలో ఉండే పోషకాలు ఏంటో తెలుసుకోవాలి. ఓ కప్పు బటర్ కాఫీలో ఏమేమి ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
* కేలరీలు : 445 గ్రాములు
* పిండి పదార్థాలు : 0 గ్రాములు
* మొత్తం కొవ్వు : 50 గ్రాములు
* ప్రోటీన్ : 0 గ్రాములు
* ఫైబర్ : 0 గ్రాములు
* సోడియం : 9% సూచన రోజువారీ తీసుకోవడం (RDI)
* విటమిన్ A : RDIలో 20%
దీనిలో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. బటర్ కాఫీలోని కొవ్వులో 85 శాతం.. సంతృప్త కొవ్వు. ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. సంతృప్త కొవ్వు కూడా గుండె పరిస్థితుల ప్రమాదంతో ముడిపడి ఉంది. కాబట్టి మీరు బటర్ కాఫీలోని సంతృప్త కొవ్వులను బహుళ అసంతృప్త కొవ్వులతో భర్తీ చేయడానికి ప్రయత్నించాలి.
బరువు తగ్గడానికి ఎలా సహాయపడుతుందంటే..
బటర్ కాఫీలోని అధిక కేలరీలు, అధిక మొత్తంలో కొవ్వు ఆకలిని అరికడతాయి. తద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అధిక మొత్తంలో కొవ్వు జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. దీంతో మీరు ఎక్కువ కాలం పాటు కడుపు నిండుగా ఉన్న అనుభూతిని పొందుతారు.
వ్యాయామం చేయడానికి శక్తినిస్తుంది..
కాఫీ ప్రాథమికంగా ప్రీ-వర్కౌట్ పానీయంగా ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే ఇది మీ శక్తి స్థాయిలు ఎక్కువగా ఉండేలా చేస్తుంది. వర్క్ అవుట్ సమయంలో మీరు అలసిపోకుండా చూస్తుంది. బటర్ కాఫీ అదే శక్తిని అందించడంలో సహాయపడుతుంది. మీరు శక్తిని కోల్పోకుండా మీ కేలరీలను సులభంగా బర్న్ చేసుకోవచ్చు.
ఇంట్లోనే బటర్ కాఫీ ఎలా తయారు చేసుకోవచ్చంటే..
బటర్ కాఫీ చేయడానికి.. ముందుగా పాన్ తీసుకోండి. దానిలో నీటిని వేసి వేడిచేయండి. నీరు వేడెక్కుతున్నప్పుడు.. రెండు టేబుల్ స్పూన్ల గ్రౌండ్ కాఫీని వేసి మరిగించండి. ఇప్పుడు మరొక కప్పులో ఒక టీస్పూన్ వెన్నను తీసుకోండి. దానిలో ఒక చెంచా కొబ్బరి నూనె కూడా వేసి బాగా కలపండి.
కాఫీ మరిగిన తర్వాత.. దానిని కాఫీని మగ్‌లో వేయండి. నూనె, వెన్న, కాఫీని బ్లెండర్లో వేసి బాగా కలపండి. అంతే మీ బటర్ కాఫీ మీరు తాగేందుకు రెడీగా ఉంది.
Desclimer : పైన పేర్కొన్న చిట్కాలు, సూచనలు సాధారణ సమాచార ప్రయోజనం కోసం మాత్రమే తప్పా.. వృత్తిపరమైన వైద్య సలహాగా భావించకూడదు. వీటిని ప్రయత్నించేటప్పుడు.. వైద్యుడిని లేదా డైటీషియన్‌ని సంప్రదించండి.
సంబంధిత కథనం
టాపిక్